Saturday, November 19, 2016

సెక్స్ అబ్యూస్ / రేప్ పనిష్మెంట్ గా బాధితురాలిని పెళ్లి చేసుకుంటే చాలు , టర్కీ లో వివాదాస్పద బిల్

మైనర్ ని పెళ్లి చేసుకునేలా చట్టం రూపొందించడం పై టర్కీ లో వివిధ ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి .

http://www.dawn.com/news/1297339/anger-in-turkey-at-bill-to-quash-child-sex-convictions

మిలిటరీ తిరుగుబాటు తరువాత , ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ కి మతి చెలించినట్లుంది .

మైనర్ ని సెక్సువల్ గా అస్సౌల్త్ చేసిన వాళ్లకి ఇక ఏ మాత్రం శిక్ష ఉండదు . ప్రభుత్వ శుష్క వాదన ఏంటంటే ..  చైల్డ్ మ్యారేజ్ లని కంట్రోల్ చేయడానికె ఈ బిల్ పెట్టామని వాదిస్తుంది .

the law would allow the release from prison of men guilty of assaulting a minor if the act was committed without “force, threat, or any other restriction on consent” and if the aggressor “marries the victim”.

చైల్డ్ marriages టర్కీ సౌత్ ఈస్ట్ లో చాలా కామన్ , కానీ అందరిని శిక్షించలేక, ఆ జనాలని జైలు నుండి రిలీజ్ చేయించడానికి ఈ బిల్ పెట్టినట్టుంది .

టర్కీ ఆల్రెడీ ఇస్లామాజషన్ వైపు ప్రయాణిస్తుంది .  రాడికల్ ఇస్లాం మాత్రమే తనని రక్షిస్తుంది అని అధ్యక్షుడు బలంగా నమ్ముతున్నాడు . కొన్ని వేలమంది జడ్జ్ లని , విలేఖరి లని ( చైనా కన్నా ఎక్కువ ) , ప్రభుత్వ అధికారులని మిలిటరీ తిరుగుబాటు కి మద్దతు తెలిపారని జైలు లో వేసి తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు .

మిలిటరీ తిరుగుబాటు చేసింది చాలా తక్కువ మంది ,అది కూడా క్రింద స్థాయి సైనికులు .
తనని తాను మరింత బలమైన నాయకుడి గా చేసుకుని , అధికారాల్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి అధ్యక్షుడే ఈ నాటకం ఆడినట్టు చాలా దేశాలు అనుమానిస్తున్నాయి .

అంతే కాదు ,  దీనికి కారణం Fethullah gulen దీనికి అని చెప్పి , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని స్కూల్ అన్నింటిని మూయించడం మొదలెట్టాడు . ఎర్డోగాన్ రాకతో ,  పాకిస్తాన్ ఇంచుమించు నాలుగు వందలమంది టర్కీ టీచర్ లు మరియు కుటుంబ సభ్యులని వెంటనే దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది .  పది , ఇరవై సంవత్సరాల నుండి నివసిస్తున్న అందరు ఇప్పుడు కన్నీళ్లతో , భయంగా ( టర్కీ లో వీళ్ళ భవిష్యత్తు పై ఆశలు లేక ) వెళ్తున్నారు .

మళ్ళి ఇదే పాకిస్తాన్ ట్రంప్ ని ముస్లిం లని దేశం లో రానీయను అని చెప్పినందుకు విమర్శిస్తుంది , ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే .




No comments:

Post a Comment