Tuesday, January 17, 2017

అన్ని వాక్సిన్ లు అవసరమా పిల్లలకి / మీ సలహా కోసం

పిల్లల వాక్సిన్ లలో కొన్ని ఖఛ్చితంగా ఇవ్వాల్సినవి ఉంటాయి . కానీ కొన్ని మాత్రం ఆప్షనల్ అని ఉన్నాయి . డాక్టర్ కనీసం ఇది ఆప్షనల్ అని కూడా చెప్పడం లేదు .
మేము అడిగితే మీ ఇష్టం ఇస్తే మంచిది అని చెప్తున్నారు.

ఈ మధ్యన ఇంటర్నెట్ లో వాక్సిన్ లకి వ్యతిరేఖంగా జరిగే కొన్ని పోస్ట్ లు చదువు తూ ఉంటె , మొత్త్తం అన్ని వాక్సిన్ లు ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది .

ఇప్పుడు మా అబ్బాయి కి pcv  వాక్సిన్ ఇవ్వాలో వద్దో నిర్ణయం తీసుకోలేకపోతున్నాం.

కొంతమందిని అడిగితే వాళ్లకి కనీసం ఇలా ఆప్షనల్ వాక్సిన్ లు ఉంటాయన్న సంగతి కూడా తెలియడం లేదు .  డాక్టర్ చెప్తే అన్ని వేసేసాం అని చెప్తున్నారు ,  వాళ్ళు చదువుకున్న వాళ్ళే.

దయచేసి మీలో ఎవరికైన దీని మీద knowledge  ఉంటె చెప్పమని కోరుతున్నాను .

వేరే దేశాల్లో మరి కొన్ని వాక్సిన్ లు అవసరం అయి ఉండొచ్చూ, ఇండియా లో కూడా అవసరమా అని ఇంకో డౌట్ .

దయచేసి మీ అభిప్రాయాలని సూచనల్ని చెప్పమని కోరుతున్నాను .