Saturday, January 17, 2015

పాకిస్తాన్ ,టర్కీ మరియు కువైట్ లో చార్లీ హేబ్దో కి వ్యతిరేఖంగా,ఉగ్రవాదులకి సంఘీభావంగా సాగుతున్న ర్యాలిలు

పాకిస్తాన్ ,టర్కీ , సోమాలియా  మరియు కువైట్  లో  చార్లీ హేబ్దో కి వ్యతిరేఖంగా,ఉగ్రవాదులకి సంఘీభావంగా సాగుతున్న ర్యాలిలు 

ఫ్రెంచ్ మేగజైన్ చార్లీ హేబ్దో కి వ్యతిరేఖంగా , దాడి చేసిన ఉగ్రవాదులని సమర్దిస్తూ పాకిస్తాన్ లో పలు చోట్ల ర్యాలి లు సాగుతున్నాయి. ఈ ర్యాలి లలో పాకిస్తాన్ మంత్రలు కూడా పోల్గనడం విశేషం .

http://www.dawn.com/news/1157549/mamnoon-wants-charlie-hebdo-to-apologise-for-hurting-muslims

ప్రవక్త చిత్రాన్ని ముఖ చిత్రంగా వేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు జరుగుతున్నాయి .

http://www.pakistantoday.com.pk/?p=385982

నిరసనలు హింసాత్మకంగా కూడా మారుతున్నాయని తెలుస్తుంది .

http://www.nydailynews.com/news/world/pakistan-protests-charlie-hebdo-cover-turn-violent-article-1.2081039

మత సంస్థ ల జోక్యం తో  స్వేచ్చ వాదానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి , తమిళ్నాడు లో కూడా ఈ మధ్యన ఒక రచన ని నిరసిస్తూ కొన్ని హిందూ మత సంస్థలు చేసిన ఒత్తిడి కి ఆ రచయత  రచనని వదిలిపెడుతున్నట్టు ప్రకటించారు . కాకపోతే అది హింసాత్మకం కాకపోవడం సంతోషం .




కాని , ఈ నిరసన తెలిపే జనం 

- నైజేరియా లో బోకో హారం అత్యంత క్రూరంగా మనుషులని చంపేస్తుంటే ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం ఆశ్చర్యం . ఈ మధ్యన ఆ ఉగ్రవాద సంస్థ సుమారు మూడు వేల మందిని అత్యంత క్రూరంగా చంపేసింది . ఒక గ్రామం మొత్తం ఖాళి చేసిన జనం ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని పారిపోయారు . 


ఇప్పటి వరకు జరిగిన అత్యంత క్రూరమైన ఎటాక్ . ఆమ్నెస్టీ ప్రకారం ఒక గ్రామం మొత్తంని చంపేశారు . 

స్కూల్ కి వెళ్ళే అమ్మాయిలని కిడ్నాప్ చేసి హత్యాచారం చేసినప్పుడు ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం దారుణం . 

- ఇరాక్, సిరియా లలో  ఇసిస్ అత్యంత క్రూరంగా ప్రవర్స్తిస్తున్నా , ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం విచిత్రం . 



--పాకిస్తాన్ లో కొన్ని వందల మంది ని 'దేవుడిని అవమానించారు ' అనే నెపం తో చంపేస్తుంటే ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం దారుణం కదా, ఈ మధ్యన పేద క్రిస్టియన్ దంపతులని క్రూరంగా ఇటుకల బట్టి లో వేసి బ్రతికుండగానే దహనం చేసేసారు .  ఈ చట్టాన్ని వ్యతిరేఖించిన పాపానికి కొంతమంది జడ్జి లు కూడా పాకిస్తాన్ వదిలి పారిపోయారు . 


మానవత్వానికి మచ్చ తెచ్చే ఏ పని అయినా ఖచ్చితంగా ఖండించాలి , అది ఎవరు చేసినా (హిందూ , క్రిస్టియన్ , ముస్లిం ) , వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి . కాని ఇలా ద్వంద్వ విధానాలతో , పరస్పర విరుద్దంగా ప్రవర్తిస్తుంటే మిగతా వాళ్లకి అది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది . 
 

No comments:

Post a Comment