Tuesday, March 7, 2017

నక్క జిత్తుల చైనా , ఈనాడు వ్యాసం, ఆసియా లో సగం అస్థిరత కి కారణం చైనా


ఆసియా లో సగం అస్థిరత కి కారణం చైనా నే.  అంతర్జాతీయ న్యాయస్థానాన్ని థీక్కరించి మరీ దక్షిణ చైనా సముద్రం లో పాగా వేయడానికి ప్రయత్నించడం .

 ఉత్తరకొరియా ని అడ్డం పెట్టుకుని దక్షిణకొరియా ని బెదిరించడం. 
ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు  కి దక్షిణకొరియా తన భూభాగం లో అమెరికా సహాయం తో anti-missile defence system ని మోహారిస్తుంటే దానికి కూడా అడ్డు చెప్పడం. 
ఉత్తర కొరియా కి అతి పెద్ద సపోర్ట్ చైనా నే. ఉత్తర కొరియా ని అదుపులో పెట్టమని పశ్చిమ దేశాలు ఎన్ని సార్లు చెప్పడం ఏ మాత్త్రం ఖాతరు చేయడం లేదు . 

మన దేశ అభ్యంతారాలని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వివాదాస్పద కాశ్మీర్ భూభాగం నుండి cpec ని నిర్మించడం, ఇప్పుడేమో దలైలామా సందర్శన ని వివాదాస్పదం చేయడం.   ఇలా ప్రతీ విషయాన్ని నానా యాగీ చేయడం  దానికే చెల్లుతుంది . 






         ఈ వ్యాసానికి పోటీగా మన బ్లాగుల్లో చైనా ని పొగుడుతూ మరొక వ్యాసం రావడం  ఆశ్చర్యం కాదు ( ఏది ముందో తెలియదు ) . అయితే చైనా చేసే సహాయం గురించి కూడా పొగడటం వింతే . చైనా చేసేది సహాయం కాదు , ఆ వంక తో ఆయా దేశాల్లో పాగా వేస్తుంది . శ్రీలంక కి ఇలానే సహాయం చేసింది , ఆ వడ్డీలు కట్టలేక ఆ దేశం కొంత భూభాగాన్ని ధారాదత్తం చేసేసింది .  అంటే తన దేశం లో కంపెనీ ల ద్వారా ఆయా దేశాల్లో ప్రాజెక్ట్ లని కొనిపించి , ఆ డబ్బులు శ్రీలంక కి ఇప్పించి , మరలా ఆ డబ్బులు ని  తన అప్పు గా జమ చేసుకుంటుంది . 

ఈ క్రింద లింక్ చదవండి. 



ఇప్పుడు పాకిస్తాన్ లో జరిగేది అదే ,  cpec పేరుతో డబ్బులు అప్పు ఇచ్చింది , ఆ రోడ్ లు , రైల్ ట్రాక్ లు వేసేది చైనా నే ,  అందులో పని చేసేది కూడా చైనా కార్మికులే ( ఆ కాంట్రాక్టు లు చైనా వాళ్ళే  తీసుకున్నారు ), కంపెనీ లు పెట్టేది చైనా పెట్టుబడి దారులే , మరి ఇందులో పాకిస్తాన్ కి లాభం ఏముంది , ఏమి లేదు toll  collect చేసుకోవడం , రోడ్ ఇరువైపులా టీ దుకాణాలు పెట్టుకోవడం, అంతే . కానీ అప్పు మరియు దానికి వడ్డీ మాత్రం పాకిస్తాన్ చెల్లించాలి . 

ఇలా ఉంటాయి చైనా చేసే సహాయాలు . 



1 comment:

  1. చైనా సాయం చేస్తానంటే వద్దనడమెందుకు? (:- 1960 లలో చేసింది చాలు మనకి.

    ReplyDelete