ఈ రోజు న్యూస్ చదువుతుంటే , యదా ప్రకారం , హాట్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 17 .
హైదరాబాద్ విమోచన గురించి అంత లోతైన సమాచారం నాకు తెలియదు , కాని కెసిఆర్ మాత్రం
అప్పట్లో ప్రభుత్వాలని ఒక ఆట ఆడుకున్నట్టు బాగా గుర్తు .
మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఆగుస్ట్ 15 న కాదు , సెప్టెంబర్ 17 అని గొంతెత్తి నినాదాలు చేసారు .
అప్పటి ప్రభుత్వాలు పాపం కక్కలేక మింగలేక తెగ ఇబ్బంది పడ్డాయి .
ఇప్పుడు మన కెసిఆర్ ఏం చేస్తారో చూద్దాం , అందరిలానే తప్పించుకుని పారిపోతారో , లేక ధైర్యంగా విమోచన దినాన్ని అధికారికంగా చేస్తారో . ??
నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే , కెసిఆర్ ఖచ్చితంగా చేస్తారు అని , పారిపోయే మనస్తత్వం కాదు అని అనిపిస్తుంది .
No comments:
Post a Comment