Tuesday, January 26, 2016

మేము దళితులం కాదు మొర్రో అని మొత్తుకుంటున్న రోహిత్ తండ్రి , ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది .

రోహిత్ వేముల దళితుడు కాదు , ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది .

రోహిత్ దళితుడి గా దొంగ సర్టిఫికేట్ తీసుకుని , మరొక వ్యక్తీ కి రావాల్సిన అవకాశాన్ని దొంగిలించాడు .
ఈ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారుల మీద , రోహిత్ కి సహకరించిన వ్యక్తుల మీద ప్రభుత్వం త్వరగా కేసు నమోదు చేయాలి .



http://www.sakshi.com/news/district/my-son-killed-308672?pfrom=home-top-story

తను వ్యవస్థ లో ఉన్న లోపాలని తనకి అనుకూలంగా మలుచుకుని లంచం ఇచ్చి లేక మరో పద్దతి లోనో  దళితుడు అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు , నిజానికి దీనికి చాలా ధైర్యం కావాలి .  ఇది నేరపూరితమైన చర్య  అటువంటి ఆలోచన రావడం కూడా తప్పే . దీనికి రోహిత్ తల్లి కూడా సమర్ధించారు , మీడియా సాక్షి గా ఆమె మేము మాల కులస్తులం  అని చెప్పారు , ఇది కూడా నేరమే . దీనిని బట్టి వీళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు .
విచారణ జరిపించి భాద్యులని శిక్షించాలి .

దుందుడుకు స్వభావం. 
రెచ్చగొట్టే చర్యలు ( బ్యానర్ లని కావాలని చింపడం ), ఒక మతాన్ని , వర్గాన్ని తిట్టడం .
రెచ్చగొట్టే ప్రసంగాలు .  ( ముంబై పేలుళ్లు నిందితులు ని సమర్దించడం , న్యాయ వ్యవస్థ ని అపహాస్యం చేసేటట్టు నినాదాలు  ) యాకుబ్ ని ఉరితీస్తే , మరో వందమంది యాకుబ్ లు వస్తారు అని ..

కేవలం రెచ్చగొట్టే పనులే తప్పిస్తే , నిజంగా తమ సామాజిక వర్గానికి మంచి చేసిన పనులేమి లేవు .


ఈ లోపు ..

ఫేస్బుక్ లో ,  ఆన్లైన్ లో , కొంతమంది మేధావులు (??) విపరీత పోకడలకి పోతున్నారు .

సెంట్రల్ యూనివర్సిటీ లు  అగ్రహారపు గురుకులాలంట , అందులో చదువుకునే అవకాశాలని ప్రభుత్వం దూరం చేస్తుందంట . యెంత హాస్యంగా ఉంది ఇది .  ఒక దుందుడుకు స్వభావం గల విద్యార్ది , తన విపరీతపు పోకడలతో చేసిన పనులకి , యూనివర్సిటీ రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటే , అతని కులాన్ని అడ్డం పెట్టుకుని ( అతను దళితుడు కాదు కూడా ) వీళ్ళ సొంత ఎజెండా బయటకి తీసి మేధావులు , కవులు అనే ముసుగులో  విద్యార్దుల మెదడలని కలుషితం చేస్తున్న దుర్మార్గపు చర్యలని చూడండి .

నాకు తెలిసి కొన్ని వేల మంది అడ్మిషన్స  పొందారు గత కొన్ని సంవత్సరాలలో , ఎవరిని ఆపారు .  ఇప్పుడు కూడా రోహిత్ ని హాస్టల్ నుండి సస్పెండ్ చేసారు ఎందుకంటే మిగతా జనాలతో కలిసి గొడవలు చేస్తున్నాడని , కాలేజీ వాతావరణం పాడు చేస్తున్నాడని అంతే కాని అతన్ని యూనివర్సిటీ నుండి బహిష్కరించలేదు . క్లాసు లకి అటెండ్ అవుతున్నాడు , హాస్టల్ బయటే ఒక టెంట్ వేసుకుని ఉంటున్నాడు , అతని స్నేహితుల గదుల్లో కి నిర్భయంగా వస్తు పోతూ కూడా ఉన్నాడు . అతన్ని ఎవ్వరు ఆపలేదు .

నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ," కాలేజీ నుండి సస్పెండ్ " చేసే శిక్షని , ఇక్కడ కూడా అదే జరిగింది .
అసలు రోహిత్ ఆత్మహత్య కి ఇప్పటకి సరిఅయిన కారణం తెలియడం లేదు . నిజం చెప్పాలంటే అసలు ఆత్మహత్య కి కారణం ఏంటో కనుక్కోవాలి .



ఈ  రచయతలు  ఆలోచనలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి . ఒక వర్గాన్ని తిట్టకుండా ఒక్క రచయత కూడా మాట్లాడడా ??

యూనివర్సిటీ చెప్పే కారణాలు చూడండి .. 



నిజం చెప్పాలంటే ఒక వ్యక్తీ ఆత్మహత్య మీద జరుగుతున్నా రాజకీయాలు , ఈ రాజకీయ రాబందులు చేసి పనులు చూస్తుంటే భయంగా ఉంది మనం ఎటు వైపు ప్రయాణిస్తున్నాం అని .
రోహిత్ శవం మీద చిల్లర ఏరుకుంటున్న ఈ రాబందులు మీద అసహ్యంగా అనిపించడం లేదా ?
రాహుల్ గాంధీ  నుండి చిల్లర సంఘాల వరకు ప్రతీ ఒక్కరు ఏదో ఒక విధంగా మైలేజి కోసం ఆత్రుత పడుతు కులాల కుంపట్లు రాజేస్తూ ఉన్నారే తప్ప  కుల నిర్మూలన కోసం ప్రయత్నించే ఒక్క నాయకుడు కూడా కనపడటం లేదు .

అసలు రోహిత్ చేసిన పనులు మంచివా చెడువా అనేది లేదు .

ఈ రోజు కాంగ్రెస్ , రేపు బిజెపి అంతే .






1 comment:

  1. ఇతన్ని చూస్తె నమ్మ బుద్ధి కావడం లేదు. ఫుల్లుగా మందు కొట్టి మాట్లాడాడు అనిపించింది.

    ReplyDelete