Sunday, April 8, 2012

బాగా confuse అవుతున్నాను.

ఈ మధ్యనే దేశం దాటి బయటకి వచ్చాను. చాల తికమక పడిపోతున్నాను బాష రాక.
ఇంకా కొత్త విషయం ఏంటంటే..అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం. వాచిపోతుంది  నాకు ఇవి అర్ధం చేసుకోవడానికి. నా దరిద్రం కొద్ది దాని మీద ఉండే సూచనలు కూడా వీళ్ళ బాషలోనే ఉన్న్నాయి, దాంతో గూగ్లమ్మ తల్లి ని పట్టుకుని ప్రతి పదానికి అర్ధం అడుక్కోవలసి వస్తుంది.
అదృష్టవశాత్తు నేను నాన్-వెజ్ తింటున్నాను కాబట్టి సరిపోయింది . వెజ్ అయితే ఇంకా వాచిపోను. కానీ వీక్ లో కొన్ని రోజులు తినను అప్పుడు కష్టంగా అనిపిస్తుంది.


ఆఫీసు లో భోజనం తినేటప్పుడు నాకు విపరీతమైన నవ్వొస్తుంది.
మీరు చెబితే నమ్మరు కానీ , ఇప్పటి వరకు నేను ఏమి తింటున్నానో  నాకు తెలియడం లేదు.
ఒకే ఒక్క విషయం అడుగుతున్నాను అక్కడ, ఇది వెజ్  or నాన్-వెజ్ అని ? మల్లి నాన్ -వెజ్ లో ఆ పోర్క్, ham తినను. ఇక్కడేమో అవే అత్యంత ప్రీతీ గా తింటున్నారు. 
వీళ్ళ బాష ని అర్ధం చేసుకోవడానికి చాల try  చేస్తున్నాను, కానీ అన్ని పదాలు నాకు హిష్ హిష్ ల వినిపిస్తున్నాయి. 


మొదటి రోజైతే నాకు ఇంకా గుర్తుంది. ఎలా మర్చిపోతాను కడుపులో ఏమేమి పనిచేస్తాయో వాటి సౌండ్స్ తో సహా విన్నాను. అందరిలా line లో నిలబడ్డాను. ఏదో వెజ్ అని చెబితే plate లోకి తీసుకున్నాను. కానీ ఏదో వాసన వస్తుంది , అది ఎక్కడి నుండో వస్తుందో, అది ఏం వాసనో తెలియడం లేదు. సరేలే మనకెందుకు ఇక్కడ ఇలాగె ఉంటుందేమో అని , ఒక్కసారి గా రౌడీ అల్లుడు సినిమా గుర్తుకు తెచ్చుకుని, ఈ దేశం లో ఇంతే , ఈ దేశం లో ఇంతే అని ముందుకి వెళ్ళిపోయా.  అందరితో పటు కూర్చున్నాను . 
కత్తులు కటార్లు పట్టుకుని రెడీ అయ్యా. బాగా ఆకలి గా ఉంది. plate లో తెల్లగా మూడు ఉండలు (కుడుము ల్లా   ) ఉన్నాయి. ఇంకా ఏదో మన ఊళ్ళో  కూర ఇగురు ల ఉంది. కాని ఆ వాసనేదో ఇంకా ఎక్కువైంది. ఏంట్రా బాబు ఎరక్కపోయి వచ్చినట్టున్నాను అని. ఆ కడుము ని cut చేసి నోటిలో పెట్టుకుంటే..ఇంకేముంది ఆ కంపు కొట్టే వాసన అదే అదే . ఓరి దేవుడోయి నోట్లో పెట్టుకున్నది బయటకి ఊసేయలేను.  ఎదురుగా, పక్కన ఉన్నది మా managers , leads , ఇంకా టీం లో ఉన్న మిగతా పరదేసేయులు, నాకు బుర్ర తిరిగిపోయినది . అసలే రెండు రోజుల నుండి అన్నం లేదు. బాగా ఆకలి గా ఉంది. ఎదురుగా అంత  మంది ముందు తీసుకున్నది అంతా వదిలేయలేను. వదిలేస్తే ఏమనుకుంటారో అని, అల డైరెక్ట్ గా వదిలేస్తే బాగోదేమో అని, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ లెండి. వాలేమనుకుంటారో అన్న బాధ కన్నా ఆకలి ఎక్కువైపోయింది .చుట్టూ చూస్తున్నాను ఎవరైనా plate లో ఎక్కువ పదార్ధాలు వదిలేసార అని, ఎందుకంటే నేను కూడా వదిలేయచ్చు కదా. 
ఎవడు కనపడలేదు..అందరు plates ని తిన్నవెంటనే శుభ్రం చేసేసారేమోఅన్నట్టు ఉన్నాయి. ఇంకా తప్పదు అని మెల్లిగా ఒక కుడుముని తిన్నాను. మిగతవేవో ఆకులు అలములు ఉన్నాయి వేరే బౌల్స్ లో, అవి మేసి , నెమరేసుకుంటూ  కూర్చున్నాను.  what happened వెంకట్ అని అడిగితె, ఏడ్చుకుంటూ చెప్పా, మార్నింగ్ i had heavy breakfast అని.
ఇంకా ఆ తరువాత చుడండి , నా కడుపులో సౌండ్స్ ఏవి ఎక్కడున్నాయో , ఏమేమి సౌండ్స్ చేస్తున్నాయో క్లియర్ గా తెలుస్తుంది.
అల అయింది నా మొదటి రోజు. ఇంకా ఉన్నాయి మన ముచ్చట్లు.
ఒక ఆర్డర్ లో రాయడం రాక ఏదేదో రాసేసాను...చాల రోజులైంది రాసి కానీ పబ్లిష్ చేయలేదు..ఇప్పుడు చేస్తున్నాను.
ధన్యవాదములు.







5 comments:

  1. వ్రాయండి.మీ అనుభవాలు,ఆలోచనలు భావనలు.......
    :మొదటి అడుగు
    -------------------------------------------------
    @మొదటి అడుగు: ఎందుకో మీ కామెంట్ పబ్లిష్ అవ్వడం లేదు.
    అందుకే ఇక్కడ పేస్టు చేస్తున్నాను.
    మీ స్పందన కి ధన్యవాదములు.

    ReplyDelete
  2. Home work sir home work
    Where did you go to school???
    It is very easy these days with internet....
    You have to do homework before going to school...
    likewise do homework before going to new place,...

    ReplyDelete
    Replies
    1. Anonymous గారికి. చేసానండి బాబు , చాల research చేసాను. ఈ ప్లేస్ కి మా ప్రాజెక్ట్ నుండి ఒకే ఒక సీనియర్ వచ్చారు ముందు గా. ఆయనని అన్ని విషయాలు అడిగాను. food విషయం లో ఏమి చెయ్యలేము అని చెప్పారు. మొదట ఒక వారం రోజులు బాగా ఇబ్బంది పడ్డాను కాని ఆ తరువాత మెల్లిగా adjust అవ్వడం start చేసాను.
      anyhow మీ స్పందన కి ధన్యవాదాలు.

      Delete
  3. మీరే దేశంలో ఉన్నారో కానీ ఇలాంటివి ప్రతీ చోటా ఉండే ఇబ్బందులే అందుకే స్వయంపాకానికి మించిన అమృతం లేదు!

    ReplyDelete
    Replies
    1. అవునండి, అదే చేస్తున్నాను. ఎం చెస్తాం. తప్పదు కదా. కాని మొదట ఒక నెల రోజులు ఐతె చాల కష్టపడ్డాను. వీక్ డేస్ లొ ఐతె ఆఫీస్ లో ఏదొ ఒకటి తినేవాన్ని, వీక్ ఎండ్ లొ అస్సలు ఉండలేకపొయేవాన్ని. మేము ఉండె హొటెల్ లొ నాకు ఏమి నచ్చెవి కావు. ఏదొ కష్టపడి ఏదొ ఒకటి తినదానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు రూం తీసుకున్నను కాబట్టి పరవాలేదు. ఏదొ ఒకటి పెరుగు వెసుకుని అయిన తింటున్నాను.
      మీ వాఖ్య కి క్రితజ్ఞతలు. పని ఒత్తిడి లొ నా బ్లాగ్ అస్సలు ఒపెన్ చేయలేదు. కేవలం సమూహాలు ఒపెన్ చేసి చదువుతున్నాను అప్పుడప్పుడు. ఆలస్యనికి క్షమించండి.

      Delete