Saturday, January 10, 2015

జర్మనీ లో ఊపందుకుంటున్న ఇస్లాం మరియు వలస వ్యతిరేఖ ర్యాలి లు

గత కొంతకాలంగా జర్మనీ లో ఇస్లాం మరియు వలస వ్యతిరేఖ నినాదాలు ఊపందుకుంటున్నాయి .
యూరోపియన్జ యూనియన్ లో అత్యంత అభివ్రిద్ది చెందిన దేశం జర్మనీ. అంతే కాదు ఈ దేశానికి వలసలు కుడా ఎక్కువే . టర్కీ ముస్లిం లు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు . రెండవ ప్రపంచం యుద్ధం తరువాత జరిగిన అభివ్రిద్ది లో టర్కీ నుండి అత్యధిక ముస్లిం లు వచ్చి స్థిరపడ్డారు .
PEGIDA ( Patriotic Europeans against the Islamization of the West ) అనే సంస్థ కొన్ని నెలలు గా ఈ ర్యాలి లని organize చేస్తుంది . ప్రతీ వారం Dresden లో జరిగే ఈ ర్యాలి లో గత వారం సుమారు 18,000 మంది హాజరవడం విచిత్రం . మన దేశాల్లో తరలించినట్టు జనాలని తరలించడం జర్మనీ లో జరగదు, అందరు స్వచ్చందంగా నే వస్తారు, అందుకే ఈ న్యూస్ వార్తల్లో ప్రముఖంగా వచ్చింది, కొన్ని నెలలు గా ఈ సంస్థ పని చేస్తున్నా , గత మూడు నెలలు గా ఇది వార్తల్లో నిలుస్తుంది . ఇస్లాం కి వ్యతిరేఖం అని చెప్పకుండా, వలసలకి వ్యతిరేఖం అని ప్రచారం చేస్తుంది . 

లింక్ ఇక్కడా .. 

http://www.dailymail.co.uk/news/article-2884224/Record-number-Germanys-anti-immigrant-rally.html


http://www.dailymail.co.uk/wires/ap/article-2904616/Thousands-protest-anti-Islamic-rallies-German-city.html

దేశం లో ప్రముఖ పట్టణాలలో ఈ ర్యాలి లు జరిగేలా ఈ సంస్థ ప్రణాలికలు రూపొందించుకుంటుంది . 
ఈ ర్యాలి లలో పోల్గోనవద్దని జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ విజ్ఞప్తి చేసినా , జనం ఆ విజ్ఞప్తి ని తోసి పాల్గొనడం ఆశ్చర్యం గా ఉంది . 

http://www.thelocal.de/20150110/germanys-pegida-expects-record-rally

http://www.thelocal.de/20141206/germany-expects-230000-asylum-seekers-in-2015

http://www.thelocal.de/20141216/top-cop-fears-far-right-islamist-confrontations-pegida-dresden-salafists-foreign-fighters-returning-syria-iraq-isis

జర్మన్ జనాభా 80 మిలియన్ లో , ముస్లిం లు 4 మిలియన్ లు ఉన్నారు . 

వాళ్ళ ఫేస్బుక్ పేజి కి లక్ష ముప్పై వేల లైకులు ఉన్నాయి . 
https://www.facebook.com/pages/PEGIDA/790669100971515

http://www.bbc.com/news/world-europe-30765674


కాని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే , ఈ సంస్థ కి వ్యతిరేఖంగా జరిగిన ర్యాలి లో ముప్పై వేలమంది పోల్గనడం , జర్మనీ లో ద్వేషానికి చోటులేదు అని నినదించడం సంతోషకరమైన విషయం . 


జర్మనీ లో కొన్ని నెలలు ఉన్నాను ( వెస్ట్ జర్మనీ లో)  , అభివ్రిద్ది చెందిన దేశం ఎలా అయిందో నాకు అర్ధం అయింది. 
నేను ఎటువంటి వివక్ష ఎదుర్కోలేదు , రూల్స్ కి చాలా ఫేమస్ , సామాజిక విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు . 
భాష ప్రాబ్లం అవుతుంది , జర్మన్ వస్తే లైఫ్ చాలా బాగుంటుంది . కొత్త తరం లో అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు . సహాయం చేయడం లో కూడా ముందుంటారు, వ్యక్తిగత స్వేచ్చ చాలా ఎక్కువ . 

ఈస్ట్ జర్మనీ కన్నా వెస్ట్ జర్మనీ బాగా అభివ్రిద్ది చెంది ఉంటుంది , వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఇరవై అయిదు సంవత్సరాల వెనక్కి ఉంది . ఈస్ట్ జర్మనీ లో రష్యా / కమ్యునిస్ట్ ల పరిపాలన లో ( ? ) ఉండటం వల్ల అంత అభివ్రిద్ది చెందలేదు . 1990 లో బెర్లిన్ గోడ  కూలడం జర్మనీ ఏకీకరణ అవ్వడం మీకు తెలిసిన విషయాలే . 

http://qz.com/60481/why-the-former-east-germany-is-lagging-24-years-after-the-berlin-wall-came-down/

దీని మీద గుడ్ బాయ్ లెనిన్ ఒక సినిమా ఉంటుంది ( మన దూకుడు కి మాతృక ), బాగుంటుంది సినిమా నెట్ లో ఉంటె చూడండి . 





ఫోటో courtesy: డైలీ మెయిల్  

1 comment: