Wednesday, November 23, 2016

మోడీ కి వ్యతిరేఖంగా ప్రతిపక్షాలని కూడగడతానంటున్న పాకిస్తాన్



ప్రతిపక్షాన్ని ఎగదోస్తామని పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించింది. ఇంత ఆగ్రహానికి కారణం మోడీ ఆ దేశానికి ఊపిరి ఆడనీయకపోవడమే.

వాళ్ళు కాల్పుల ఒప్పందం ఉల్లంఘించిన ప్రతీసారి చేతులు ముడుచుకుని కూర్చోకుండా , వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే సమాధానాలు ఇస్తుండడం, ఏ  నిమిషం లో ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విపరీతంగా సతమతమైపోతున్నారు. మీరు పాకిస్తాన్ న్యూస్ పేపర్స్  చదివితే మోడీ  ని విపరీతంగా తిడుతూ ఎడిటోరియల్స్ ఉంటున్నాయి .




సోషల్ మీడియా లో కాశ్మీర్ పోరాటాన్ని (??) లేవనెత్తడం , ముఖ్యంగా ఇండియా లో మోడీ వ్యతిరేఖించేవారికి సహయం చేయడం లాంటివి వాళ్ళ ప్రధాన అంశాలని తెలుస్తుంది .





చూస్తుంటే కొన్ని వెబ్ పత్రికలకి పంట పండినట్టే ఉంది . మన తెలుగులో కూడా ఉన్నాయి గా. అంతే కాదు కొంతమంది ఫేస్బుక్ యూసర్ ల అకౌంట్ నిండిపోతుందేమో . ???


2 comments:

  1. మనప్రతిపక్షాలకు మోదీపైన వ్యతితరేకతను చాటే ఏ అవకాశం ఎవరు కల్పించుతామన్నా సంతోషమే. అందుచేత పాకిస్తాన్ దేశాన్ని ఆదర్శదేశంగా అభివర్ణించటానికైనా వారు తయారవుతారని ఘంటాపథంగా చెప్పవచ్చును. ఇకమన దేశపు మేథావులంటారా వాళ్ళెప్పుడూ ప్రభుత్వవ్యతిరేకతయే ప్రజానుకూలత అన్న సిధ్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఆప్రభుత్వవ్యతిరేకతకు పాకిస్తాన్ నాయకత్వం వహిస్తామంటే వీళ్ళంతా ఎగిరిగంతేసి మరీ పాకిస్తాన్ ఆలోచనాధోరణి మహాభేషుగ్గా ఉందని కితాబులిచ్చేస్తారు.

    ReplyDelete
  2. ప్రజలకిదేం పట్టటం లేదంటారా?

    ReplyDelete