Sunday, February 14, 2016

జె యన్ యు డ్రామా లు మొదలయ్యాయి , జె యన్ యు లో ఏం జరిగింది

జె యన్ యు లో ఏం జరిగింది ..
సింపుల్ ..

అఫ్జల్ గురు  ఉరి కి వ్యతిరేఖంగా విద్యార్దులు సమావేశం జరిపి నివాళులు అర్పించారు . ఇండియా కి వ్యతిరేఖంగా నినాదాలు చేసారు .

ఇక్కడ గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే , ఆ సమావేశం ఉరి కి వ్యతిరేఖంగా జరగలేదు . అఫ్జల్ గురు కి నివాళులు అర్పిస్తూ జరిగింది . అఫ్జల్ గురు ని ఉరితీసింది ఫిబ్రవరి 9 న . అదే రోజు జరిగిన సమావేశం ఉద్దేశ్యం ఏంటో మీకు అర్ధం అయి ఉండాలి .

అఫ్జల్ గురు ఎవరు ?? , భారత పార్లమెంట్ మీద దాడి చేసి, దేశం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవలుకున్న ఒక బేవార్స్ టెర్రరిస్ట్ . పాకిస్తాన్ చేత ట్రైనింగ్ అయి ఇండియా ని నాశనం చేయాలన్న గట్టి సంకల్పం తో ఉన్న ఒక ఉగ్రవాది .

http://daily.bhaskar.com/article/WOR-TOP-afzal-guru---s-confession-i-helped-them-took-training-in-pak-4175799-NOR.html


అటువంటి ఉగ్రవాది కి నివాళులు అర్పిస్తూ జరిగిన సమావేశం లో ఏ నినాదాలు చేసారో తెలుసా ??

“Go India… Go back…
Kashmir ki Azadi tak… Jung Rahegi… Jung Rahegi…
Bharat Ki Barbadi Tak… Jung Rahegi… Jung Rahegi”

అంటే ఇండియా వెనక్కి వెళ్లిపోవాలి . 
కాశ్మీర్ కి స్వాతంత్ర్యం ఇచ్చే వరకు యుద్దాలు జరుగుతూనే ఉంటాయి . 
భారత్ ని నాశనం చేసేవరకు  యుద్దాలు జరుగుతూనే ఉంటాయి . 

భారత ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి లతో యూనివెర్సిటి లలో చదువుతూ ఇలాంటి నినాదాలు చేస్తూ , ఉగ్రవాదులు సమర్దిస్తూ , పార్లమెంట్ దాడి ని సమర్దిస్తూ ( ఆ దాడి లో కొంత మంది సైనికులు కూడా చనిపోయారు ),  దేశం నాశనం అయోపోవాలని కోరుకునే ఈ స్టూడెంట్స్ ని ఏ category లో వేయాలో మీరే నిర్ణయించండి . 

ఇటువంటివి ఖండించాల్సింది పోయి , ఇలా దేశ వ్యతిరేఖ నినాదాలు చేసే వాళ్ళ మీద చర్య తీసుకుంటే అది హిందూ ఫాసిజం అని పిలుస్తున్న జనాలని చూస్తె భయంగా ఉంది .  
కులాలకి, మతాలకి అతీతంగా ఇటువంటి ఉగ్రవాదులు ( ఉగ్రవాదులని సమర్ధించే వాళ్ళు కూడా ఉగ్రవాదులే ) మీద చర్యలు తీసుకోవాలి .  ఇటువంటి వాళ మీద చర్యలు తీసుకున్నామని హోం మంత్రి , ప్రధాన మంత్రి కూడా గర్వంగా చాటిచెప్పేల ఉండాలి . 






 అఫ్జల్ గురు వీరుడు , శూరుడు అని పొగిడే ఈ జనాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడింది , బిజెపి మాత్రం ధైర్యంగా ముందడుగు వేసింది . 
ఇలాంటి దేశ వ్యతిరేఖ చర్యలని లెఫ్టిస్ట్ లు ఏ విధంగా సమర్దిన్చుకుంటారు ??

Saturday, February 13, 2016

కసబ్ ఏ పాపం చేసుకున్నాడు


కసబ్ ఏ పాపం చేసుకున్నాడు అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నాను .
అఫ్జన్ గురు కి నివాళులు అర్పించిన జె ఎన్ యు స్టూడెంట్స్ కసబ్  ని ఎందుకు పట్టించుకోవడం లేదు .
నిజం చెప్పాలంటే అఫ్జల్ గురు కన్నా కసబ్ వల్ల చనిపోయిన పౌరులే ఎక్కువ .
కసబ్ కేవలం పాకిస్తాన్ పౌరుడు అవ్వడం అతను చేసుకున్న దురదృష్టం , కాని అదే అతను ఏ కాశ్మీర్ కి చెందిన వాడు అయి ఉంటె , ఖచ్చితంగా కొంత మంది విద్యార్ధులకి మంచి రోల్ మోడల్ అయి ఉండేవాడు .

కాని పాకిస్తాన్ పౌరుడు అవ్వడం లో అతను తప్పేమీ లేదు . ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకుని పుట్టలేరు కదా , అందువల్ల అఫ్జల్  , యాకుబ్ కి స్మరిన్చుకున్నట్టే అతన్ని కూడా స్మరించుకోవాలని కోరుతున్నాను .

ఒక్క యాకుబ్ చనిపోతే వంద మంది యాకుబ్ లు పుడతారు ..
ఒక్క అఫ్జల్ చనిపోతే , వేల మంది అఫ్జల్ లు పుడతారు .
అలానే ..
ఒక్క కసబ్ చనిపోతే వేలమంది కసబ్ లు పుట్టి లక్షల మందిని చంపుతారు ఇలా రక్తం మరిగించే నినాదాలు చేయాలి .
మర్చిపోయాను, ఇలాంటి నినాదాలు నా చిన్నప్పుడు బాగా వినేవాన్ని , మా చిన్నాన లు కూడా చేసేవాళ్ళు , ఇప్పుడు కూడా చేస్తున్నారు కాకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు . వాళ్ళ పిల్లలు అయితే మరీనూ .. కనీసం వినపద్దట్టు కూడా నటించడం లేదు .


ఏది ఏమైనా, అజ్మల్ కసబ్ ని నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం తగదని , మిగతా వీరుల తో సమానంగా గౌరవించాలని మన ఏచూరి గారిని, కాంగ్రెస్ ని,  బిజెపి ( ??? ) ని కోరుకుంటున్నాను .


Wednesday, February 3, 2016

ఎం ఐ ఎం మేనిఫెస్టో విడుదల చేసిందంట , ఒక ఫన్ని న్యూస్

పాతబస్తీ ఎం ఐ ఎం జాగీరా  ??
అవును .. కాదంటే ఏం జరుగుతుందో అందరికి తెలుసు .

కాకపొతే ఒక ఫన్ని న్యూస్ .. గత 59 సంవత్సరాలలో  మొట్టమొదటి సారిగా  ఎం ఐ ఎం మేనిఫెస్టో విడుదల చేసిందంట .
వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే .. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరం గా మారుస్తారంటా :-) :-)


నాకు తెలుసు ఈపాటికి మీరు గట్టిగా నవ్వుతూ ఉంటారని . ..  ఇప్పటి వరకు రాలేదు కాని ఈ డౌట్ , ఎందుకో వాళ్ళ బుర్రలు మోకాల్లో గాని ఉన్నాయా ? ప్రపంచ స్థాయి నగరం అంటే పాతబస్తీ అనుకుంటున్నారేమో హి హి హి ..

మేనిఫెస్టో తయారు చేయడం కొంచెం కష్టమే సుమీ ..



మొన్న కాంగ్రెస్ నేతలని తన్ని పంపించారుగా బాగా , పాపం కనీసం రాజశేకర్రెడ్డి చేసిన సహాయం కూడా మర్చిపోయి అలా ఉతికి ఆరేస్తే ఎవ్వరితో చెప్పుకోవాలో తెలియక మన ఉత్తమ కుమారుడు , షబ్బీర్ కుమిలిపోతున్నారు. 






కాకపొతే నాది ఒక డౌట్ ..  ఎం ఐ ఎం ఎప్పటి నుండో ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతుంది కదా .. 
రాజకీయ పార్టి లు స్పందించకపోయినా పరవాలేదు .. 
కనీసం కుల సంఘాలు మాట్లాడకపోయినా పరవాలేదు .. 
మత సంఘాలు మాట్లాడకపోయినా ఏం చేయలేము .. 
కాని  మరి ఇతర కవులు ,  కళాకారులు , హక్కుల సంఘాలు వీళ్ళు కూడా ఎందుకు సైలెంట్ గా ఉండాలి ??
 నేనేమి కోపంగా అడగడం లేదండి బాబు , ఒట్టు ..మన సుమన్ రౌద్ర రసం లో అడిగినట్టే అడుగుతున్నా ..