కొంతమంది కుహానా లౌకిక వాదులు రాతలు చూస్తుంటే , ఒళ్ళంతా రోత పుడుతుంది .
కాశ్మీర్ లో జరిగేది ఉగ్రవాదం అని ప్రపంచం అంతా చెప్తుంటే , ఇండియా మీద ద్వేషం తో , అది ఉగ్రవాదం కాదని చెప్తూ , ఉగ్రవాది అయిన Burhan wani ని దేశభక్తుడు అంటూ కీర్తించడం వాళ్ళకే చెల్లింది .
చదువరులు బాగా గమనిస్తే , ఒకప్పుడు హిందీ , మరియు ఇతర ప్రాంతీయ చిత్రాలలో ఎక్కువగా కాశ్మీర్ అందాలు ( నాకు బాగా గుర్తుంది దాల్ సరస్సు ) కనిపించేవి . ఎంతో అందంగా , ఎటువంటి గొడవలు లేకుండా హిందూ ముస్లిం లు కలసి మెలసి జీవించేవారు ,
మరి ఈ గొడవ ఎప్పుడు మొదలయ్యింది , ఆఫ్గనిస్తాన్ లో రష్యా ని బయటకి పంపేసిన తరువాత అక్కడ ఉగ్రవాదులు ని పాకిస్తాన్ కాశ్మీర్ కి పంపించింది . అసలు ఆఫ్గనిస్తాన్ లో ఆ ఉగ్రవాదులు చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు . పూర్తి వివరాలు అన్ని ఇంటర్నెట్ లో ఉన్నాయి , జస్ట్ ఒక సెర్చ్ చేస్తే చిటికె లో మీ ముందు ఉంటాయి . అటువంటి ఉగ్రవాదులు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో వఛ్చి అక్కడ హిందువు లని హింసించి హింసించి , అత్యాచారాలు చేసి , అమ్మాయిలని అపహరించి , భయపెట్టి తరిమేస్తే ఎన్నో వేలమంది ఢిల్లీ వఛ్చి తల దాచుకున్నారు. ఇప్పుడు కాశ్మీరీ లు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు అంటూ మనకి సుద్దులు చెప్తున్నారు ఈ రచయత .
కాకపోతే ఈ విషయాన్ని అక్కడ పత్రిక లో ఒక ఒక పాకిస్తానీ రచయత రాసి తూర్పారబెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులని ఏరేస్తామని చెప్తూ చేసే దాడులు నిజంగా జరగడం లేదు . తనకి అనుకూలమైన ఉగ్రవాదులని చంపకుండా , వ్యతరేఖత వ్యక్తం చేసేవాళ్ళని ఈ దాడులు పేరుతో చంపేస్తున్నారు . అఫ్గనిస్టాన్ తాలిబాన్ మరియు హుక్కాని ఉగ్రవాదులు మీద ఈగ కూడా వాలకుండా పాకిస్తాన్ జాగ్రత్త్త పడుతుంది .
ఆ విషయంమీద ఆ రచయత ఆర్మీ ని తీవ్రంగా విమర్శించాడు .
పూర్తి వ్యాసాన్ని ఇక్కడ పెడుతున్నాను , దయచేసి చదవండి . పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోంచి వెళ్లే CPEC గురించి కానీ , కాశ్మీర్ లో హిందువులు మీద జరిగినా అత్యాచారాల మీద కానీ , టిబెట్ మీద , అరుణాచల ప్రదేశ్ మీద కానీ ఒక్క ముక్క రాయని ఈ రచయత ఒకప్పుడు పేపర్ లో అంతర్జాతీయ వార్తలు ఎలా analyse చెయ్యాలో చెప్తూ పెద్ద వ్యాసాలూ కూడా రాసేశారు . Its completely selective and biased criticism. People should welcome criticism but not this selective one.