నేను జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్మకపోయినా కొంత వరకు ఫాలో అవుతుంటాను .
కాకపోతే ఈ మధ్యన నేను ఫాలో అవుతున్న ఇద్దరు జ్యోతిష్యులు పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వెల్లడించేసరికి ఆశ్చర్యం వేసింది .
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారూ హిల్లరీ గెలుస్తుందని ఘంటాపధంగా చెప్పారు .
కానీ ఆ తరువాత క్షమాపణలు చెప్తూ మరొక పోస్ట్ చేశారు
కాకపోతే ఏ విధంగా అంచనా తప్పింది అని చెప్పలేదు , ఆయిన చెప్పినా నేను అర్ధం చేసుకోలేను .
కాకపోతే వేరొక వేదిక్ జ్యోతిష్యులు ఇది కరెక్ట్ గా ఊహించారు . ఆల్మోస్ట్ 1 ఇయర్ క్రితమే ఆయన ఆ పోస్ట్ రాశారు .
http://www.ktastro.com/
ఈ రెండు సైట్ లు అప్పుడప్పుడు ఓపెన్ చేయడం వల్ల నాకు కొంచెం ఉత్సుకత గా అనిపించి , స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను , అంతే కానీ ఇది ఎవరిని అవమానించాలని కాదు .
ఇందులో ఏమీ విశేషం లేదుకదండీ. ఐతే ఆడపిల్ల లేకపోతే మగపిల్లవాడు అన్నట్లుగా కదూ. కొందరు సరిగ్గా చెప్పినట్లూ కొందరు తప్పినట్లూ కాక తప్పుతుందా మరి..
ReplyDelete