Friday, November 11, 2016

పాకిస్తాన్ టెర్రరిజమ్ వెనక చైనా హస్తం , హఫీజ్ సయెద్ మీద చర్యలకి మోకాలడ్డు

మసూద్ హజార్
జైషే మహమ్మద్
హఫీజ్ సయెద్
లష్కరే తోయిబా
హిజ్బుల్ ముజాహిదీన్
 సయెద్ సలావుద్దీన్

ఈ పేర్లు వింటుంటే మీ రక్తం ఉడికిపోతుంది కదా . కానీ ఈ సంస్థ ల మీద , టెర్రరిస్ట్ ల మీద ఆంక్షలకి , చర్యలకి ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసా ?  చైనా .

అవును చైనా నే .

2011 లో మసూద్ హాజర్ మీద చర్యలకి చైనా మోకాలడ్డింది . ఇప్పుడు అన్ని సాక్ష్యాధారాలు ఇఛ్చిన తరువాత కూడా హఫీజ్ సయెద్ మీద చర్యలకి భద్రతా సమితి లో మళ్ళి మోకాలడ్డింది .


చైనా కి ఇండియా మీద ఉన్న ద్వేషం ఈ విధంగా తీర్చుకుంటుంది అంతే కాదు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజాన్ని తన వంతు సహకారాన్ని ఇస్తుంది .

2009 లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ హజార్ మీద ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల కి అడ్డుపడింది .
2010 లో హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ ని టెర్రరిస్ట్ ల లిస్ట్ లో పెట్టడాన్ని అడ్డుకుంది .
 ఇలా చాలా సార్లు ఇండియా ప్రయత్నాల్ని తనకున్న వీటో అధికారం తో అడ్డుకుంది .

ఈ మధ్యన ముంబై లో జనాలని ఊచకోత కోసిన హఫీజ్ సయ్యద్ మీద చర్యలని రెండు సార్లు వరసనే అడ్డుకంది , గత నెలలో దానిని పొడిగించింది కూడా.

హఫీజ్ సయ్యద్ బహిరంగంగా నే టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే .

ఇండియా అభ్యంతరాలని తోసిపుఛ్చి వివాదాస్పద కాశ్మీర్ లో cpec ని నిర్మించడం కూడా చైనా కి ఇండియా మీద ఉన్న ద్వేషం చూపించింది .

ఇవన్నీ చేసి, తిరిగి , టెర్రరిజాన్ని అంతం చేయాలని వివిధ వేదిక ల మీద అబద్దాలు ప్రచారం చేస్తూ ఉంటుంది .

ఏ విధంగా అయినా కాశ్మీర్ లో అల్లకల్లోలం స్పృష్టించాలని పాకిస్తాన్ చేసే పన్నాగాలకి చైనా ఎప్పుడు సహకారం ఇస్తూనే ఉంది, ఇస్తూనే ఉంటుంది అనే తెలుస్తుంది .

source:

. https://www.quora.com/Why-did-China-block-Indias-move-in-the-UN-demanding-action-against-Pakistan-over-the-release-of-Mumbai-attack-mastermind-Zakiur-Rehman-Lakhvi

quora లో చాలా లింక్స్ ఉన్నాయి with genuine links.



No comments:

Post a Comment