Monday, April 9, 2012

' నేను ఎవరు '

చాల రోజుల కింద ఒక కధ చదివాను ఈనాడు లో.
ఆ కద ప్రకారం, విద్య బుద్దులు నేర్పించడానికి తీసుకునివేల్తున్న తన గురువు గారితో ఆ దేవ దేవుడైన శ్రీరాములు వారు  వసిష్ఠుల మహర్షి వారిని  నేను అంటే ఎవరు (?) , అని అడుగుతారు. దానికి వసిష్ఠుల మహర్షి వారు సమాధానం చెప్పరు ఎందుకంటే ' నేను' అనే దానికి అర్ధం తెలిసిన నాడు అతనికి ఇహ విషయ్జాల మీద ఆసక్తి ఉండదని, అల ఆసక్తి పొయిననాడు శ్రీ శ్రీరాములు వారి కారణ జన్మ కి అర్ధం ఉండదని తలచి సమాధానం తరువాత చెప్తాను అని చెప్తారు.

ఆ తరువాత రామ రావణ యుద్ధం జరిగి , తిరిగి శ్రీరాములు వారు పట్టభిషేకమయ్యే ముందర మల్లి తన గురువు గారిని అడుగుతారు తన సందేహం తీర్చమని, అప్పుడు వసిష్ఠుల మహర్షి వారు తన సమాధానం తో తనకి రాజ్య పాలనా పట్ల ఆసక్తి పోకూడదని మాట తీసుకుని సమాధానం చెప్తారు.

ఈ కద నాకు బాగా నచ్చింది. కానీ నేను దానిని జాగ్రత్త పరచలేదు . online lone చదివాను. save చేసుకుని పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ నా lazyness వల్ల , నా వ్యక్తీగత పనులు బాగా ఎక్కువైపోయి నేను ఈ కదని బద్రపరుచుకోలేదు. ఇప్పుడు ఈనాడు archives లో కూడా లేదు. అవి 90 days వరకు మాత్రమే ఉంటాయి.
కానీ ఈ కద పబ్లిష్ అయి చాల రోజులు అయ్యింది.

విజ్ఞులు ఎవరైనా ఈ కద గుర్తు ఉంటె దయచేసి సమాధానం చెప్పండి. ఒకవేళ ఈ కద ఎక్కద దొరుకుతుందో కొంచెం  ఆ ప్లేస్ చెప్పండి.
ధన్యవాదాలు.



Sunday, April 8, 2012

బాగా confuse అవుతున్నాను.

ఈ మధ్యనే దేశం దాటి బయటకి వచ్చాను. చాల తికమక పడిపోతున్నాను బాష రాక.
ఇంకా కొత్త విషయం ఏంటంటే..అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం. వాచిపోతుంది  నాకు ఇవి అర్ధం చేసుకోవడానికి. నా దరిద్రం కొద్ది దాని మీద ఉండే సూచనలు కూడా వీళ్ళ బాషలోనే ఉన్న్నాయి, దాంతో గూగ్లమ్మ తల్లి ని పట్టుకుని ప్రతి పదానికి అర్ధం అడుక్కోవలసి వస్తుంది.
అదృష్టవశాత్తు నేను నాన్-వెజ్ తింటున్నాను కాబట్టి సరిపోయింది . వెజ్ అయితే ఇంకా వాచిపోను. కానీ వీక్ లో కొన్ని రోజులు తినను అప్పుడు కష్టంగా అనిపిస్తుంది.


ఆఫీసు లో భోజనం తినేటప్పుడు నాకు విపరీతమైన నవ్వొస్తుంది.
మీరు చెబితే నమ్మరు కానీ , ఇప్పటి వరకు నేను ఏమి తింటున్నానో  నాకు తెలియడం లేదు.
ఒకే ఒక్క విషయం అడుగుతున్నాను అక్కడ, ఇది వెజ్  or నాన్-వెజ్ అని ? మల్లి నాన్ -వెజ్ లో ఆ పోర్క్, ham తినను. ఇక్కడేమో అవే అత్యంత ప్రీతీ గా తింటున్నారు. 
వీళ్ళ బాష ని అర్ధం చేసుకోవడానికి చాల try  చేస్తున్నాను, కానీ అన్ని పదాలు నాకు హిష్ హిష్ ల వినిపిస్తున్నాయి. 


మొదటి రోజైతే నాకు ఇంకా గుర్తుంది. ఎలా మర్చిపోతాను కడుపులో ఏమేమి పనిచేస్తాయో వాటి సౌండ్స్ తో సహా విన్నాను. అందరిలా line లో నిలబడ్డాను. ఏదో వెజ్ అని చెబితే plate లోకి తీసుకున్నాను. కానీ ఏదో వాసన వస్తుంది , అది ఎక్కడి నుండో వస్తుందో, అది ఏం వాసనో తెలియడం లేదు. సరేలే మనకెందుకు ఇక్కడ ఇలాగె ఉంటుందేమో అని , ఒక్కసారి గా రౌడీ అల్లుడు సినిమా గుర్తుకు తెచ్చుకుని, ఈ దేశం లో ఇంతే , ఈ దేశం లో ఇంతే అని ముందుకి వెళ్ళిపోయా.  అందరితో పటు కూర్చున్నాను . 
కత్తులు కటార్లు పట్టుకుని రెడీ అయ్యా. బాగా ఆకలి గా ఉంది. plate లో తెల్లగా మూడు ఉండలు (కుడుము ల్లా   ) ఉన్నాయి. ఇంకా ఏదో మన ఊళ్ళో  కూర ఇగురు ల ఉంది. కాని ఆ వాసనేదో ఇంకా ఎక్కువైంది. ఏంట్రా బాబు ఎరక్కపోయి వచ్చినట్టున్నాను అని. ఆ కడుము ని cut చేసి నోటిలో పెట్టుకుంటే..ఇంకేముంది ఆ కంపు కొట్టే వాసన అదే అదే . ఓరి దేవుడోయి నోట్లో పెట్టుకున్నది బయటకి ఊసేయలేను.  ఎదురుగా, పక్కన ఉన్నది మా managers , leads , ఇంకా టీం లో ఉన్న మిగతా పరదేసేయులు, నాకు బుర్ర తిరిగిపోయినది . అసలే రెండు రోజుల నుండి అన్నం లేదు. బాగా ఆకలి గా ఉంది. ఎదురుగా అంత  మంది ముందు తీసుకున్నది అంతా వదిలేయలేను. వదిలేస్తే ఏమనుకుంటారో అని, అల డైరెక్ట్ గా వదిలేస్తే బాగోదేమో అని, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ లెండి. వాలేమనుకుంటారో అన్న బాధ కన్నా ఆకలి ఎక్కువైపోయింది .చుట్టూ చూస్తున్నాను ఎవరైనా plate లో ఎక్కువ పదార్ధాలు వదిలేసార అని, ఎందుకంటే నేను కూడా వదిలేయచ్చు కదా. 
ఎవడు కనపడలేదు..అందరు plates ని తిన్నవెంటనే శుభ్రం చేసేసారేమోఅన్నట్టు ఉన్నాయి. ఇంకా తప్పదు అని మెల్లిగా ఒక కుడుముని తిన్నాను. మిగతవేవో ఆకులు అలములు ఉన్నాయి వేరే బౌల్స్ లో, అవి మేసి , నెమరేసుకుంటూ  కూర్చున్నాను.  what happened వెంకట్ అని అడిగితె, ఏడ్చుకుంటూ చెప్పా, మార్నింగ్ i had heavy breakfast అని.
ఇంకా ఆ తరువాత చుడండి , నా కడుపులో సౌండ్స్ ఏవి ఎక్కడున్నాయో , ఏమేమి సౌండ్స్ చేస్తున్నాయో క్లియర్ గా తెలుస్తుంది.
అల అయింది నా మొదటి రోజు. ఇంకా ఉన్నాయి మన ముచ్చట్లు.
ఒక ఆర్డర్ లో రాయడం రాక ఏదేదో రాసేసాను...చాల రోజులైంది రాసి కానీ పబ్లిష్ చేయలేదు..ఇప్పుడు చేస్తున్నాను.
ధన్యవాదములు.