సమాధానం చాలా ఈజీ , అవును అని చెప్పేయొచ్చూ . కాకపోతే మనం కొంచెం లోతు గా వెల్దాము .
యురోపియన్ దేశాలలో అతి ముఖ్యమైనది , ఆ ప్రభుత్వాలు ప్రజల పట్ల తీసుకునే జాగ్రత్త్తలు , మరియు ఫ్రీడమ్ .
అందులో సోషల్ బెనిఫిట్స్ ( తెలుగు లో ఏమంటారో గుర్తు రావడం లేదు ) ఇంకా ముఖ్యమైనది .
అంటే మీరు ఆయా దేశ పౌరుడు అయి ఉంటే , మీకు ఉద్యోగం లేనట్లయితే ప్రభుత్వమే మిమ్మల్ని పెంచి పోషిస్తుంది .
మీకు ఉద్యోగం ఉండి , అది ఊడిపోతే ప్రభుత్వం ఇంచుమించు ఎనభై శాతం జీతం ఇస్తుంది ఒక సంవత్సరం వరకు. ఆ తరువాత తగ్గుతూ ఉంటుంది .
అంతే కాదు ఉద్యోగం లేనివాళ్లు తమ నైపుణ్యాలు పెంచుకొనేందుకు కూడా సహాయం ఇస్తుంది .
పెళ్ళై , పిల్లలు ఉంటె , ఇల్లు కూడా ఇస్తుంది .
ఇందు కోసం కష్టపడి పని చేసేవాల్ల దగ్గర టాక్స్ లు భారీగా వసులు చేస్తారు.
ఇవి చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి . చాలా మంది పనిచేయకుండా , ఏవేవో కారణాలు చెప్పి , అంటే మేము ఉద్యోగానికి పనికి రానని , నాకు ఆ జబ్బు , ఈ జబ్బు అని ఇంట్లో ఖాళి గా కూర్చుని జల్సాలు చేస్తూ ఉంటారు .
ఆ బెనిఫిట్స్ ఎంత బాగుంటాయంటే ..
పిల్లలకి డబ్బులు , చదువు ఫ్రీ
ఇల్లు ఫ్రీ
జేబు ఖర్చులు ఫ్రీ
ఇలా ఎన్నో ..
అంతెందుకు , ఇప్పుడు యూరోప్ లో వలస వఛ్చిన వాళ్లకి కూడా వారానికి కొంత చొప్పున ఖర్చులకి ఇస్తుంది గవర్నమెంట్ .
ఇది టెర్రరిస్ట్ లని పెంచి పోషించడమంటే ..
No comments:
Post a Comment