Wednesday, November 23, 2016

మోడీ కి వ్యతిరేఖంగా ప్రతిపక్షాలని కూడగడతానంటున్న పాకిస్తాన్



ప్రతిపక్షాన్ని ఎగదోస్తామని పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించింది. ఇంత ఆగ్రహానికి కారణం మోడీ ఆ దేశానికి ఊపిరి ఆడనీయకపోవడమే.

వాళ్ళు కాల్పుల ఒప్పందం ఉల్లంఘించిన ప్రతీసారి చేతులు ముడుచుకుని కూర్చోకుండా , వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే సమాధానాలు ఇస్తుండడం, ఏ  నిమిషం లో ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విపరీతంగా సతమతమైపోతున్నారు. మీరు పాకిస్తాన్ న్యూస్ పేపర్స్  చదివితే మోడీ  ని విపరీతంగా తిడుతూ ఎడిటోరియల్స్ ఉంటున్నాయి .




సోషల్ మీడియా లో కాశ్మీర్ పోరాటాన్ని (??) లేవనెత్తడం , ముఖ్యంగా ఇండియా లో మోడీ వ్యతిరేఖించేవారికి సహయం చేయడం లాంటివి వాళ్ళ ప్రధాన అంశాలని తెలుస్తుంది .





చూస్తుంటే కొన్ని వెబ్ పత్రికలకి పంట పండినట్టే ఉంది . మన తెలుగులో కూడా ఉన్నాయి గా. అంతే కాదు కొంతమంది ఫేస్బుక్ యూసర్ ల అకౌంట్ నిండిపోతుందేమో . ???


Saturday, November 19, 2016

సెక్స్ అబ్యూస్ / రేప్ పనిష్మెంట్ గా బాధితురాలిని పెళ్లి చేసుకుంటే చాలు , టర్కీ లో వివాదాస్పద బిల్

మైనర్ ని పెళ్లి చేసుకునేలా చట్టం రూపొందించడం పై టర్కీ లో వివిధ ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి .

http://www.dawn.com/news/1297339/anger-in-turkey-at-bill-to-quash-child-sex-convictions

మిలిటరీ తిరుగుబాటు తరువాత , ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ కి మతి చెలించినట్లుంది .

మైనర్ ని సెక్సువల్ గా అస్సౌల్త్ చేసిన వాళ్లకి ఇక ఏ మాత్రం శిక్ష ఉండదు . ప్రభుత్వ శుష్క వాదన ఏంటంటే ..  చైల్డ్ మ్యారేజ్ లని కంట్రోల్ చేయడానికె ఈ బిల్ పెట్టామని వాదిస్తుంది .

the law would allow the release from prison of men guilty of assaulting a minor if the act was committed without “force, threat, or any other restriction on consent” and if the aggressor “marries the victim”.

చైల్డ్ marriages టర్కీ సౌత్ ఈస్ట్ లో చాలా కామన్ , కానీ అందరిని శిక్షించలేక, ఆ జనాలని జైలు నుండి రిలీజ్ చేయించడానికి ఈ బిల్ పెట్టినట్టుంది .

టర్కీ ఆల్రెడీ ఇస్లామాజషన్ వైపు ప్రయాణిస్తుంది .  రాడికల్ ఇస్లాం మాత్రమే తనని రక్షిస్తుంది అని అధ్యక్షుడు బలంగా నమ్ముతున్నాడు . కొన్ని వేలమంది జడ్జ్ లని , విలేఖరి లని ( చైనా కన్నా ఎక్కువ ) , ప్రభుత్వ అధికారులని మిలిటరీ తిరుగుబాటు కి మద్దతు తెలిపారని జైలు లో వేసి తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు .

మిలిటరీ తిరుగుబాటు చేసింది చాలా తక్కువ మంది ,అది కూడా క్రింద స్థాయి సైనికులు .
తనని తాను మరింత బలమైన నాయకుడి గా చేసుకుని , అధికారాల్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి అధ్యక్షుడే ఈ నాటకం ఆడినట్టు చాలా దేశాలు అనుమానిస్తున్నాయి .

అంతే కాదు ,  దీనికి కారణం Fethullah gulen దీనికి అని చెప్పి , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని స్కూల్ అన్నింటిని మూయించడం మొదలెట్టాడు . ఎర్డోగాన్ రాకతో ,  పాకిస్తాన్ ఇంచుమించు నాలుగు వందలమంది టర్కీ టీచర్ లు మరియు కుటుంబ సభ్యులని వెంటనే దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది .  పది , ఇరవై సంవత్సరాల నుండి నివసిస్తున్న అందరు ఇప్పుడు కన్నీళ్లతో , భయంగా ( టర్కీ లో వీళ్ళ భవిష్యత్తు పై ఆశలు లేక ) వెళ్తున్నారు .

మళ్ళి ఇదే పాకిస్తాన్ ట్రంప్ ని ముస్లిం లని దేశం లో రానీయను అని చెప్పినందుకు విమర్శిస్తుంది , ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే .




Monday, November 14, 2016

జపాన్ తో అణు ఒప్పందం తో చైనా కి చెక్ పెట్టిన ఇండియా

పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ కి అణు సరఫరా చేస్తూ, మనకి సుద్దులు చెప్పే చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది . ఎందుకంటే NSG లో చేరకుండానే జపాన్ మనతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం .

మోడీ జపాన్ పర్యటన లో ఉండగానే , చైనా మీడియా మనల్ని హెచ్చరిస్తూ ఒక కథనం రాయడమే దీనికి ఉదాహరణ .

NSG లో చేరడానికి మనకి  ఎన్ని అడ్డంకులు స్పృష్టించాలో అన్ని చేసి , తీవ్రవాదుల మీద చర్యలని అడ్డుకుని , వివాదాస్పద కాశ్మీర్ నుండి పాకిస్తాన్ కి cpec బిల్డ్ చేయడం , అరుణాచలప్రదేశ్ ని వివాదాస్పదం చేయడం ,  cpec కి అడ్డు రాకుండా ఉండటానికి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లకి బిలియన్స్ డాలర్ లని లంచంగా  ఇవ్వడం , తిరిగి వాళ్ళు అది మన మీద వాడటం .

ఇన్ని దారుణాలు చేస్తూ ఇండియా అభివృద్ధి ని అడ్డుకుంటూ వస్తుందో మన చైనా అభిమానులు గమనించాలి .



Friday, November 11, 2016

పాకిస్తాన్ టెర్రరిజమ్ వెనక చైనా హస్తం , హఫీజ్ సయెద్ మీద చర్యలకి మోకాలడ్డు

మసూద్ హజార్
జైషే మహమ్మద్
హఫీజ్ సయెద్
లష్కరే తోయిబా
హిజ్బుల్ ముజాహిదీన్
 సయెద్ సలావుద్దీన్

ఈ పేర్లు వింటుంటే మీ రక్తం ఉడికిపోతుంది కదా . కానీ ఈ సంస్థ ల మీద , టెర్రరిస్ట్ ల మీద ఆంక్షలకి , చర్యలకి ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసా ?  చైనా .

అవును చైనా నే .

2011 లో మసూద్ హాజర్ మీద చర్యలకి చైనా మోకాలడ్డింది . ఇప్పుడు అన్ని సాక్ష్యాధారాలు ఇఛ్చిన తరువాత కూడా హఫీజ్ సయెద్ మీద చర్యలకి భద్రతా సమితి లో మళ్ళి మోకాలడ్డింది .


చైనా కి ఇండియా మీద ఉన్న ద్వేషం ఈ విధంగా తీర్చుకుంటుంది అంతే కాదు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజాన్ని తన వంతు సహకారాన్ని ఇస్తుంది .

2009 లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ హజార్ మీద ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల కి అడ్డుపడింది .
2010 లో హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ ని టెర్రరిస్ట్ ల లిస్ట్ లో పెట్టడాన్ని అడ్డుకుంది .
 ఇలా చాలా సార్లు ఇండియా ప్రయత్నాల్ని తనకున్న వీటో అధికారం తో అడ్డుకుంది .

ఈ మధ్యన ముంబై లో జనాలని ఊచకోత కోసిన హఫీజ్ సయ్యద్ మీద చర్యలని రెండు సార్లు వరసనే అడ్డుకంది , గత నెలలో దానిని పొడిగించింది కూడా.

హఫీజ్ సయ్యద్ బహిరంగంగా నే టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే .

ఇండియా అభ్యంతరాలని తోసిపుఛ్చి వివాదాస్పద కాశ్మీర్ లో cpec ని నిర్మించడం కూడా చైనా కి ఇండియా మీద ఉన్న ద్వేషం చూపించింది .

ఇవన్నీ చేసి, తిరిగి , టెర్రరిజాన్ని అంతం చేయాలని వివిధ వేదిక ల మీద అబద్దాలు ప్రచారం చేస్తూ ఉంటుంది .

ఏ విధంగా అయినా కాశ్మీర్ లో అల్లకల్లోలం స్పృష్టించాలని పాకిస్తాన్ చేసే పన్నాగాలకి చైనా ఎప్పుడు సహకారం ఇస్తూనే ఉంది, ఇస్తూనే ఉంటుంది అనే తెలుస్తుంది .

source:

. https://www.quora.com/Why-did-China-block-Indias-move-in-the-UN-demanding-action-against-Pakistan-over-the-release-of-Mumbai-attack-mastermind-Zakiur-Rehman-Lakhvi

quora లో చాలా లింక్స్ ఉన్నాయి with genuine links.



Wednesday, November 9, 2016

ములుగు గారి జ్యోతిష్యం తప్పింది , KT astro గారిది నిజమయ్యింది

నేను జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్మకపోయినా కొంత వరకు ఫాలో అవుతుంటాను . 

కాకపోతే ఈ మధ్యన నేను ఫాలో అవుతున్న  ఇద్దరు జ్యోతిష్యులు పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వెల్లడించేసరికి ఆశ్చర్యం వేసింది . 
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారూ హిల్లరీ గెలుస్తుందని ఘంటాపధంగా చెప్పారు . 


కానీ ఆ తరువాత క్షమాపణలు చెప్తూ మరొక పోస్ట్ చేశారు  


కాకపోతే ఏ విధంగా అంచనా తప్పింది అని చెప్పలేదు , ఆయిన చెప్పినా నేను అర్ధం చేసుకోలేను . 

కాకపోతే వేరొక వేదిక్ జ్యోతిష్యులు ఇది కరెక్ట్ గా ఊహించారు . ఆల్మోస్ట్ 1 ఇయర్ క్రితమే ఆయన ఆ పోస్ట్ రాశారు . 
http://www.ktastro.com/

ఈ రెండు సైట్ లు అప్పుడప్పుడు ఓపెన్ చేయడం వల్ల  నాకు కొంచెం ఉత్సుకత గా అనిపించి , స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను , అంతే కానీ ఇది ఎవరిని అవమానించాలని కాదు . 


Friday, November 4, 2016

కాశ్మీర్ లో బడులకి , స్కూల్ కి నిప్పు పెడుతున్న ఇస్లామిక్ చాంధసవాదులు , నోరు మెదపని మన నాయకులు మరియు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని బ్రతికే లౌకిక వాదులు

 కాశ్మీర్ లో బడులకి , స్కూల్ కి నిప్పు పెడుతున్న ఇస్లామిక్ చాంధసవాదులు , నోరు మెదపని మన నాయకులు మరియు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని బ్రతికే లౌకిక వాదులు

ఈ రోజు ఈనాడు లో ఈ ఆర్టికల్ చూసారా ?
కాశ్మిర్ లో స్కూళ్ల ని అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు ఈ ఇస్లామిక్ చాంధసవాదులు. కేవలం రెండు నెలలు లో ఇరవై అయిదు స్కూళ్ళని కాల్చేశారు . పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ తెలుస్తుంది .

స్కూళ్ళు లో ఉంటె , పిల్లలు రాళ్లు విసరడానికి బయటకి రారు .  అన్న కారణం చే,  వాళ్ళ భవిష్యత్తు ని మంట కలిపేస్తూ ఉంటె, ఈ సో called కమ్మి లు మరియు నాయకులు చలి కాచుకుంటూ సోది కబుర్లు చెప్పుకుంటున్నారు , పోయేది సామాన్య జనాలే కాబట్టి వాళ్లకి ఈ పెయిన్ తెలియదు .





ఎంత మంది ఖండించారు ఈ అరాచాకాలని ?? కనీసం చదువు కి ఉన్న ప్రాముఖ్యత తెలియని ఈ జనాలు , అరాచకాలతో జనాల జీవితాలని  దుర్భరం చేస్తున్న ఈ జనాలు  కాశ్మిర్ కి స్వాతంత్య్రం కావాలంట , దానికి డప్పు వాయించేది మన నాయకులు . మలాలా ని కాల్చేసిన ఈ సిద్ధాంతాలు ఇప్పుడు కాశ్మిర్ లోకి అల్ల కల్లోలం స్పృష్టిస్తున్నాయి .

పాకిస్తాన్ ఈ మంటల్ని ఎగతోస్తుందని చెడ్డి లు వేసుకునే పిల్లగాడు కూడా చెప్పగలడు . కానీ వీళ్ళకి కనిపించదు . మళ్ళీ కన్నీరు కారుస్తూ వీళ్ళు రాతలు చదువుతుంటే , ఆ సిద్ధాంతాలు చదువుకున్నవాడు ఇంత దారుణంగా ఆలోచిస్తారా ? అని అనిపిస్తుంది .
చదువు ప్రాముఖ్యత తెలియని ఈ సన్నాసులు కి వంత పాడేది మన మధ్యలో ఉన్న నాయకులు మరియు లౌకిక వాదమనే ముసుగు వేసుకుని మన మధ్యలో ఉన్న జనాలు .
ఈ మధ్యన , వార్తలు పేరుతో తన అక్కసుని వెళ్ళకక్కే బ్లాగర్ ఏం రాసారో తెలుసా ?
"కాశ్మీర్ ప్రజలు ఆరాధించే బురాన్ వని " అంటూ .....   ఇలాంటి రాతలు తో స్కూల్లే కాదు రాష్ట్రాలు కూడా తగలబడి పోతాయి.
ఫేస్బుక్ లో కొంతమంది ప్రజాస్వామ్యవాదులం అంటూ , కమ్యూనిజం అంటూ AC లో కూర్చుని రాసే రాతలు చదివితే 70-80 లలో  జనం బుర్రలు ఎలా మారిపోయాయి అర్ధం అవుతుంది .

కాశ్మీర్ అల్ల కల్లోలం అవ్వడానికి కారణం తెలిసి కూడా, తెలియనట్టు నటించడం , అంతే కాదు
చైనా గురించి కానీ,  సిల్క్ రోడ్ పేరుతో కాశ్మీర్ లో చైనా నిర్మిస్తున్న cpec గురించి కానీ , పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి కానీ రాయడానికి  కలలో కూడా మనస్కరించదు , వాటి గురించి అడిగితే ఆ కామెంట్ కూడా రాదు .