Thursday, December 29, 2016

NDTV లో గొలుసు కంపెనీల పెట్టుబడులు, NDTV ప్రతిస్పందన

ఈ రోజు NDTV హోమ్ పేజీ లో ఒక న్యూస్ మనలని ఆకర్షిస్తుంది .




 ఆ వార్తా తాలూకు వివరాలు కింద లింక్ లో .

http://www.ndtv.com/communication/posttruthgurus-com-more-fake-news-about-ndtv-1642994?pfrom=home-topstories

నేను పూర్తిగా చదవలేదు , కానీ పైపైన చదివిన దానిని బట్టి , NDTV లో పెట్టుబడులు ఏ విధంగా ప్రవహించాయో , IT డిపార్ట్మెంట్ వాళ్ళ ఆరాలు , enquiries , మొదలగు వివరాలు.

ఎవరో pgurus అంట.

https://www.pgurus.com/ndtv-director-kvl-narayan-rao-admits-guilt-of-illegal-money-routing-of-150m-through-netherlands/

చూస్తుంటే మనీ లాండరింగ్ లో NDTV కి కూడా పెద్ద పాత్రే ఉన్నట్టుంది .


Wednesday, November 23, 2016

మోడీ కి వ్యతిరేఖంగా ప్రతిపక్షాలని కూడగడతానంటున్న పాకిస్తాన్



ప్రతిపక్షాన్ని ఎగదోస్తామని పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించింది. ఇంత ఆగ్రహానికి కారణం మోడీ ఆ దేశానికి ఊపిరి ఆడనీయకపోవడమే.

వాళ్ళు కాల్పుల ఒప్పందం ఉల్లంఘించిన ప్రతీసారి చేతులు ముడుచుకుని కూర్చోకుండా , వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే సమాధానాలు ఇస్తుండడం, ఏ  నిమిషం లో ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విపరీతంగా సతమతమైపోతున్నారు. మీరు పాకిస్తాన్ న్యూస్ పేపర్స్  చదివితే మోడీ  ని విపరీతంగా తిడుతూ ఎడిటోరియల్స్ ఉంటున్నాయి .




సోషల్ మీడియా లో కాశ్మీర్ పోరాటాన్ని (??) లేవనెత్తడం , ముఖ్యంగా ఇండియా లో మోడీ వ్యతిరేఖించేవారికి సహయం చేయడం లాంటివి వాళ్ళ ప్రధాన అంశాలని తెలుస్తుంది .





చూస్తుంటే కొన్ని వెబ్ పత్రికలకి పంట పండినట్టే ఉంది . మన తెలుగులో కూడా ఉన్నాయి గా. అంతే కాదు కొంతమంది ఫేస్బుక్ యూసర్ ల అకౌంట్ నిండిపోతుందేమో . ???


Saturday, November 19, 2016

సెక్స్ అబ్యూస్ / రేప్ పనిష్మెంట్ గా బాధితురాలిని పెళ్లి చేసుకుంటే చాలు , టర్కీ లో వివాదాస్పద బిల్

మైనర్ ని పెళ్లి చేసుకునేలా చట్టం రూపొందించడం పై టర్కీ లో వివిధ ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి .

http://www.dawn.com/news/1297339/anger-in-turkey-at-bill-to-quash-child-sex-convictions

మిలిటరీ తిరుగుబాటు తరువాత , ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ కి మతి చెలించినట్లుంది .

మైనర్ ని సెక్సువల్ గా అస్సౌల్త్ చేసిన వాళ్లకి ఇక ఏ మాత్రం శిక్ష ఉండదు . ప్రభుత్వ శుష్క వాదన ఏంటంటే ..  చైల్డ్ మ్యారేజ్ లని కంట్రోల్ చేయడానికె ఈ బిల్ పెట్టామని వాదిస్తుంది .

the law would allow the release from prison of men guilty of assaulting a minor if the act was committed without “force, threat, or any other restriction on consent” and if the aggressor “marries the victim”.

చైల్డ్ marriages టర్కీ సౌత్ ఈస్ట్ లో చాలా కామన్ , కానీ అందరిని శిక్షించలేక, ఆ జనాలని జైలు నుండి రిలీజ్ చేయించడానికి ఈ బిల్ పెట్టినట్టుంది .

టర్కీ ఆల్రెడీ ఇస్లామాజషన్ వైపు ప్రయాణిస్తుంది .  రాడికల్ ఇస్లాం మాత్రమే తనని రక్షిస్తుంది అని అధ్యక్షుడు బలంగా నమ్ముతున్నాడు . కొన్ని వేలమంది జడ్జ్ లని , విలేఖరి లని ( చైనా కన్నా ఎక్కువ ) , ప్రభుత్వ అధికారులని మిలిటరీ తిరుగుబాటు కి మద్దతు తెలిపారని జైలు లో వేసి తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు .

మిలిటరీ తిరుగుబాటు చేసింది చాలా తక్కువ మంది ,అది కూడా క్రింద స్థాయి సైనికులు .
తనని తాను మరింత బలమైన నాయకుడి గా చేసుకుని , అధికారాల్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి అధ్యక్షుడే ఈ నాటకం ఆడినట్టు చాలా దేశాలు అనుమానిస్తున్నాయి .

అంతే కాదు ,  దీనికి కారణం Fethullah gulen దీనికి అని చెప్పి , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని స్కూల్ అన్నింటిని మూయించడం మొదలెట్టాడు . ఎర్డోగాన్ రాకతో ,  పాకిస్తాన్ ఇంచుమించు నాలుగు వందలమంది టర్కీ టీచర్ లు మరియు కుటుంబ సభ్యులని వెంటనే దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది .  పది , ఇరవై సంవత్సరాల నుండి నివసిస్తున్న అందరు ఇప్పుడు కన్నీళ్లతో , భయంగా ( టర్కీ లో వీళ్ళ భవిష్యత్తు పై ఆశలు లేక ) వెళ్తున్నారు .

మళ్ళి ఇదే పాకిస్తాన్ ట్రంప్ ని ముస్లిం లని దేశం లో రానీయను అని చెప్పినందుకు విమర్శిస్తుంది , ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే .




Monday, November 14, 2016

జపాన్ తో అణు ఒప్పందం తో చైనా కి చెక్ పెట్టిన ఇండియా

పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ కి అణు సరఫరా చేస్తూ, మనకి సుద్దులు చెప్పే చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది . ఎందుకంటే NSG లో చేరకుండానే జపాన్ మనతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం .

మోడీ జపాన్ పర్యటన లో ఉండగానే , చైనా మీడియా మనల్ని హెచ్చరిస్తూ ఒక కథనం రాయడమే దీనికి ఉదాహరణ .

NSG లో చేరడానికి మనకి  ఎన్ని అడ్డంకులు స్పృష్టించాలో అన్ని చేసి , తీవ్రవాదుల మీద చర్యలని అడ్డుకుని , వివాదాస్పద కాశ్మీర్ నుండి పాకిస్తాన్ కి cpec బిల్డ్ చేయడం , అరుణాచలప్రదేశ్ ని వివాదాస్పదం చేయడం ,  cpec కి అడ్డు రాకుండా ఉండటానికి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లకి బిలియన్స్ డాలర్ లని లంచంగా  ఇవ్వడం , తిరిగి వాళ్ళు అది మన మీద వాడటం .

ఇన్ని దారుణాలు చేస్తూ ఇండియా అభివృద్ధి ని అడ్డుకుంటూ వస్తుందో మన చైనా అభిమానులు గమనించాలి .



Friday, November 11, 2016

పాకిస్తాన్ టెర్రరిజమ్ వెనక చైనా హస్తం , హఫీజ్ సయెద్ మీద చర్యలకి మోకాలడ్డు

మసూద్ హజార్
జైషే మహమ్మద్
హఫీజ్ సయెద్
లష్కరే తోయిబా
హిజ్బుల్ ముజాహిదీన్
 సయెద్ సలావుద్దీన్

ఈ పేర్లు వింటుంటే మీ రక్తం ఉడికిపోతుంది కదా . కానీ ఈ సంస్థ ల మీద , టెర్రరిస్ట్ ల మీద ఆంక్షలకి , చర్యలకి ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసా ?  చైనా .

అవును చైనా నే .

2011 లో మసూద్ హాజర్ మీద చర్యలకి చైనా మోకాలడ్డింది . ఇప్పుడు అన్ని సాక్ష్యాధారాలు ఇఛ్చిన తరువాత కూడా హఫీజ్ సయెద్ మీద చర్యలకి భద్రతా సమితి లో మళ్ళి మోకాలడ్డింది .


చైనా కి ఇండియా మీద ఉన్న ద్వేషం ఈ విధంగా తీర్చుకుంటుంది అంతే కాదు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజాన్ని తన వంతు సహకారాన్ని ఇస్తుంది .

2009 లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ హజార్ మీద ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల కి అడ్డుపడింది .
2010 లో హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ ని టెర్రరిస్ట్ ల లిస్ట్ లో పెట్టడాన్ని అడ్డుకుంది .
 ఇలా చాలా సార్లు ఇండియా ప్రయత్నాల్ని తనకున్న వీటో అధికారం తో అడ్డుకుంది .

ఈ మధ్యన ముంబై లో జనాలని ఊచకోత కోసిన హఫీజ్ సయ్యద్ మీద చర్యలని రెండు సార్లు వరసనే అడ్డుకంది , గత నెలలో దానిని పొడిగించింది కూడా.

హఫీజ్ సయ్యద్ బహిరంగంగా నే టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే .

ఇండియా అభ్యంతరాలని తోసిపుఛ్చి వివాదాస్పద కాశ్మీర్ లో cpec ని నిర్మించడం కూడా చైనా కి ఇండియా మీద ఉన్న ద్వేషం చూపించింది .

ఇవన్నీ చేసి, తిరిగి , టెర్రరిజాన్ని అంతం చేయాలని వివిధ వేదిక ల మీద అబద్దాలు ప్రచారం చేస్తూ ఉంటుంది .

ఏ విధంగా అయినా కాశ్మీర్ లో అల్లకల్లోలం స్పృష్టించాలని పాకిస్తాన్ చేసే పన్నాగాలకి చైనా ఎప్పుడు సహకారం ఇస్తూనే ఉంది, ఇస్తూనే ఉంటుంది అనే తెలుస్తుంది .

source:

. https://www.quora.com/Why-did-China-block-Indias-move-in-the-UN-demanding-action-against-Pakistan-over-the-release-of-Mumbai-attack-mastermind-Zakiur-Rehman-Lakhvi

quora లో చాలా లింక్స్ ఉన్నాయి with genuine links.



Wednesday, November 9, 2016

ములుగు గారి జ్యోతిష్యం తప్పింది , KT astro గారిది నిజమయ్యింది

నేను జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్మకపోయినా కొంత వరకు ఫాలో అవుతుంటాను . 

కాకపోతే ఈ మధ్యన నేను ఫాలో అవుతున్న  ఇద్దరు జ్యోతిష్యులు పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వెల్లడించేసరికి ఆశ్చర్యం వేసింది . 
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారూ హిల్లరీ గెలుస్తుందని ఘంటాపధంగా చెప్పారు . 


కానీ ఆ తరువాత క్షమాపణలు చెప్తూ మరొక పోస్ట్ చేశారు  


కాకపోతే ఏ విధంగా అంచనా తప్పింది అని చెప్పలేదు , ఆయిన చెప్పినా నేను అర్ధం చేసుకోలేను . 

కాకపోతే వేరొక వేదిక్ జ్యోతిష్యులు ఇది కరెక్ట్ గా ఊహించారు . ఆల్మోస్ట్ 1 ఇయర్ క్రితమే ఆయన ఆ పోస్ట్ రాశారు . 
http://www.ktastro.com/

ఈ రెండు సైట్ లు అప్పుడప్పుడు ఓపెన్ చేయడం వల్ల  నాకు కొంచెం ఉత్సుకత గా అనిపించి , స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను , అంతే కానీ ఇది ఎవరిని అవమానించాలని కాదు . 


Friday, November 4, 2016

కాశ్మీర్ లో బడులకి , స్కూల్ కి నిప్పు పెడుతున్న ఇస్లామిక్ చాంధసవాదులు , నోరు మెదపని మన నాయకులు మరియు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని బ్రతికే లౌకిక వాదులు

 కాశ్మీర్ లో బడులకి , స్కూల్ కి నిప్పు పెడుతున్న ఇస్లామిక్ చాంధసవాదులు , నోరు మెదపని మన నాయకులు మరియు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని బ్రతికే లౌకిక వాదులు

ఈ రోజు ఈనాడు లో ఈ ఆర్టికల్ చూసారా ?
కాశ్మిర్ లో స్కూళ్ల ని అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు ఈ ఇస్లామిక్ చాంధసవాదులు. కేవలం రెండు నెలలు లో ఇరవై అయిదు స్కూళ్ళని కాల్చేశారు . పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ తెలుస్తుంది .

స్కూళ్ళు లో ఉంటె , పిల్లలు రాళ్లు విసరడానికి బయటకి రారు .  అన్న కారణం చే,  వాళ్ళ భవిష్యత్తు ని మంట కలిపేస్తూ ఉంటె, ఈ సో called కమ్మి లు మరియు నాయకులు చలి కాచుకుంటూ సోది కబుర్లు చెప్పుకుంటున్నారు , పోయేది సామాన్య జనాలే కాబట్టి వాళ్లకి ఈ పెయిన్ తెలియదు .





ఎంత మంది ఖండించారు ఈ అరాచాకాలని ?? కనీసం చదువు కి ఉన్న ప్రాముఖ్యత తెలియని ఈ జనాలు , అరాచకాలతో జనాల జీవితాలని  దుర్భరం చేస్తున్న ఈ జనాలు  కాశ్మిర్ కి స్వాతంత్య్రం కావాలంట , దానికి డప్పు వాయించేది మన నాయకులు . మలాలా ని కాల్చేసిన ఈ సిద్ధాంతాలు ఇప్పుడు కాశ్మిర్ లోకి అల్ల కల్లోలం స్పృష్టిస్తున్నాయి .

పాకిస్తాన్ ఈ మంటల్ని ఎగతోస్తుందని చెడ్డి లు వేసుకునే పిల్లగాడు కూడా చెప్పగలడు . కానీ వీళ్ళకి కనిపించదు . మళ్ళీ కన్నీరు కారుస్తూ వీళ్ళు రాతలు చదువుతుంటే , ఆ సిద్ధాంతాలు చదువుకున్నవాడు ఇంత దారుణంగా ఆలోచిస్తారా ? అని అనిపిస్తుంది .
చదువు ప్రాముఖ్యత తెలియని ఈ సన్నాసులు కి వంత పాడేది మన మధ్యలో ఉన్న నాయకులు మరియు లౌకిక వాదమనే ముసుగు వేసుకుని మన మధ్యలో ఉన్న జనాలు .
ఈ మధ్యన , వార్తలు పేరుతో తన అక్కసుని వెళ్ళకక్కే బ్లాగర్ ఏం రాసారో తెలుసా ?
"కాశ్మీర్ ప్రజలు ఆరాధించే బురాన్ వని " అంటూ .....   ఇలాంటి రాతలు తో స్కూల్లే కాదు రాష్ట్రాలు కూడా తగలబడి పోతాయి.
ఫేస్బుక్ లో కొంతమంది ప్రజాస్వామ్యవాదులం అంటూ , కమ్యూనిజం అంటూ AC లో కూర్చుని రాసే రాతలు చదివితే 70-80 లలో  జనం బుర్రలు ఎలా మారిపోయాయి అర్ధం అవుతుంది .

కాశ్మీర్ అల్ల కల్లోలం అవ్వడానికి కారణం తెలిసి కూడా, తెలియనట్టు నటించడం , అంతే కాదు
చైనా గురించి కానీ,  సిల్క్ రోడ్ పేరుతో కాశ్మీర్ లో చైనా నిర్మిస్తున్న cpec గురించి కానీ , పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి కానీ రాయడానికి  కలలో కూడా మనస్కరించదు , వాటి గురించి అడిగితే ఆ కామెంట్ కూడా రాదు .






Monday, October 24, 2016

ఆంధ్రజ్యోతి పైత్యం ముదిరింది

చావు  ని కూడా సెన్సేషన్ చేసే ఆంధ్రజ్యోతి ని చూస్తుంటే , జర్నలిజం ఇంతలా దిగజారిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది . 

ఒక వ్యక్తి చావుని , ఎదో సెన్సేషన్ వార్త గా ప్రచురించడం ఎంత  వరకు భావ్యమో వాళ్ళే చెప్పాలి . 





మనిషి చావులో టి ఆర్ పి వెతుక్కునే ఈ జనాలని చూస్తుంటే  మొహం మీద కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది . 


Tuesday, August 23, 2016

Tuesday, August 9, 2016

నిజంగా టెర్రరిస్ట్ లను ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయా ?

సమాధానం చాలా ఈజీ , అవును అని చెప్పేయొచ్చూ . కాకపోతే మనం కొంచెం లోతు గా వెల్దాము .

యురోపియన్ దేశాలలో అతి ముఖ్యమైనది , ఆ ప్రభుత్వాలు ప్రజల పట్ల తీసుకునే జాగ్రత్త్తలు , మరియు ఫ్రీడమ్ . 
అందులో సోషల్ బెనిఫిట్స్ ( తెలుగు లో ఏమంటారో గుర్తు రావడం లేదు ) ఇంకా ముఖ్యమైనది . 

అంటే మీరు ఆయా దేశ పౌరుడు అయి ఉంటే , మీకు ఉద్యోగం లేనట్లయితే ప్రభుత్వమే మిమ్మల్ని పెంచి పోషిస్తుంది . 

మీకు ఉద్యోగం ఉండి , అది ఊడిపోతే ప్రభుత్వం ఇంచుమించు ఎనభై శాతం జీతం ఇస్తుంది ఒక సంవత్సరం వరకు. ఆ తరువాత తగ్గుతూ ఉంటుంది . 

అంతే కాదు ఉద్యోగం లేనివాళ్లు తమ నైపుణ్యాలు పెంచుకొనేందుకు కూడా సహాయం ఇస్తుంది . 

పెళ్ళై , పిల్లలు ఉంటె , ఇల్లు కూడా ఇస్తుంది . 

ఇందు కోసం కష్టపడి పని చేసేవాల్ల దగ్గర  టాక్స్ లు భారీగా వసులు చేస్తారు.  

ఇవి చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి .  చాలా మంది పనిచేయకుండా , ఏవేవో కారణాలు చెప్పి , అంటే మేము ఉద్యోగానికి పనికి రానని , నాకు ఆ జబ్బు , ఈ జబ్బు అని  ఇంట్లో ఖాళి గా కూర్చుని జల్సాలు చేస్తూ ఉంటారు . 

ఆ బెనిఫిట్స్ ఎంత బాగుంటాయంటే .. 

పిల్లలకి డబ్బులు , చదువు ఫ్రీ 
ఇల్లు ఫ్రీ 
జేబు ఖర్చులు ఫ్రీ 
ఇలా ఎన్నో .. 

అంతెందుకు , ఇప్పుడు యూరోప్ లో వలస వఛ్చిన వాళ్లకి కూడా వారానికి కొంత చొప్పున ఖర్చులకి ఇస్తుంది గవర్నమెంట్ . 


ఇది టెర్రరిస్ట్ లని పెంచి పోషించడమంటే .. 



Friday, July 1, 2016

బ్రెక్సిట్ మీద

బ్రెక్సిట్ మీద పుంఖానుపుంఖాలు పోస్ట్ లు ఏంటో .
అదేమి పెట్టుబడి దారి వ్యవస్థ కి అంతం కాదు కదా ?

నిజం చెప్పాలంటే , బ్రేక్సిట్  గోల ఇంకో సంవత్సరం ఉంటుందేమో , ఆ తరువాత మళ్ళీ అన్ని దేశాలతో ఒప్పందాలు జరుగుతాయి , యధావిధి గా జరిగేది జరుగుతుంది . ఆ గుంపు కాకపోతే ఇంకో గుంపు , చివరకి ఏదో ఒక గుంపు లో కలుస్తుంది.

కాకపోతే చైనా , పాకిస్తాన్ సంబంధాలు, cpec లాంటివి  ,  ఎన్ , ఎస్ జి  లో మనకి అడ్డు తగలడం ,  మిగతా అన్ని దేశాల పేపర్లు అనువదించే జనాలు , చైనా పేపర్లు లో ఇండియా కి వ్యతిరేఖంగా వచ్చ్చేవి వదిలేయడం ఎందుకు , చారిత్రక తప్పిదాలు అని చెప్పి తరువాత బాధపడ్డానికి కాకపోతే ...





Wednesday, March 23, 2016

బ్రెజిల్ కి బెల్జియం కి తేడా తెలియని సాక్షి.

బాబు , గత మూడు రోజులుగా టీవీ లు , పేపర్స్ అన్ని  నెత్తి నోరు బాదుకుని చెప్పినా ఈ రాసిన వారేవరుకో కనపడలేదు .


Friday, March 11, 2016

ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు దేశం సం***** పోవడానికి


అఫ్జల్ లాంటి వాడు ప్రతీ ఇంట్లో ఒక్కడు పుట్టిన భరించొచ్చెమొ , ఇలాంటి వాడు మాత్రం ఒక్కడు ఉంటె చాలు దేశానికి , ఆ దేశం మొత్తం సం************** పోవడానికి . 

Sunday, February 14, 2016

జె యన్ యు డ్రామా లు మొదలయ్యాయి , జె యన్ యు లో ఏం జరిగింది

జె యన్ యు లో ఏం జరిగింది ..
సింపుల్ ..

అఫ్జల్ గురు  ఉరి కి వ్యతిరేఖంగా విద్యార్దులు సమావేశం జరిపి నివాళులు అర్పించారు . ఇండియా కి వ్యతిరేఖంగా నినాదాలు చేసారు .

ఇక్కడ గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే , ఆ సమావేశం ఉరి కి వ్యతిరేఖంగా జరగలేదు . అఫ్జల్ గురు కి నివాళులు అర్పిస్తూ జరిగింది . అఫ్జల్ గురు ని ఉరితీసింది ఫిబ్రవరి 9 న . అదే రోజు జరిగిన సమావేశం ఉద్దేశ్యం ఏంటో మీకు అర్ధం అయి ఉండాలి .

అఫ్జల్ గురు ఎవరు ?? , భారత పార్లమెంట్ మీద దాడి చేసి, దేశం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవలుకున్న ఒక బేవార్స్ టెర్రరిస్ట్ . పాకిస్తాన్ చేత ట్రైనింగ్ అయి ఇండియా ని నాశనం చేయాలన్న గట్టి సంకల్పం తో ఉన్న ఒక ఉగ్రవాది .

http://daily.bhaskar.com/article/WOR-TOP-afzal-guru---s-confession-i-helped-them-took-training-in-pak-4175799-NOR.html


అటువంటి ఉగ్రవాది కి నివాళులు అర్పిస్తూ జరిగిన సమావేశం లో ఏ నినాదాలు చేసారో తెలుసా ??

“Go India… Go back…
Kashmir ki Azadi tak… Jung Rahegi… Jung Rahegi…
Bharat Ki Barbadi Tak… Jung Rahegi… Jung Rahegi”

అంటే ఇండియా వెనక్కి వెళ్లిపోవాలి . 
కాశ్మీర్ కి స్వాతంత్ర్యం ఇచ్చే వరకు యుద్దాలు జరుగుతూనే ఉంటాయి . 
భారత్ ని నాశనం చేసేవరకు  యుద్దాలు జరుగుతూనే ఉంటాయి . 

భారత ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి లతో యూనివెర్సిటి లలో చదువుతూ ఇలాంటి నినాదాలు చేస్తూ , ఉగ్రవాదులు సమర్దిస్తూ , పార్లమెంట్ దాడి ని సమర్దిస్తూ ( ఆ దాడి లో కొంత మంది సైనికులు కూడా చనిపోయారు ),  దేశం నాశనం అయోపోవాలని కోరుకునే ఈ స్టూడెంట్స్ ని ఏ category లో వేయాలో మీరే నిర్ణయించండి . 

ఇటువంటివి ఖండించాల్సింది పోయి , ఇలా దేశ వ్యతిరేఖ నినాదాలు చేసే వాళ్ళ మీద చర్య తీసుకుంటే అది హిందూ ఫాసిజం అని పిలుస్తున్న జనాలని చూస్తె భయంగా ఉంది .  
కులాలకి, మతాలకి అతీతంగా ఇటువంటి ఉగ్రవాదులు ( ఉగ్రవాదులని సమర్ధించే వాళ్ళు కూడా ఉగ్రవాదులే ) మీద చర్యలు తీసుకోవాలి .  ఇటువంటి వాళ మీద చర్యలు తీసుకున్నామని హోం మంత్రి , ప్రధాన మంత్రి కూడా గర్వంగా చాటిచెప్పేల ఉండాలి . 






 అఫ్జల్ గురు వీరుడు , శూరుడు అని పొగిడే ఈ జనాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడింది , బిజెపి మాత్రం ధైర్యంగా ముందడుగు వేసింది . 
ఇలాంటి దేశ వ్యతిరేఖ చర్యలని లెఫ్టిస్ట్ లు ఏ విధంగా సమర్దిన్చుకుంటారు ??

Saturday, February 13, 2016

కసబ్ ఏ పాపం చేసుకున్నాడు


కసబ్ ఏ పాపం చేసుకున్నాడు అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నాను .
అఫ్జన్ గురు కి నివాళులు అర్పించిన జె ఎన్ యు స్టూడెంట్స్ కసబ్  ని ఎందుకు పట్టించుకోవడం లేదు .
నిజం చెప్పాలంటే అఫ్జల్ గురు కన్నా కసబ్ వల్ల చనిపోయిన పౌరులే ఎక్కువ .
కసబ్ కేవలం పాకిస్తాన్ పౌరుడు అవ్వడం అతను చేసుకున్న దురదృష్టం , కాని అదే అతను ఏ కాశ్మీర్ కి చెందిన వాడు అయి ఉంటె , ఖచ్చితంగా కొంత మంది విద్యార్ధులకి మంచి రోల్ మోడల్ అయి ఉండేవాడు .

కాని పాకిస్తాన్ పౌరుడు అవ్వడం లో అతను తప్పేమీ లేదు . ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకుని పుట్టలేరు కదా , అందువల్ల అఫ్జల్  , యాకుబ్ కి స్మరిన్చుకున్నట్టే అతన్ని కూడా స్మరించుకోవాలని కోరుతున్నాను .

ఒక్క యాకుబ్ చనిపోతే వంద మంది యాకుబ్ లు పుడతారు ..
ఒక్క అఫ్జల్ చనిపోతే , వేల మంది అఫ్జల్ లు పుడతారు .
అలానే ..
ఒక్క కసబ్ చనిపోతే వేలమంది కసబ్ లు పుట్టి లక్షల మందిని చంపుతారు ఇలా రక్తం మరిగించే నినాదాలు చేయాలి .
మర్చిపోయాను, ఇలాంటి నినాదాలు నా చిన్నప్పుడు బాగా వినేవాన్ని , మా చిన్నాన లు కూడా చేసేవాళ్ళు , ఇప్పుడు కూడా చేస్తున్నారు కాకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు . వాళ్ళ పిల్లలు అయితే మరీనూ .. కనీసం వినపద్దట్టు కూడా నటించడం లేదు .


ఏది ఏమైనా, అజ్మల్ కసబ్ ని నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం తగదని , మిగతా వీరుల తో సమానంగా గౌరవించాలని మన ఏచూరి గారిని, కాంగ్రెస్ ని,  బిజెపి ( ??? ) ని కోరుకుంటున్నాను .


Wednesday, February 3, 2016

ఎం ఐ ఎం మేనిఫెస్టో విడుదల చేసిందంట , ఒక ఫన్ని న్యూస్

పాతబస్తీ ఎం ఐ ఎం జాగీరా  ??
అవును .. కాదంటే ఏం జరుగుతుందో అందరికి తెలుసు .

కాకపొతే ఒక ఫన్ని న్యూస్ .. గత 59 సంవత్సరాలలో  మొట్టమొదటి సారిగా  ఎం ఐ ఎం మేనిఫెస్టో విడుదల చేసిందంట .
వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే .. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరం గా మారుస్తారంటా :-) :-)


నాకు తెలుసు ఈపాటికి మీరు గట్టిగా నవ్వుతూ ఉంటారని . ..  ఇప్పటి వరకు రాలేదు కాని ఈ డౌట్ , ఎందుకో వాళ్ళ బుర్రలు మోకాల్లో గాని ఉన్నాయా ? ప్రపంచ స్థాయి నగరం అంటే పాతబస్తీ అనుకుంటున్నారేమో హి హి హి ..

మేనిఫెస్టో తయారు చేయడం కొంచెం కష్టమే సుమీ ..



మొన్న కాంగ్రెస్ నేతలని తన్ని పంపించారుగా బాగా , పాపం కనీసం రాజశేకర్రెడ్డి చేసిన సహాయం కూడా మర్చిపోయి అలా ఉతికి ఆరేస్తే ఎవ్వరితో చెప్పుకోవాలో తెలియక మన ఉత్తమ కుమారుడు , షబ్బీర్ కుమిలిపోతున్నారు. 






కాకపొతే నాది ఒక డౌట్ ..  ఎం ఐ ఎం ఎప్పటి నుండో ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతుంది కదా .. 
రాజకీయ పార్టి లు స్పందించకపోయినా పరవాలేదు .. 
కనీసం కుల సంఘాలు మాట్లాడకపోయినా పరవాలేదు .. 
మత సంఘాలు మాట్లాడకపోయినా ఏం చేయలేము .. 
కాని  మరి ఇతర కవులు ,  కళాకారులు , హక్కుల సంఘాలు వీళ్ళు కూడా ఎందుకు సైలెంట్ గా ఉండాలి ??
 నేనేమి కోపంగా అడగడం లేదండి బాబు , ఒట్టు ..మన సుమన్ రౌద్ర రసం లో అడిగినట్టే అడుగుతున్నా .. 


Tuesday, January 26, 2016

మేము దళితులం కాదు మొర్రో అని మొత్తుకుంటున్న రోహిత్ తండ్రి , ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది .

రోహిత్ వేముల దళితుడు కాదు , ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది .

రోహిత్ దళితుడి గా దొంగ సర్టిఫికేట్ తీసుకుని , మరొక వ్యక్తీ కి రావాల్సిన అవకాశాన్ని దొంగిలించాడు .
ఈ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారుల మీద , రోహిత్ కి సహకరించిన వ్యక్తుల మీద ప్రభుత్వం త్వరగా కేసు నమోదు చేయాలి .



http://www.sakshi.com/news/district/my-son-killed-308672?pfrom=home-top-story

తను వ్యవస్థ లో ఉన్న లోపాలని తనకి అనుకూలంగా మలుచుకుని లంచం ఇచ్చి లేక మరో పద్దతి లోనో  దళితుడు అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు , నిజానికి దీనికి చాలా ధైర్యం కావాలి .  ఇది నేరపూరితమైన చర్య  అటువంటి ఆలోచన రావడం కూడా తప్పే . దీనికి రోహిత్ తల్లి కూడా సమర్ధించారు , మీడియా సాక్షి గా ఆమె మేము మాల కులస్తులం  అని చెప్పారు , ఇది కూడా నేరమే . దీనిని బట్టి వీళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు .
విచారణ జరిపించి భాద్యులని శిక్షించాలి .

దుందుడుకు స్వభావం. 
రెచ్చగొట్టే చర్యలు ( బ్యానర్ లని కావాలని చింపడం ), ఒక మతాన్ని , వర్గాన్ని తిట్టడం .
రెచ్చగొట్టే ప్రసంగాలు .  ( ముంబై పేలుళ్లు నిందితులు ని సమర్దించడం , న్యాయ వ్యవస్థ ని అపహాస్యం చేసేటట్టు నినాదాలు  ) యాకుబ్ ని ఉరితీస్తే , మరో వందమంది యాకుబ్ లు వస్తారు అని ..

కేవలం రెచ్చగొట్టే పనులే తప్పిస్తే , నిజంగా తమ సామాజిక వర్గానికి మంచి చేసిన పనులేమి లేవు .


ఈ లోపు ..

ఫేస్బుక్ లో ,  ఆన్లైన్ లో , కొంతమంది మేధావులు (??) విపరీత పోకడలకి పోతున్నారు .

సెంట్రల్ యూనివర్సిటీ లు  అగ్రహారపు గురుకులాలంట , అందులో చదువుకునే అవకాశాలని ప్రభుత్వం దూరం చేస్తుందంట . యెంత హాస్యంగా ఉంది ఇది .  ఒక దుందుడుకు స్వభావం గల విద్యార్ది , తన విపరీతపు పోకడలతో చేసిన పనులకి , యూనివర్సిటీ రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటే , అతని కులాన్ని అడ్డం పెట్టుకుని ( అతను దళితుడు కాదు కూడా ) వీళ్ళ సొంత ఎజెండా బయటకి తీసి మేధావులు , కవులు అనే ముసుగులో  విద్యార్దుల మెదడలని కలుషితం చేస్తున్న దుర్మార్గపు చర్యలని చూడండి .

నాకు తెలిసి కొన్ని వేల మంది అడ్మిషన్స  పొందారు గత కొన్ని సంవత్సరాలలో , ఎవరిని ఆపారు .  ఇప్పుడు కూడా రోహిత్ ని హాస్టల్ నుండి సస్పెండ్ చేసారు ఎందుకంటే మిగతా జనాలతో కలిసి గొడవలు చేస్తున్నాడని , కాలేజీ వాతావరణం పాడు చేస్తున్నాడని అంతే కాని అతన్ని యూనివర్సిటీ నుండి బహిష్కరించలేదు . క్లాసు లకి అటెండ్ అవుతున్నాడు , హాస్టల్ బయటే ఒక టెంట్ వేసుకుని ఉంటున్నాడు , అతని స్నేహితుల గదుల్లో కి నిర్భయంగా వస్తు పోతూ కూడా ఉన్నాడు . అతన్ని ఎవ్వరు ఆపలేదు .

నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ," కాలేజీ నుండి సస్పెండ్ " చేసే శిక్షని , ఇక్కడ కూడా అదే జరిగింది .
అసలు రోహిత్ ఆత్మహత్య కి ఇప్పటకి సరిఅయిన కారణం తెలియడం లేదు . నిజం చెప్పాలంటే అసలు ఆత్మహత్య కి కారణం ఏంటో కనుక్కోవాలి .



ఈ  రచయతలు  ఆలోచనలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి . ఒక వర్గాన్ని తిట్టకుండా ఒక్క రచయత కూడా మాట్లాడడా ??

యూనివర్సిటీ చెప్పే కారణాలు చూడండి .. 



నిజం చెప్పాలంటే ఒక వ్యక్తీ ఆత్మహత్య మీద జరుగుతున్నా రాజకీయాలు , ఈ రాజకీయ రాబందులు చేసి పనులు చూస్తుంటే భయంగా ఉంది మనం ఎటు వైపు ప్రయాణిస్తున్నాం అని .
రోహిత్ శవం మీద చిల్లర ఏరుకుంటున్న ఈ రాబందులు మీద అసహ్యంగా అనిపించడం లేదా ?
రాహుల్ గాంధీ  నుండి చిల్లర సంఘాల వరకు ప్రతీ ఒక్కరు ఏదో ఒక విధంగా మైలేజి కోసం ఆత్రుత పడుతు కులాల కుంపట్లు రాజేస్తూ ఉన్నారే తప్ప  కుల నిర్మూలన కోసం ప్రయత్నించే ఒక్క నాయకుడు కూడా కనపడటం లేదు .

అసలు రోహిత్ చేసిన పనులు మంచివా చెడువా అనేది లేదు .

ఈ రోజు కాంగ్రెస్ , రేపు బిజెపి అంతే .






Saturday, January 23, 2016

రోహిత్ వేముల దళితుడు కాదు

రోహిత్ వేముల దళితుడు కాదు అన్న నిజం తేలిపోయింది . ఆంధ్రజ్యోతి నుండి ..

తల్లిదండ్రులు ఇద్దరు వడ్డెర లే .  అతని నానమ్మ వీడియో లో చెప్పింది , అతని నాన్న కూడా చెప్పాడు .
మరి ఈ దళిత మార్పిడి ఎక్కడ జరిగింది .
సమాధానం చాలా సులువు గా చెప్పొచ్చు .  మతం మారితే బ్రాహ్మణుడు కూడా దళితుడు అయిపోతాడు .
అవును . అలా ఇచ్చేటట్టు బేరాలు కూడా చేసుకుని మారే జనం చాలా మంది ఉన్నారు .

రోహిత్ దళితుడు అని చేయి నొప్పెట్టే టట్టు బ్లాగ్ పోస్ట్ లు రాస్తున్న పెద్ద మనుషులు , ఫేస్బుక్ లో కన్నీళ్ళ వరద పారిస్తున్న జనాలు నాలుక ఎలా మడత పెడతారో చూద్దాం .



Wednesday, January 20, 2016

రోహిత్ వేముల కొన్ని నిజాలు



--  ఇతను ఎస్ సి కాదు . ( దళితుడు కాదు ).  అతని కులం వడ్డెర .
ఇదిగో సాక్ష్యాలు
http://www.thenewsminute.com/article/was-rohith-vemula-dalit-or-not-and-does-it-matter-explained-37936

అతని నానమ్మ ఇచ్చిన సాక్ష్యం వీడియో .
http://www.korada.com/telugu/latest/real-facts-behind-rohit-vemulas-suicide/


-- యూనివర్సిటీ లో పెద్ద రెబెల్ . హిందువు లని దే*** మని చెప్పారంట అతని సంఘం మనుషులు .
https://www.facebook.com/TeluguMedia2/videos/1711875245715057/

యాకుబ్ యెమెన్ ఉరిశిక్ష కి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం,  అవతలి వర్గం వాళ్ళని రెచ్చగొట్టడం లో మనవాడు సిద్దహస్తుడు . అవతలి వర్గం వారిని కొట్టడం సుషిల్ కుమార్  పేగులు దెబ్బతినేల కొట్టడం 

ఇలాంటి గొడవల మూలానే ఇతనిని ఆరు నెలలు హాస్టల్ నుండి బహిష్కరించారు , కాని క్లాసు ల నుండి , లైబ్రరీ నుండి కాదు .
ఆ వీడియో లు చూడండి.

యూనివర్సిటీ లని  ఎర్ర కుంపటి లా మార్చేసిన ఘనత మన ఎర్ర బాబులదే . శవ రాజకీయాలు చేస్తున్న మన నాయకులు .

రాహుల్ ప్రత్యెక విమానం లో వచ్చి పరామర్శించాడు .
జగన్ ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించాడు .
ఏచూరి వాలిపోయాడు .
కేజ్రివాల్ ధర్నా ఢిల్లీ లో .

చూద్దాం ఇంకొక దురదృష్టకరమైన సంఘటన కి ఈ నాయకులు ఎలా ఉంటారో భవిష్యత్తు లో ..










Sunday, January 10, 2016

ఇస్లాం అనుకూల , వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతున్న జర్మనీ cologne ( Koln ) , ముస్లిం లని దేశం లోకి అనుమతించేది లేదంటున్న స్లోవేకియా

కొత్త సంవత్సరం రోజు ఏం జరిగింది ..
ఆ రోజు రాత్రి మొత్తం టపాసులు వెలిగిస్తూ జర్మనీ అంతా సంబరాలు జరుపుకున్నారు .
కొలోన్ నగరం లో కూడా అలానే జరిగింది .  ఆ మరుసటి రోజు సిటి పోలీస్ బాస్ కూడా సంబరాలు చాలా శాంతి యుతంగా జరిగాయి అని ప్రకటించారు .
కాని జరిగింది అది కాదు .
సుమారు 150 మంది అమ్మాయిలని అతి దారుణంగా లైంగికంగా వేధించబడ్డారు . మొత్తం కోలన్ సిటి అంతా ఇదే జరిగింది .  గుంపులు గుంపులు గా వచ్చి అమ్మాయిలని రౌండ్ చేసి , వ్రక్షొజాలని నొక్కేయడం , కాళ్ళ మధ్య నొక్కడం , పిరుదులని గిచ్చడం , ఇంకా చెప్పుకోలేని దారుణాతి  దారుణాలు జరిగాయి .

ఎవరు వాళ్ళంతా ??  ఎవరో కాదు ఇమ్మిగ్రెంట్స్ , ఏంజెలా మెర్కెల్ ఆహ్వానించిన వలస దారులు .
అరబ్ మరియు నార్త్ ఆఫ్రికా యువకులు .

సంఘటన జరిగిన మరుసటి రోజు నుండి ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం ప్రారభించారు , ఇప్పటి వరకు సుమారు 150 అమ్మాయిలు ఫిర్యాదు చేసారు . సోషల్ మీడియా అంతా  హోరెత్తిపోయింది , తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత అప్పుడు పోలీస్ లు నోరు విప్పారు , ఆ నిజాలు వింటుంటే మనం ఏ జనాల మధ్య లో నివసిస్తున్నామో తెలుస్తుంది .

http://www.thelocal.de/20160110/cologne-new-year-violence-cases-up-to-379-most-suspects-migrants-police

ఆ సంఘటన రోజే పోలీస్లు ముప్పై మంది ని అదుపులోకి తీసుకున్నారు , వాళ్ళంతా refugees , కాని పోలీస్ రిపోర్ట్ లో అది రికార్డు చేయలేదు , చేస్తానన్న పోలీస్ ని వద్దని అతని సీనియర్ వారించాడు , ఎందుకు ??
ఎందుకంటె , ఇప్పటికే జర్మనీ అంతా వలసల మీద విపరీతమైన వ్యతిరేఖత నెలకొని ఉంది . జర్మన్ పౌరులు తమ ప్రభుత్వం మీద  తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఇటువంటి పరిస్తితులలో , ఈ నిజాలు బయటకి వస్తే ఇంకా వ్యతిరేఖత పెరుగుతుందని భావించి వద్దని వారించారు . కేవలం "అరబ్ మరియు నార్త్ ఆఫ్రికా యువకులు లాంటి వారు "లా ఉన్నారు అని మాత్రమె నమోదు చేసారు .

కొంత మంది దగ్గర కొన్ని చీటీ లు దొరికాయి , అందులో అరబ్ నుండి జర్మన్ బాష లో translate చేసి రాసుకున్న కొన్ని పదాలు , నీ breast బాగున్నాయి , నీతో sex చేయాలని ఉంది , ఐ విల్ కిల్ యు . ఇలాంటివి మరి కొన్ని ..
అంతే కాదు , దోపిడీలు , దొమ్మి లు ఎదేచ్చ గా సాగాయి .


సంఘటన తీవ్రత ని గుర్తించిన ప్రభుత్వం , సిటి పోలీస్ బాస్ ని సస్పెండ్ చేసింది . అంతే కాదు ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలని ఎట్టి పరిస్తితులలో ఉపేక్షించమని  , refugees ల పాత్ర ఉన్నట్టు తేలితే తిరిగి వాళ్ళ దేశానికి పంపించేస్తామని , చట్టాలు కఠినం చేస్తామని చెప్పింది , కాని అలా చెప్పినంత సులువు కాదని యూరోప్ లో ప్రతీ పౌరుడు కి తెలుసు . ఎందుకంటె యూరోప్ లో మానవ హక్కుల చట్టాలు చాలా కఠినం , యుద్ద పరిస్థుతులు ఉన్న సిరియా కి , ఇరాక్ కి పంపించడం కుదరదు . అందుకే యూరోప్ లో రోజు రోజు కి ఏంజెలా మెర్కెల్ మీద వ్యతిరేఖత పెరిగిపోతుంది .

తలా తోక లేకుండా , భవిష్యత్తు పరిస్తితుల ను దృష్టి లో పెట్టుకోకుండా వలసదారులని ఆహ్వానించినందుకు ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వం మీద జర్మన్ పౌరులే కాకుండా , ఇతర యూరోపియన్ దేశాలు కూడా వ్యతిరేఖంగా ఉన్నాయి .
ఇప్పటి వరకు సుమారు 11 , 00, 000 ( 11 లక్షలు ) మంది వలస దారులు వచ్చారు జర్మనీ కి .

refugee లని పంచుకోవాలన్న జర్మనీ విజ్ఞప్తి ని మిగతా యూరోప్ దేశాలు వ్యతిరేఖిస్తున్నాయి  అందులో స్లోవేకియా ఒకటి , ఆ దేశం అయితే కొత్త సంవత్సర సంఘటన తరువాత మా దేశం లోకి ముస్లిం వలసదారుల ని అనుమతించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు . అంతే కాదు స్లోవేకియా , హుంగేరి  జర్మనీ మీద యూరోపియన్ కోర్ట్ లో ఫిర్యాదు చేసాయి .

http://www.dw.com/en/slovakia-vows-to-refuse-entry-to-muslim-migrants/a-18966481

http://www.dw.com/en/hungary-sues-eu-at-european-court-of-justice-over-migrant-quotas/a-18892790

కొలోన్ నగరం లో anti - islam  రాలి లు జరిగాయి , పోలీస్ లు వాటిని అణిచివేసారు.  ఆల్రేడి కొన్ని నగరాలలో పోలీస్ లు తమ కొన్ని విజ్ఞప్తి చేసారు , డ్రెస్ లు కవర్ చేసేలా వేసుకోమని , ఒంటరిగా అర్ధరాత్రులు తిరగొద్దని .

డోనాల్డ్ ట్రంప్ కి మెజారిటి పెరగడం ఆశ్చర్యం లేదు .