Sunday, December 13, 2015

కాల్ మనీ ముఠా అక్రమాలలో 'ఈనాడు' కక్కలేక మింగలేక

కాల్ మనీ  ముఠా అక్రమాలలో ఈనాడు కక్కలేక మింగలేక , వాళ్ళ పేర్లు బయట పెట్టలేక, దాయలేక కింద మీద పడుతుంది .
చూస్తుంటే ఈ ముఠా లో తెలుగు దేశం నాయకులూ భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టుంది .
ఎమ్మెల్సి , ఎమెల్యే ఉన్నట్టున్నారు . దాంతో వాళ్ళంతా "ప్రజా ప్రతినిధి" లు అయిపోయారు .
సాక్షి లో డైరెక్ట్ గా పేర్లు వస్తున్నాయి , ఫేస్బుక్ లో ఫోటోలు షేర్ అవుతున్నాయి .. ఈనాడు కి మాత్రం " ప్రజా ప్రతినిధి ",  పాపం ఈనాడు , సాక్షి వచ్చిన తరువాత కొన్ని విషయాలు కవర్ చేయలేక బాగా ఇబ్బంది పడుతుంది .

ఇంతకు ముందు సాక్షి కి ఈ ఇబ్బంది బాగా ఉండేది .
ఈ విషయం ఆంధ్రజ్యోతి ని మెచ్చుకోవాలి , ఆ పేపర్ కి ఇలాంటి ముసుగులో గుద్దులాట లేదు , తెలుగు దేశం పార్టి నేతలు ఉన్నచోట , డైరెక్ట్ గా వైఎస్ఆర్ పార్టి నేతలు అని రాసెస్తుంది , లేకపోతె ఆ వార్తే కనిపించదు ఆ పేపర్ లో . 

No comments:

Post a Comment