Tuesday, September 22, 2015

2011 లో జరిగిన విషయాన్ని ఏదో నిన్న, మొన్న జరిగినట్టు రాసి పారేశారు మన సాక్షి జర్నలిస్ట్ లు

ఈసారి కూడా సాక్షి నే ..
పాత చచ్చు పుచ్చు న్యూస్ చదవాలనుకుంటే సాక్షి ఓపెన్ చేయండి .
2011 లో జరిగిన విషయాన్ని ఏదో నిన్న, మొన్న జరిగినట్టు రాసి పారేశారు మన సాక్షి జర్నలిస్ట్ లు .
ఇంతకు ముందు కూడా , పాకిస్తాన్ ఇమ్రాన్  ఖాన్ కి బదులు బాలివుడ్ ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టిన విషయం ఈ బ్లాగ్ లో చూడొచ్చు .

ఒక విమానం ముందు చక్రం లేకుండా ల్యాండ్ అవ్వడం ఎంత పెద్ద న్యూస్ . అది ఈరోజే జరిగినట్టు రాయడం ఇంకా పెద్ద న్యూస్ .



ఆ మొదటి లైన్ చూసారా , ఇరాన్ విమానం ఘోర ప్రమాదం నుండి బయట పడిందంట ఎప్పుడూ ??? 2011 లో :-)  ఆ న్యూస్ లో ఇచ్చిన లింక్ కూడా పాతదే , ఆ లింక్ ఇక్కడ . డైరెక్ట్ youtube వీడియో రావడం లేదు దీనికి . 




అదన్న మాట సంగతి . అంటే మనకన్నా 4 సంవత్సరాలు లేట్ గా ఉన్నారు సాక్షి . 




Monday, September 21, 2015

రిజర్వేషన్స్ రివ్యూ చేయాలనీ వాదిస్తే చంపేస్తామని బెదిరిస్తారా

ఖచ్చితంగా చేయాల్సిందే , ఈ డిమాండ్ రిజర్వేషన్స్ తీసేయమని కాదు . దాన్ని ఒక వోట్ బ్యాంకు గా కాకుండా వెనకబడిన వర్గాలకి నిజంగా మేలు చేసే విధంగా మార్చాల్సిందే .

దానితో లాభపడ్డ జనాలు , వాళ్ళ వర్గం లో ఎంతమంది ని పైకి తీసుకుని రావడానికి కృషి చేసారో చెప్పగలరా ?
రిజర్వేషన్స్ లో పైకి ఎదిగి , తన వాళ్లకి చేయూత ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తే , మనం మీద కుల దూషణ కేసు లు పెడతారంట .

విచిత్రం ఏంటంటే ... ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే, ఒంటి కాలు మీద లేచి బూతులు తిట్టేది ఎవరో తెలుసా
క్రైస్తవ మతం లోకి మారిన జనాలు . అవును . హిందూ మతం లో ఉన్న ( ఉన్నారో లేదో తెలియదు ) వెనకబడిన వర్గాలు ఈ విషయం లో తక్కువ గా వ్యతిరేఖత చూపిస్తున్నారు , కాని మతం మారిన జనం మాత్రం రిజర్వేషన్స్ ముట్టుకుంటే బ్రహ్మాండం బద్దలు అవుతుంది అన్నట్టు బెదిరిస్తున్నారు .
ఫేస్బుక్ లలో ఐతే, చంపేస్తామని బెదిరిస్తున్నారు , కొన్ని గ్రూప్ లలో చూసాను.

హిందూ మతానికే పరిమితమైన ఈ జాడ్యం ( కులం ) లో నుండి సమానత్వాన్ని కోరుకుంటూ వెళ్ళిపోయినా జనాలు , ఈ రిజర్వేషన్స్ ని కోరడం , దాని కోసం బెదిరించడం ఎంత వరకు సమంజసమొ వాళ్ళకే తెలియాలి .

మీకు తెలిసిన ఫేస్బుక్ లో కాని, మరే ఇతర సోషల్ నెట్వర్క్ లో , ఇలా బెదిరించే లింక్ లు , స్క్రీన్ షాట్ లు , కామెంట్ లో పెట్టండి .

నాకెందుకో వీళ్ళ వెనక ఉండేది ఎవరో కొంచెం లీల గా అర్ధం అవుతుంది , మీకు తెలిసిన చెప్పకండి :-)



Friday, September 18, 2015

పండుగ లు వృధా అని వాదించే జనం కోసం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో ..

పండుగ లు వృధా అని వాదించే జనం కోసం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో ..
కుల మతాలతో సంబంధం లేకుండా ..






Tuesday, September 15, 2015

ఈ సెప్టెంబర్ 17 మన కెసిఆర్ ఏం చేస్తారో చూద్దాం


ఈ రోజు న్యూస్ చదువుతుంటే , యదా ప్రకారం , హాట్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 17 .
హైదరాబాద్ విమోచన గురించి అంత లోతైన సమాచారం నాకు తెలియదు , కాని కెసిఆర్ మాత్రం
అప్పట్లో ప్రభుత్వాలని ఒక ఆట ఆడుకున్నట్టు బాగా గుర్తు .

మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఆగుస్ట్ 15 న కాదు , సెప్టెంబర్ 17 అని గొంతెత్తి నినాదాలు చేసారు .



అప్పటి ప్రభుత్వాలు పాపం కక్కలేక మింగలేక తెగ ఇబ్బంది పడ్డాయి .
ఇప్పుడు మన కెసిఆర్ ఏం చేస్తారో చూద్దాం , అందరిలానే తప్పించుకుని పారిపోతారో , లేక ధైర్యంగా విమోచన దినాన్ని అధికారికంగా చేస్తారో . ??

నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే  , కెసిఆర్ ఖచ్చితంగా చేస్తారు అని , పారిపోయే మనస్తత్వం కాదు అని అనిపిస్తుంది .

Thursday, September 10, 2015

జర్మనీ లో సిరియా శరణార్దుల కోసం మసీదు లు కట్టడానికి సౌదీ అరేబియా బారీ విరాళం


అవును , మీరు చదివింది కరెక్ట్ ....
ఒక్క శరణార్ది ని కూడా తమ దేశం లో అనుమతించని సౌదీ అరేబియా , జర్మనీ వెళ్తున్న సిరియా శరణార్దుల కోసం
200 మసీదులు కట్టడానికి విరాళం ఇవ్వబోతుంది .

https://www.frontpagemag.com/point/260080/saudi-arabia-offers-build-200-mosques-syrians-daniel-greenfield





http://www.arabianbusiness.com/saudi-offers-build-200-mosques-in-germany-for-syrian-refugees-605755.html


ఇది అనుమానం కాదు, మీరు గూగుల్ చేసి చూస్తె నిజమని తేలింది .

అత్యంత ధనిక దేశాలు అయినా , ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఒక్క శరణార్ది ని కూడా తమ దేశం లోకి అనుమతించకపోవడం ఎంత అమానవీయం , అత్యంత హేయమైన చర్య ఇది .

ఇసిస్ ఉగ్రవాదుల దాడులు , అత్యాచారాలు తట్టుకోలేక , చిన్న పిల్లలని కూడా చెరచి , బానిసలు గా అమ్మేసే హేయమైన ఆ ఉగ్రవాదులు నుండి సముద్రాలు దాటి యూరోప్ కి వెళ్తున్నారు కాని పక్కనే ఉన్న మిగత అరబ్ దేశాలకి మాత్రం వాళ్లకి అనుమతి లేదు .
నిజం చెప్పాలంటే, సిరియా , ఇరాక్ , శరణార్దులు ని ఆడుకోవడానికి గల్ఫ్ దేశాలు కి చాలా అవకాశాలు ఉన్నాయి , ఒకటే మతం అవ్వడం వల్ల , తోటి సహచరులు అన్న ఉద్దేశ్యం కూడా ఉండాలి  , కాని ఇప్పుడు మౌనంగా ఉన్నాయి .

ఇప్పుడు జర్మనీ లో ఉన్న శరణార్దులు ఎక్కడ తమ మతం మార్చుకుంటారేమో అని , సౌదీ అరేబియా ప్రతీ వంద మంది సిరియన్ లకి ఒక మసీదు నిర్మిస్తుంది , తమ దేశం లో ఒక్క చర్చి కి కూడా అనుమతి ఇవ్వని దేశం .

ఈ వలసలు యూరోప్ ని ఇస్లామీకరణ చేసే పధకం లో ఒక భాగం అని , గల్ఫ్ దేశాలు రహస్యంగా అమలు చేస్తున్న పధకం లో భాగమే ఇది అని వార్తలు వినిపిస్తున్నాయి . మనుషలని చేరవేసే వ్యక్తులు , యూరోప్ కి వెళ్ళమని బలవంతం చేయడం కూడా అనుమానాలు బలపడుతున్నాయి .

ఈ సంవత్సరం , పది లక్షలు మంది యూరోప్ లోకి వస్తారని అంచనా వేస్తున్నారు .  మనవ హక్కుల కి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే యూరోప్ దేశాలలో ఇస్లాం ని వ్యాప్తి చేయడం సులభం అని గ్రహించి ఈ ఆగడాల కి పాల్పడుతున్నట్టు కొన్ని వెబ్ పత్రికల కధనం .