Monday, April 9, 2012

' నేను ఎవరు '

చాల రోజుల కింద ఒక కధ చదివాను ఈనాడు లో.
ఆ కద ప్రకారం, విద్య బుద్దులు నేర్పించడానికి తీసుకునివేల్తున్న తన గురువు గారితో ఆ దేవ దేవుడైన శ్రీరాములు వారు  వసిష్ఠుల మహర్షి వారిని  నేను అంటే ఎవరు (?) , అని అడుగుతారు. దానికి వసిష్ఠుల మహర్షి వారు సమాధానం చెప్పరు ఎందుకంటే ' నేను' అనే దానికి అర్ధం తెలిసిన నాడు అతనికి ఇహ విషయ్జాల మీద ఆసక్తి ఉండదని, అల ఆసక్తి పొయిననాడు శ్రీ శ్రీరాములు వారి కారణ జన్మ కి అర్ధం ఉండదని తలచి సమాధానం తరువాత చెప్తాను అని చెప్తారు.

ఆ తరువాత రామ రావణ యుద్ధం జరిగి , తిరిగి శ్రీరాములు వారు పట్టభిషేకమయ్యే ముందర మల్లి తన గురువు గారిని అడుగుతారు తన సందేహం తీర్చమని, అప్పుడు వసిష్ఠుల మహర్షి వారు తన సమాధానం తో తనకి రాజ్య పాలనా పట్ల ఆసక్తి పోకూడదని మాట తీసుకుని సమాధానం చెప్తారు.

ఈ కద నాకు బాగా నచ్చింది. కానీ నేను దానిని జాగ్రత్త పరచలేదు . online lone చదివాను. save చేసుకుని పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ నా lazyness వల్ల , నా వ్యక్తీగత పనులు బాగా ఎక్కువైపోయి నేను ఈ కదని బద్రపరుచుకోలేదు. ఇప్పుడు ఈనాడు archives లో కూడా లేదు. అవి 90 days వరకు మాత్రమే ఉంటాయి.
కానీ ఈ కద పబ్లిష్ అయి చాల రోజులు అయ్యింది.

విజ్ఞులు ఎవరైనా ఈ కద గుర్తు ఉంటె దయచేసి సమాధానం చెప్పండి. ఒకవేళ ఈ కద ఎక్కద దొరుకుతుందో కొంచెం  ఆ ప్లేస్ చెప్పండి.
ధన్యవాదాలు.



4 comments:

  1. మీరు వ్రాసినది ప్రక్షిప్తం అండీ!
    వాల్మీకి రామాయణం మూలం లో లేదు...
    కాబట్టి పోస్ట్ చేసిన లింక్ నుంచి ఏమైనా ప్రయత్నిస్తే దొరకచ్చునేమో...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారికి, ఆలస్యానికి క్షమించండి. ఆ కథ ఈనాడు లో ప్రచురించబడిందండి. అంతకు ముందు కూడా నేను అటువంటి కథలు చదివాను కాని ఎందుకో నా చిన్న బుర్రకి అర్ధం కాలేదు, కాని ఈ కథ మాత్రం నాకు బాగా అర్ధం అయింది. అందుకే ప్రయతినిస్తున్నాను. చూద్దాం. ఈ ప్రపంచం చాలా చిన్నది కాబట్టి, ఎప్పుడో అప్పుడు కచ్చితంగా దొరుకుతుంది.
      మీ వాఖ్య కి కృతజ్ఞతలండి.

      Delete
  2. రియల్లీ గ్రేట్. నేనే మీ ప్లేస్ లో ఉంటె అలా చేసేవాణ్ణి కాదేమో.
    మీరు ఇంకా బోలెడన్ని మంచి పనులు చేయాలనీ కోరుకుంటున్నాను. నేను కూడా అలా ప్రవర్తించదానికి ప్రయత్నిస్తాను ..............

    http://swarajyam.blogspot.com/ అది నా ఒరిజినల్ బ్లాగ్. నేను నా అనుభవాలు అందులో ఉంచాను చుడండి నచ్చితే ఆచరించండి.. మీరు అన్నట్లు సాద్యమైనంత మంచి చేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నిస్తాను మీ వేణు

    ReplyDelete
    Replies
    1. వేణు గారు, ఆలస్యానికి మన్నించండి.
      కళ్ళముందు ఒకప్పుడు జరిగిన సంఘటనకి స్పందించకుండా ఉన్నందుకు ఇప్పటకి నేను సిగ్గుపడుతున్నాను. కాని మీరు స్పందించే తీరు చూసి నన్ను నేను సంస్కరించుకోవడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు

      Delete