Tuesday, January 26, 2016

మేము దళితులం కాదు మొర్రో అని మొత్తుకుంటున్న రోహిత్ తండ్రి , ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది .

రోహిత్ వేముల దళితుడు కాదు , ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది .

రోహిత్ దళితుడి గా దొంగ సర్టిఫికేట్ తీసుకుని , మరొక వ్యక్తీ కి రావాల్సిన అవకాశాన్ని దొంగిలించాడు .
ఈ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారుల మీద , రోహిత్ కి సహకరించిన వ్యక్తుల మీద ప్రభుత్వం త్వరగా కేసు నమోదు చేయాలి .



http://www.sakshi.com/news/district/my-son-killed-308672?pfrom=home-top-story

తను వ్యవస్థ లో ఉన్న లోపాలని తనకి అనుకూలంగా మలుచుకుని లంచం ఇచ్చి లేక మరో పద్దతి లోనో  దళితుడు అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు , నిజానికి దీనికి చాలా ధైర్యం కావాలి .  ఇది నేరపూరితమైన చర్య  అటువంటి ఆలోచన రావడం కూడా తప్పే . దీనికి రోహిత్ తల్లి కూడా సమర్ధించారు , మీడియా సాక్షి గా ఆమె మేము మాల కులస్తులం  అని చెప్పారు , ఇది కూడా నేరమే . దీనిని బట్టి వీళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు .
విచారణ జరిపించి భాద్యులని శిక్షించాలి .

దుందుడుకు స్వభావం. 
రెచ్చగొట్టే చర్యలు ( బ్యానర్ లని కావాలని చింపడం ), ఒక మతాన్ని , వర్గాన్ని తిట్టడం .
రెచ్చగొట్టే ప్రసంగాలు .  ( ముంబై పేలుళ్లు నిందితులు ని సమర్దించడం , న్యాయ వ్యవస్థ ని అపహాస్యం చేసేటట్టు నినాదాలు  ) యాకుబ్ ని ఉరితీస్తే , మరో వందమంది యాకుబ్ లు వస్తారు అని ..

కేవలం రెచ్చగొట్టే పనులే తప్పిస్తే , నిజంగా తమ సామాజిక వర్గానికి మంచి చేసిన పనులేమి లేవు .


ఈ లోపు ..

ఫేస్బుక్ లో ,  ఆన్లైన్ లో , కొంతమంది మేధావులు (??) విపరీత పోకడలకి పోతున్నారు .

సెంట్రల్ యూనివర్సిటీ లు  అగ్రహారపు గురుకులాలంట , అందులో చదువుకునే అవకాశాలని ప్రభుత్వం దూరం చేస్తుందంట . యెంత హాస్యంగా ఉంది ఇది .  ఒక దుందుడుకు స్వభావం గల విద్యార్ది , తన విపరీతపు పోకడలతో చేసిన పనులకి , యూనివర్సిటీ రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటే , అతని కులాన్ని అడ్డం పెట్టుకుని ( అతను దళితుడు కాదు కూడా ) వీళ్ళ సొంత ఎజెండా బయటకి తీసి మేధావులు , కవులు అనే ముసుగులో  విద్యార్దుల మెదడలని కలుషితం చేస్తున్న దుర్మార్గపు చర్యలని చూడండి .

నాకు తెలిసి కొన్ని వేల మంది అడ్మిషన్స  పొందారు గత కొన్ని సంవత్సరాలలో , ఎవరిని ఆపారు .  ఇప్పుడు కూడా రోహిత్ ని హాస్టల్ నుండి సస్పెండ్ చేసారు ఎందుకంటే మిగతా జనాలతో కలిసి గొడవలు చేస్తున్నాడని , కాలేజీ వాతావరణం పాడు చేస్తున్నాడని అంతే కాని అతన్ని యూనివర్సిటీ నుండి బహిష్కరించలేదు . క్లాసు లకి అటెండ్ అవుతున్నాడు , హాస్టల్ బయటే ఒక టెంట్ వేసుకుని ఉంటున్నాడు , అతని స్నేహితుల గదుల్లో కి నిర్భయంగా వస్తు పోతూ కూడా ఉన్నాడు . అతన్ని ఎవ్వరు ఆపలేదు .

నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ," కాలేజీ నుండి సస్పెండ్ " చేసే శిక్షని , ఇక్కడ కూడా అదే జరిగింది .
అసలు రోహిత్ ఆత్మహత్య కి ఇప్పటకి సరిఅయిన కారణం తెలియడం లేదు . నిజం చెప్పాలంటే అసలు ఆత్మహత్య కి కారణం ఏంటో కనుక్కోవాలి .



ఈ  రచయతలు  ఆలోచనలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి . ఒక వర్గాన్ని తిట్టకుండా ఒక్క రచయత కూడా మాట్లాడడా ??

యూనివర్సిటీ చెప్పే కారణాలు చూడండి .. 



నిజం చెప్పాలంటే ఒక వ్యక్తీ ఆత్మహత్య మీద జరుగుతున్నా రాజకీయాలు , ఈ రాజకీయ రాబందులు చేసి పనులు చూస్తుంటే భయంగా ఉంది మనం ఎటు వైపు ప్రయాణిస్తున్నాం అని .
రోహిత్ శవం మీద చిల్లర ఏరుకుంటున్న ఈ రాబందులు మీద అసహ్యంగా అనిపించడం లేదా ?
రాహుల్ గాంధీ  నుండి చిల్లర సంఘాల వరకు ప్రతీ ఒక్కరు ఏదో ఒక విధంగా మైలేజి కోసం ఆత్రుత పడుతు కులాల కుంపట్లు రాజేస్తూ ఉన్నారే తప్ప  కుల నిర్మూలన కోసం ప్రయత్నించే ఒక్క నాయకుడు కూడా కనపడటం లేదు .

అసలు రోహిత్ చేసిన పనులు మంచివా చెడువా అనేది లేదు .

ఈ రోజు కాంగ్రెస్ , రేపు బిజెపి అంతే .






Saturday, January 23, 2016

రోహిత్ వేముల దళితుడు కాదు

రోహిత్ వేముల దళితుడు కాదు అన్న నిజం తేలిపోయింది . ఆంధ్రజ్యోతి నుండి ..

తల్లిదండ్రులు ఇద్దరు వడ్డెర లే .  అతని నానమ్మ వీడియో లో చెప్పింది , అతని నాన్న కూడా చెప్పాడు .
మరి ఈ దళిత మార్పిడి ఎక్కడ జరిగింది .
సమాధానం చాలా సులువు గా చెప్పొచ్చు .  మతం మారితే బ్రాహ్మణుడు కూడా దళితుడు అయిపోతాడు .
అవును . అలా ఇచ్చేటట్టు బేరాలు కూడా చేసుకుని మారే జనం చాలా మంది ఉన్నారు .

రోహిత్ దళితుడు అని చేయి నొప్పెట్టే టట్టు బ్లాగ్ పోస్ట్ లు రాస్తున్న పెద్ద మనుషులు , ఫేస్బుక్ లో కన్నీళ్ళ వరద పారిస్తున్న జనాలు నాలుక ఎలా మడత పెడతారో చూద్దాం .



Wednesday, January 20, 2016

రోహిత్ వేముల కొన్ని నిజాలు



--  ఇతను ఎస్ సి కాదు . ( దళితుడు కాదు ).  అతని కులం వడ్డెర .
ఇదిగో సాక్ష్యాలు
http://www.thenewsminute.com/article/was-rohith-vemula-dalit-or-not-and-does-it-matter-explained-37936

అతని నానమ్మ ఇచ్చిన సాక్ష్యం వీడియో .
http://www.korada.com/telugu/latest/real-facts-behind-rohit-vemulas-suicide/


-- యూనివర్సిటీ లో పెద్ద రెబెల్ . హిందువు లని దే*** మని చెప్పారంట అతని సంఘం మనుషులు .
https://www.facebook.com/TeluguMedia2/videos/1711875245715057/

యాకుబ్ యెమెన్ ఉరిశిక్ష కి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం,  అవతలి వర్గం వాళ్ళని రెచ్చగొట్టడం లో మనవాడు సిద్దహస్తుడు . అవతలి వర్గం వారిని కొట్టడం సుషిల్ కుమార్  పేగులు దెబ్బతినేల కొట్టడం 

ఇలాంటి గొడవల మూలానే ఇతనిని ఆరు నెలలు హాస్టల్ నుండి బహిష్కరించారు , కాని క్లాసు ల నుండి , లైబ్రరీ నుండి కాదు .
ఆ వీడియో లు చూడండి.

యూనివర్సిటీ లని  ఎర్ర కుంపటి లా మార్చేసిన ఘనత మన ఎర్ర బాబులదే . శవ రాజకీయాలు చేస్తున్న మన నాయకులు .

రాహుల్ ప్రత్యెక విమానం లో వచ్చి పరామర్శించాడు .
జగన్ ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించాడు .
ఏచూరి వాలిపోయాడు .
కేజ్రివాల్ ధర్నా ఢిల్లీ లో .

చూద్దాం ఇంకొక దురదృష్టకరమైన సంఘటన కి ఈ నాయకులు ఎలా ఉంటారో భవిష్యత్తు లో ..










Sunday, January 10, 2016

ఇస్లాం అనుకూల , వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతున్న జర్మనీ cologne ( Koln ) , ముస్లిం లని దేశం లోకి అనుమతించేది లేదంటున్న స్లోవేకియా

కొత్త సంవత్సరం రోజు ఏం జరిగింది ..
ఆ రోజు రాత్రి మొత్తం టపాసులు వెలిగిస్తూ జర్మనీ అంతా సంబరాలు జరుపుకున్నారు .
కొలోన్ నగరం లో కూడా అలానే జరిగింది .  ఆ మరుసటి రోజు సిటి పోలీస్ బాస్ కూడా సంబరాలు చాలా శాంతి యుతంగా జరిగాయి అని ప్రకటించారు .
కాని జరిగింది అది కాదు .
సుమారు 150 మంది అమ్మాయిలని అతి దారుణంగా లైంగికంగా వేధించబడ్డారు . మొత్తం కోలన్ సిటి అంతా ఇదే జరిగింది .  గుంపులు గుంపులు గా వచ్చి అమ్మాయిలని రౌండ్ చేసి , వ్రక్షొజాలని నొక్కేయడం , కాళ్ళ మధ్య నొక్కడం , పిరుదులని గిచ్చడం , ఇంకా చెప్పుకోలేని దారుణాతి  దారుణాలు జరిగాయి .

ఎవరు వాళ్ళంతా ??  ఎవరో కాదు ఇమ్మిగ్రెంట్స్ , ఏంజెలా మెర్కెల్ ఆహ్వానించిన వలస దారులు .
అరబ్ మరియు నార్త్ ఆఫ్రికా యువకులు .

సంఘటన జరిగిన మరుసటి రోజు నుండి ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం ప్రారభించారు , ఇప్పటి వరకు సుమారు 150 అమ్మాయిలు ఫిర్యాదు చేసారు . సోషల్ మీడియా అంతా  హోరెత్తిపోయింది , తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత అప్పుడు పోలీస్ లు నోరు విప్పారు , ఆ నిజాలు వింటుంటే మనం ఏ జనాల మధ్య లో నివసిస్తున్నామో తెలుస్తుంది .

http://www.thelocal.de/20160110/cologne-new-year-violence-cases-up-to-379-most-suspects-migrants-police

ఆ సంఘటన రోజే పోలీస్లు ముప్పై మంది ని అదుపులోకి తీసుకున్నారు , వాళ్ళంతా refugees , కాని పోలీస్ రిపోర్ట్ లో అది రికార్డు చేయలేదు , చేస్తానన్న పోలీస్ ని వద్దని అతని సీనియర్ వారించాడు , ఎందుకు ??
ఎందుకంటె , ఇప్పటికే జర్మనీ అంతా వలసల మీద విపరీతమైన వ్యతిరేఖత నెలకొని ఉంది . జర్మన్ పౌరులు తమ ప్రభుత్వం మీద  తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఇటువంటి పరిస్తితులలో , ఈ నిజాలు బయటకి వస్తే ఇంకా వ్యతిరేఖత పెరుగుతుందని భావించి వద్దని వారించారు . కేవలం "అరబ్ మరియు నార్త్ ఆఫ్రికా యువకులు లాంటి వారు "లా ఉన్నారు అని మాత్రమె నమోదు చేసారు .

కొంత మంది దగ్గర కొన్ని చీటీ లు దొరికాయి , అందులో అరబ్ నుండి జర్మన్ బాష లో translate చేసి రాసుకున్న కొన్ని పదాలు , నీ breast బాగున్నాయి , నీతో sex చేయాలని ఉంది , ఐ విల్ కిల్ యు . ఇలాంటివి మరి కొన్ని ..
అంతే కాదు , దోపిడీలు , దొమ్మి లు ఎదేచ్చ గా సాగాయి .


సంఘటన తీవ్రత ని గుర్తించిన ప్రభుత్వం , సిటి పోలీస్ బాస్ ని సస్పెండ్ చేసింది . అంతే కాదు ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలని ఎట్టి పరిస్తితులలో ఉపేక్షించమని  , refugees ల పాత్ర ఉన్నట్టు తేలితే తిరిగి వాళ్ళ దేశానికి పంపించేస్తామని , చట్టాలు కఠినం చేస్తామని చెప్పింది , కాని అలా చెప్పినంత సులువు కాదని యూరోప్ లో ప్రతీ పౌరుడు కి తెలుసు . ఎందుకంటె యూరోప్ లో మానవ హక్కుల చట్టాలు చాలా కఠినం , యుద్ద పరిస్థుతులు ఉన్న సిరియా కి , ఇరాక్ కి పంపించడం కుదరదు . అందుకే యూరోప్ లో రోజు రోజు కి ఏంజెలా మెర్కెల్ మీద వ్యతిరేఖత పెరిగిపోతుంది .

తలా తోక లేకుండా , భవిష్యత్తు పరిస్తితుల ను దృష్టి లో పెట్టుకోకుండా వలసదారులని ఆహ్వానించినందుకు ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వం మీద జర్మన్ పౌరులే కాకుండా , ఇతర యూరోపియన్ దేశాలు కూడా వ్యతిరేఖంగా ఉన్నాయి .
ఇప్పటి వరకు సుమారు 11 , 00, 000 ( 11 లక్షలు ) మంది వలస దారులు వచ్చారు జర్మనీ కి .

refugee లని పంచుకోవాలన్న జర్మనీ విజ్ఞప్తి ని మిగతా యూరోప్ దేశాలు వ్యతిరేఖిస్తున్నాయి  అందులో స్లోవేకియా ఒకటి , ఆ దేశం అయితే కొత్త సంవత్సర సంఘటన తరువాత మా దేశం లోకి ముస్లిం వలసదారుల ని అనుమతించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు . అంతే కాదు స్లోవేకియా , హుంగేరి  జర్మనీ మీద యూరోపియన్ కోర్ట్ లో ఫిర్యాదు చేసాయి .

http://www.dw.com/en/slovakia-vows-to-refuse-entry-to-muslim-migrants/a-18966481

http://www.dw.com/en/hungary-sues-eu-at-european-court-of-justice-over-migrant-quotas/a-18892790

కొలోన్ నగరం లో anti - islam  రాలి లు జరిగాయి , పోలీస్ లు వాటిని అణిచివేసారు.  ఆల్రేడి కొన్ని నగరాలలో పోలీస్ లు తమ కొన్ని విజ్ఞప్తి చేసారు , డ్రెస్ లు కవర్ చేసేలా వేసుకోమని , ఒంటరిగా అర్ధరాత్రులు తిరగొద్దని .

డోనాల్డ్ ట్రంప్ కి మెజారిటి పెరగడం ఆశ్చర్యం లేదు .