Friday, November 4, 2016

కాశ్మీర్ లో బడులకి , స్కూల్ కి నిప్పు పెడుతున్న ఇస్లామిక్ చాంధసవాదులు , నోరు మెదపని మన నాయకులు మరియు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని బ్రతికే లౌకిక వాదులు

 కాశ్మీర్ లో బడులకి , స్కూల్ కి నిప్పు పెడుతున్న ఇస్లామిక్ చాంధసవాదులు , నోరు మెదపని మన నాయకులు మరియు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని బ్రతికే లౌకిక వాదులు

ఈ రోజు ఈనాడు లో ఈ ఆర్టికల్ చూసారా ?
కాశ్మిర్ లో స్కూళ్ల ని అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు ఈ ఇస్లామిక్ చాంధసవాదులు. కేవలం రెండు నెలలు లో ఇరవై అయిదు స్కూళ్ళని కాల్చేశారు . పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ తెలుస్తుంది .

స్కూళ్ళు లో ఉంటె , పిల్లలు రాళ్లు విసరడానికి బయటకి రారు .  అన్న కారణం చే,  వాళ్ళ భవిష్యత్తు ని మంట కలిపేస్తూ ఉంటె, ఈ సో called కమ్మి లు మరియు నాయకులు చలి కాచుకుంటూ సోది కబుర్లు చెప్పుకుంటున్నారు , పోయేది సామాన్య జనాలే కాబట్టి వాళ్లకి ఈ పెయిన్ తెలియదు .





ఎంత మంది ఖండించారు ఈ అరాచాకాలని ?? కనీసం చదువు కి ఉన్న ప్రాముఖ్యత తెలియని ఈ జనాలు , అరాచకాలతో జనాల జీవితాలని  దుర్భరం చేస్తున్న ఈ జనాలు  కాశ్మిర్ కి స్వాతంత్య్రం కావాలంట , దానికి డప్పు వాయించేది మన నాయకులు . మలాలా ని కాల్చేసిన ఈ సిద్ధాంతాలు ఇప్పుడు కాశ్మిర్ లోకి అల్ల కల్లోలం స్పృష్టిస్తున్నాయి .

పాకిస్తాన్ ఈ మంటల్ని ఎగతోస్తుందని చెడ్డి లు వేసుకునే పిల్లగాడు కూడా చెప్పగలడు . కానీ వీళ్ళకి కనిపించదు . మళ్ళీ కన్నీరు కారుస్తూ వీళ్ళు రాతలు చదువుతుంటే , ఆ సిద్ధాంతాలు చదువుకున్నవాడు ఇంత దారుణంగా ఆలోచిస్తారా ? అని అనిపిస్తుంది .
చదువు ప్రాముఖ్యత తెలియని ఈ సన్నాసులు కి వంత పాడేది మన మధ్యలో ఉన్న నాయకులు మరియు లౌకిక వాదమనే ముసుగు వేసుకుని మన మధ్యలో ఉన్న జనాలు .
ఈ మధ్యన , వార్తలు పేరుతో తన అక్కసుని వెళ్ళకక్కే బ్లాగర్ ఏం రాసారో తెలుసా ?
"కాశ్మీర్ ప్రజలు ఆరాధించే బురాన్ వని " అంటూ .....   ఇలాంటి రాతలు తో స్కూల్లే కాదు రాష్ట్రాలు కూడా తగలబడి పోతాయి.
ఫేస్బుక్ లో కొంతమంది ప్రజాస్వామ్యవాదులం అంటూ , కమ్యూనిజం అంటూ AC లో కూర్చుని రాసే రాతలు చదివితే 70-80 లలో  జనం బుర్రలు ఎలా మారిపోయాయి అర్ధం అవుతుంది .

కాశ్మీర్ అల్ల కల్లోలం అవ్వడానికి కారణం తెలిసి కూడా, తెలియనట్టు నటించడం , అంతే కాదు
చైనా గురించి కానీ,  సిల్క్ రోడ్ పేరుతో కాశ్మీర్ లో చైనా నిర్మిస్తున్న cpec గురించి కానీ , పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి కానీ రాయడానికి  కలలో కూడా మనస్కరించదు , వాటి గురించి అడిగితే ఆ కామెంట్ కూడా రాదు .






No comments:

Post a Comment