Monday, January 5, 2015

అమెరికా పాకిస్తాన్ కి చేసే సహాయం లో

అమెరికా  పాకిస్తాన్ కి చేసే సహాయం లో ఏముంది ??
ఏమి లేదు . అందరికి తెలిసిన విషయమే  అమెరికా  తన ప్రాభవాన్ని కోల్పోవడానికి ఇష్టపడదు .
మోడీ వచ్చిన తరువాత , అమెరికా ని కాదని రష్యా తో చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇలా అమెరికా ని కాదని ఒప్పందాలు కుదుర్చుకోవడం లో కాంగ్రెస్ కన్నా కొంచెం ఎక్కువ ధైర్యాన్ని ప్రదర్శించాం .
అప్పుడే అమెరికా  తన అసంతృప్తి ని ప్రకటించింది . ఇప్పుడు దానికి ప్రతిస్పందన ఇలా ఉంది . ఇదొక హెచ్చరిక లా . అంతకి మించి ఇందులో మోడీ ఓటమి ఏముందో , కాంగ్రెస్ విజయం ఏముందో అర్ధం కావడం లేదు . కాంగ్రెస్ ఐతే చప్పట్లు కొట్టేదేమో !!

నిజం చెప్పాలంటే మోడీ గద్దేనేక్కినప్పటి నుండి అమెరికా  చాలా అసహనంగా ఉంది ,
దక్షిణాసియా లో తన ఉనికి చాటుకోవాడానికి , చైనా , ఇండియా మరియు పాకిస్తాన్ ఈ మూడు దేశాలలో ఎవరో ఒకరు అవసరం . చైనా కూడా పెట్టుబడి దారి వ్యవస్థ తో , అతి తక్కువ ధరకే  దొరకే మానవ వనరులు తో అభివృద్ధి లోనే ఉంది . ఇండియా , పాకిస్తాన్ లో ఒకరిని దరి జేర్చుకోవాలంటే ఇలాంటి రాజకీయాలు చేస్తుంది . ఇది ఎలాగు తాలిబాన్ కి కాని లేక చైనా కి కాని వెళుతుంది ( చైనా లో వాడేసిన రైల్ ఇంజిన్ లు చైనా పాకిస్తాన్ కి అమ్ముతుంది అది కూడా ఎక్కువ రేట్ కి, అవి పాకిస్తానీ లకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు, అది వేరే విషయం ) . తాలిబాన్ కి వెళితే అమెరికా లో మళ్ళి ఇంకో టవర్ కూలుతుంది .

 ప్రభుత్వం అన్నట్టు ఇది అమెరికా ఇష్టం , మన అభివృద్ధి వైపు మనం దృష్టి పెట్టడం ముఖ్యం .ప్రతీ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముందుకి దూసుకోపోతుంటే , మనం మాత్రం మత , కుల రాజకీయాల తో సతమతమవుతున్నాం.
 కింద లింక్ లో చదవండి . అమెరికా పాకిస్తాన్ కి వివిధ రూపాలలో సహయం చేస్తుంది , అందులో ఇది ఒక్కటి. ఉగ్రవాదం విషయం లో మేము ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు పాకిస్తాన్ కి అని చెప్తుంది .

http://economictimes.indiatimes.com/news/politics-and-nation/india-reacts-sharply-to-us-certification-to-pakistans-terror-fight/articleshow/45762938.cms


ఈ సహాయం చేసింది కెర్రి లుగర్ బిల్ ప్రకారం, అది 2009 లో ఏర్పడింది.
http://en.wikipedia.org/wiki/Enhanced_Partnership_with_Pakistan_Act_of_2009.




No comments:

Post a Comment