Saturday, February 13, 2016

కసబ్ ఏ పాపం చేసుకున్నాడు


కసబ్ ఏ పాపం చేసుకున్నాడు అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నాను .
అఫ్జన్ గురు కి నివాళులు అర్పించిన జె ఎన్ యు స్టూడెంట్స్ కసబ్  ని ఎందుకు పట్టించుకోవడం లేదు .
నిజం చెప్పాలంటే అఫ్జల్ గురు కన్నా కసబ్ వల్ల చనిపోయిన పౌరులే ఎక్కువ .
కసబ్ కేవలం పాకిస్తాన్ పౌరుడు అవ్వడం అతను చేసుకున్న దురదృష్టం , కాని అదే అతను ఏ కాశ్మీర్ కి చెందిన వాడు అయి ఉంటె , ఖచ్చితంగా కొంత మంది విద్యార్ధులకి మంచి రోల్ మోడల్ అయి ఉండేవాడు .

కాని పాకిస్తాన్ పౌరుడు అవ్వడం లో అతను తప్పేమీ లేదు . ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకుని పుట్టలేరు కదా , అందువల్ల అఫ్జల్  , యాకుబ్ కి స్మరిన్చుకున్నట్టే అతన్ని కూడా స్మరించుకోవాలని కోరుతున్నాను .

ఒక్క యాకుబ్ చనిపోతే వంద మంది యాకుబ్ లు పుడతారు ..
ఒక్క అఫ్జల్ చనిపోతే , వేల మంది అఫ్జల్ లు పుడతారు .
అలానే ..
ఒక్క కసబ్ చనిపోతే వేలమంది కసబ్ లు పుట్టి లక్షల మందిని చంపుతారు ఇలా రక్తం మరిగించే నినాదాలు చేయాలి .
మర్చిపోయాను, ఇలాంటి నినాదాలు నా చిన్నప్పుడు బాగా వినేవాన్ని , మా చిన్నాన లు కూడా చేసేవాళ్ళు , ఇప్పుడు కూడా చేస్తున్నారు కాకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు . వాళ్ళ పిల్లలు అయితే మరీనూ .. కనీసం వినపద్దట్టు కూడా నటించడం లేదు .


ఏది ఏమైనా, అజ్మల్ కసబ్ ని నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం తగదని , మిగతా వీరుల తో సమానంగా గౌరవించాలని మన ఏచూరి గారిని, కాంగ్రెస్ ని,  బిజెపి ( ??? ) ని కోరుకుంటున్నాను .


3 comments:

  1. I am sure they dont need this advice for they 're seized of the matter, waiting in the wings to unleash similar ideas! Earlier they made use of unfortunate killings by unknown people and succeeded in getting their own ilk of the so called writers to return their awards. After attracting those 'intellectuals' they've turned their attention to dalit students' force! Aren't elections due in some States?

    ReplyDelete
  2. కసబ్ విగ్రహం రాహుల్ గాంధీ చేత ఆవిష్కరింపజేయాలి.

    ReplyDelete