Saturday, January 17, 2015

పాకిస్తాన్ ,టర్కీ మరియు కువైట్ లో చార్లీ హేబ్దో కి వ్యతిరేఖంగా,ఉగ్రవాదులకి సంఘీభావంగా సాగుతున్న ర్యాలిలు

పాకిస్తాన్ ,టర్కీ , సోమాలియా  మరియు కువైట్  లో  చార్లీ హేబ్దో కి వ్యతిరేఖంగా,ఉగ్రవాదులకి సంఘీభావంగా సాగుతున్న ర్యాలిలు 

ఫ్రెంచ్ మేగజైన్ చార్లీ హేబ్దో కి వ్యతిరేఖంగా , దాడి చేసిన ఉగ్రవాదులని సమర్దిస్తూ పాకిస్తాన్ లో పలు చోట్ల ర్యాలి లు సాగుతున్నాయి. ఈ ర్యాలి లలో పాకిస్తాన్ మంత్రలు కూడా పోల్గనడం విశేషం .

http://www.dawn.com/news/1157549/mamnoon-wants-charlie-hebdo-to-apologise-for-hurting-muslims

ప్రవక్త చిత్రాన్ని ముఖ చిత్రంగా వేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు జరుగుతున్నాయి .

http://www.pakistantoday.com.pk/?p=385982

నిరసనలు హింసాత్మకంగా కూడా మారుతున్నాయని తెలుస్తుంది .

http://www.nydailynews.com/news/world/pakistan-protests-charlie-hebdo-cover-turn-violent-article-1.2081039

మత సంస్థ ల జోక్యం తో  స్వేచ్చ వాదానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి , తమిళ్నాడు లో కూడా ఈ మధ్యన ఒక రచన ని నిరసిస్తూ కొన్ని హిందూ మత సంస్థలు చేసిన ఒత్తిడి కి ఆ రచయత  రచనని వదిలిపెడుతున్నట్టు ప్రకటించారు . కాకపోతే అది హింసాత్మకం కాకపోవడం సంతోషం .




కాని , ఈ నిరసన తెలిపే జనం 

- నైజేరియా లో బోకో హారం అత్యంత క్రూరంగా మనుషులని చంపేస్తుంటే ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం ఆశ్చర్యం . ఈ మధ్యన ఆ ఉగ్రవాద సంస్థ సుమారు మూడు వేల మందిని అత్యంత క్రూరంగా చంపేసింది . ఒక గ్రామం మొత్తం ఖాళి చేసిన జనం ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని పారిపోయారు . 


ఇప్పటి వరకు జరిగిన అత్యంత క్రూరమైన ఎటాక్ . ఆమ్నెస్టీ ప్రకారం ఒక గ్రామం మొత్తంని చంపేశారు . 

స్కూల్ కి వెళ్ళే అమ్మాయిలని కిడ్నాప్ చేసి హత్యాచారం చేసినప్పుడు ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం దారుణం . 

- ఇరాక్, సిరియా లలో  ఇసిస్ అత్యంత క్రూరంగా ప్రవర్స్తిస్తున్నా , ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం విచిత్రం . 



--పాకిస్తాన్ లో కొన్ని వందల మంది ని 'దేవుడిని అవమానించారు ' అనే నెపం తో చంపేస్తుంటే ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం దారుణం కదా, ఈ మధ్యన పేద క్రిస్టియన్ దంపతులని క్రూరంగా ఇటుకల బట్టి లో వేసి బ్రతికుండగానే దహనం చేసేసారు .  ఈ చట్టాన్ని వ్యతిరేఖించిన పాపానికి కొంతమంది జడ్జి లు కూడా పాకిస్తాన్ వదిలి పారిపోయారు . 


మానవత్వానికి మచ్చ తెచ్చే ఏ పని అయినా ఖచ్చితంగా ఖండించాలి , అది ఎవరు చేసినా (హిందూ , క్రిస్టియన్ , ముస్లిం ) , వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి . కాని ఇలా ద్వంద్వ విధానాలతో , పరస్పర విరుద్దంగా ప్రవర్తిస్తుంటే మిగతా వాళ్లకి అది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది . 
 

Tuesday, January 13, 2015

ఇలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా అభినందించాల్సిందే

బిజెపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలని ఖచ్చితంగా అభినందించాల్సిందే ..

 ఒకటి :
సిగరెట్లు మీద నిషేధం , ఇంతకు  ముందున్న ప్రభుత్వం , సిగరెట్ల కంపెనీల  లాబీ కి తలొగ్గి వదిలేసినా ఈ ప్రభుత్వం ఆ ఒత్తిడి లని అధిగమించి ముందు కి వెళ్ళడం నిజంగా అభినందనీయం .



రెండు : 
హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సామాజిక భాద్యత లేకపోతె మనిషి లెక్క లోకి రాడు . 
పర్యావరణాన్ని పాడు చేసే ఏ చర్య అయినా మతాలకి అతీతంగా వ్యతిరేఖించాలి . 

కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం గంగానది ప్రక్షాళన మొదలపెట్టి మధ్యలోనే వదిలేసింది .
కాకపోతే కాంట్రాక్టర్ల జేబులోకి వందల కోట్లు వెళ్ళాయి కాని ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు .
చూద్దాం ఇది ఎంత వరకు అమలు అవుతుందో ..

ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చడం కంటే , మంచో చెడో మొండి గా ముందుకి వెళ్ళడం మంచిదేమో ..

Monday, January 12, 2015

చైనా కన్నా భారతే మిన్న


చైనా లో వర్షం కురిస్తే ఇక్కడ కమ్యునిస్ట్ లు గొడుగు పడతారు అన్న అపనింద ఎప్పుడు తొలగించుకుంటారో

శ్రీలంక లో సిరిసేన విజయం పై  ఆంధ్రజ్యోతి లో ఒక విశ్లేషణ

http://www.andhrajyothy.com/Artical.aspx?SID=77210&SubID=13



ముస్లిం , కమ్యునిస్ట్ అలయన్స్  మీద ఒక వ్యాసం , నెట్ బ్రౌసె చేస్తుంటే కనబడింది  .. నేను ఇంకా చదవలేదు , పై పై నా చదివాను , మీరు చదవుతారని, .. కాకపోతే చాలా పాతది , కాని ఇప్పటకి అది మన రాజకేయాలలో కనిపిస్తుంది .

http://www.southasiaanalysis.org/paper1107


చార్లీ హేబ్దో పత్రిక మీద దాడి కి నిరసన తెలుపుతూ

సుమారు పది లక్షల మంది , టెర్రరిజం కి వ్యతిరేఖంగా , బాధితులకి సంఘీభావం తెలుపుతూ ..

హింస తోనే అన్నీ సాధించాలనుకునే జనాలకి ఇది కనువిప్పు కావాలి .
ఫోటో : డైలీ మెయిల్ 

Saturday, January 10, 2015

జర్మనీ లో ఊపందుకుంటున్న ఇస్లాం మరియు వలస వ్యతిరేఖ ర్యాలి లు

గత కొంతకాలంగా జర్మనీ లో ఇస్లాం మరియు వలస వ్యతిరేఖ నినాదాలు ఊపందుకుంటున్నాయి .
యూరోపియన్జ యూనియన్ లో అత్యంత అభివ్రిద్ది చెందిన దేశం జర్మనీ. అంతే కాదు ఈ దేశానికి వలసలు కుడా ఎక్కువే . టర్కీ ముస్లిం లు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు . రెండవ ప్రపంచం యుద్ధం తరువాత జరిగిన అభివ్రిద్ది లో టర్కీ నుండి అత్యధిక ముస్లిం లు వచ్చి స్థిరపడ్డారు .
PEGIDA ( Patriotic Europeans against the Islamization of the West ) అనే సంస్థ కొన్ని నెలలు గా ఈ ర్యాలి లని organize చేస్తుంది . ప్రతీ వారం Dresden లో జరిగే ఈ ర్యాలి లో గత వారం సుమారు 18,000 మంది హాజరవడం విచిత్రం . మన దేశాల్లో తరలించినట్టు జనాలని తరలించడం జర్మనీ లో జరగదు, అందరు స్వచ్చందంగా నే వస్తారు, అందుకే ఈ న్యూస్ వార్తల్లో ప్రముఖంగా వచ్చింది, కొన్ని నెలలు గా ఈ సంస్థ పని చేస్తున్నా , గత మూడు నెలలు గా ఇది వార్తల్లో నిలుస్తుంది . ఇస్లాం కి వ్యతిరేఖం అని చెప్పకుండా, వలసలకి వ్యతిరేఖం అని ప్రచారం చేస్తుంది . 

లింక్ ఇక్కడా .. 

http://www.dailymail.co.uk/news/article-2884224/Record-number-Germanys-anti-immigrant-rally.html


http://www.dailymail.co.uk/wires/ap/article-2904616/Thousands-protest-anti-Islamic-rallies-German-city.html

దేశం లో ప్రముఖ పట్టణాలలో ఈ ర్యాలి లు జరిగేలా ఈ సంస్థ ప్రణాలికలు రూపొందించుకుంటుంది . 
ఈ ర్యాలి లలో పోల్గోనవద్దని జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ విజ్ఞప్తి చేసినా , జనం ఆ విజ్ఞప్తి ని తోసి పాల్గొనడం ఆశ్చర్యం గా ఉంది . 

http://www.thelocal.de/20150110/germanys-pegida-expects-record-rally

http://www.thelocal.de/20141206/germany-expects-230000-asylum-seekers-in-2015

http://www.thelocal.de/20141216/top-cop-fears-far-right-islamist-confrontations-pegida-dresden-salafists-foreign-fighters-returning-syria-iraq-isis

జర్మన్ జనాభా 80 మిలియన్ లో , ముస్లిం లు 4 మిలియన్ లు ఉన్నారు . 

వాళ్ళ ఫేస్బుక్ పేజి కి లక్ష ముప్పై వేల లైకులు ఉన్నాయి . 
https://www.facebook.com/pages/PEGIDA/790669100971515

http://www.bbc.com/news/world-europe-30765674


కాని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే , ఈ సంస్థ కి వ్యతిరేఖంగా జరిగిన ర్యాలి లో ముప్పై వేలమంది పోల్గనడం , జర్మనీ లో ద్వేషానికి చోటులేదు అని నినదించడం సంతోషకరమైన విషయం . 


జర్మనీ లో కొన్ని నెలలు ఉన్నాను ( వెస్ట్ జర్మనీ లో)  , అభివ్రిద్ది చెందిన దేశం ఎలా అయిందో నాకు అర్ధం అయింది. 
నేను ఎటువంటి వివక్ష ఎదుర్కోలేదు , రూల్స్ కి చాలా ఫేమస్ , సామాజిక విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు . 
భాష ప్రాబ్లం అవుతుంది , జర్మన్ వస్తే లైఫ్ చాలా బాగుంటుంది . కొత్త తరం లో అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు . సహాయం చేయడం లో కూడా ముందుంటారు, వ్యక్తిగత స్వేచ్చ చాలా ఎక్కువ . 

ఈస్ట్ జర్మనీ కన్నా వెస్ట్ జర్మనీ బాగా అభివ్రిద్ది చెంది ఉంటుంది , వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఇరవై అయిదు సంవత్సరాల వెనక్కి ఉంది . ఈస్ట్ జర్మనీ లో రష్యా / కమ్యునిస్ట్ ల పరిపాలన లో ( ? ) ఉండటం వల్ల అంత అభివ్రిద్ది చెందలేదు . 1990 లో బెర్లిన్ గోడ  కూలడం జర్మనీ ఏకీకరణ అవ్వడం మీకు తెలిసిన విషయాలే . 

http://qz.com/60481/why-the-former-east-germany-is-lagging-24-years-after-the-berlin-wall-came-down/

దీని మీద గుడ్ బాయ్ లెనిన్ ఒక సినిమా ఉంటుంది ( మన దూకుడు కి మాతృక ), బాగుంటుంది సినిమా నెట్ లో ఉంటె చూడండి . 





ఫోటో courtesy: డైలీ మెయిల్  

Monday, January 5, 2015

కాంగ్రెస్ బుద్ది మారలేదు

కాంగ్రెస్ బుద్ది మారలేదు , అది కూడా అత్యంత ముఖ్యమైన దేశ రక్షణ విషయం లో .. 
ప్రభుత్వం మీద ఎంత ద్వేషం అయినా ఉండొచ్చు . కాని కొన్ని విషయాలలో ప్రతిపక్షం ప్రభుత్వానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి , ముఖ్యంగా దేశ రక్షణ విషయం లో .  ఇంతకూ ముందు బిజెపి , దేశ రక్షణ విషయం లో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైన మా మద్దతు ఉంటుంది అని చాలా సార్లు ప్రకటించింది .
గత వారం లో ఉగ్రవాదులు ఒక మత్స్యకారుల పదవ లో  ఇండియా లోకి జోరబడటానికి ప్రయత్నించి , మన దేశ అప్రమత్తతతో , 18 గంటలు ఆపరేషన్ తో , అది వికటించి దొరక్కుండా బోటు కి నిప్పు పెట్టుకుని చనిపోయి తప్పించుకున్నారు . కోస్ట్ గార్డ్స్ ఎంతో శ్రమించి ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు . లేకపోతె మరో మారణహోమం జరిగేది ముంబై లో జరిగినట్టు . 
ఇది అన్ని చానల్స్ లో వచ్చింది , లైవ్ visuals కుడా వచ్చినట్టున్నాయి . దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ రెండు ఇండియా బోట్ల ని కుడా స్వాదీనం చేసుకుని , మనుషులని అరెస్ట్ చేసింది , పాకిస్తాన్ జలాల్లో కి అక్రమంగా ప్రవేశిచారంటు . 

http://www.ndtv.com/article/india/pakistani-boat-was-in-touch-with-their-army-says-defence-minister-manohar-parrikar-644408?curl=1420500892

ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ ఏటంటే , ఇది నమ్మసఖ్యంగా లేదంటా ? రుజువులు కావాలంటు అడుగుతుంది . 
గుజరాత్ లో జరిగే vibrant గుజరాత్ కి ప్రచారం అని ఆరోపణ చేస్తుంది . ఒక్కొక్క రాష్ట్రం లో అధికారం కోల్పోతూ ఉండటం వల్ల కాంగ్రెస్ కి పూర్తిగా మతి భ్రమించింది .  . 
ఈ లింక్ పూర్తిగా చదవండి . 
http://www.ndtv.com/article/india/come-clean-on-pakistani-boat-issue-congress-tells-government-643722?ndtv_related

ఇలాంటి  సంఘటనలు ఏ ప్రభుత్వ హయాం లో జరిగిన దేశం మొత్తం ఒకే మాట మీద ఉండాలి . కాని అది కనుచూపు మేర కనిపించడం లేదు . 


అమెరికా పాకిస్తాన్ కి చేసే సహాయం లో

అమెరికా  పాకిస్తాన్ కి చేసే సహాయం లో ఏముంది ??
ఏమి లేదు . అందరికి తెలిసిన విషయమే  అమెరికా  తన ప్రాభవాన్ని కోల్పోవడానికి ఇష్టపడదు .
మోడీ వచ్చిన తరువాత , అమెరికా ని కాదని రష్యా తో చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇలా అమెరికా ని కాదని ఒప్పందాలు కుదుర్చుకోవడం లో కాంగ్రెస్ కన్నా కొంచెం ఎక్కువ ధైర్యాన్ని ప్రదర్శించాం .
అప్పుడే అమెరికా  తన అసంతృప్తి ని ప్రకటించింది . ఇప్పుడు దానికి ప్రతిస్పందన ఇలా ఉంది . ఇదొక హెచ్చరిక లా . అంతకి మించి ఇందులో మోడీ ఓటమి ఏముందో , కాంగ్రెస్ విజయం ఏముందో అర్ధం కావడం లేదు . కాంగ్రెస్ ఐతే చప్పట్లు కొట్టేదేమో !!

నిజం చెప్పాలంటే మోడీ గద్దేనేక్కినప్పటి నుండి అమెరికా  చాలా అసహనంగా ఉంది ,
దక్షిణాసియా లో తన ఉనికి చాటుకోవాడానికి , చైనా , ఇండియా మరియు పాకిస్తాన్ ఈ మూడు దేశాలలో ఎవరో ఒకరు అవసరం . చైనా కూడా పెట్టుబడి దారి వ్యవస్థ తో , అతి తక్కువ ధరకే  దొరకే మానవ వనరులు తో అభివృద్ధి లోనే ఉంది . ఇండియా , పాకిస్తాన్ లో ఒకరిని దరి జేర్చుకోవాలంటే ఇలాంటి రాజకీయాలు చేస్తుంది . ఇది ఎలాగు తాలిబాన్ కి కాని లేక చైనా కి కాని వెళుతుంది ( చైనా లో వాడేసిన రైల్ ఇంజిన్ లు చైనా పాకిస్తాన్ కి అమ్ముతుంది అది కూడా ఎక్కువ రేట్ కి, అవి పాకిస్తానీ లకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు, అది వేరే విషయం ) . తాలిబాన్ కి వెళితే అమెరికా లో మళ్ళి ఇంకో టవర్ కూలుతుంది .

 ప్రభుత్వం అన్నట్టు ఇది అమెరికా ఇష్టం , మన అభివృద్ధి వైపు మనం దృష్టి పెట్టడం ముఖ్యం .ప్రతీ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముందుకి దూసుకోపోతుంటే , మనం మాత్రం మత , కుల రాజకీయాల తో సతమతమవుతున్నాం.
 కింద లింక్ లో చదవండి . అమెరికా పాకిస్తాన్ కి వివిధ రూపాలలో సహయం చేస్తుంది , అందులో ఇది ఒక్కటి. ఉగ్రవాదం విషయం లో మేము ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు పాకిస్తాన్ కి అని చెప్తుంది .

http://economictimes.indiatimes.com/news/politics-and-nation/india-reacts-sharply-to-us-certification-to-pakistans-terror-fight/articleshow/45762938.cms


ఈ సహాయం చేసింది కెర్రి లుగర్ బిల్ ప్రకారం, అది 2009 లో ఏర్పడింది.
http://en.wikipedia.org/wiki/Enhanced_Partnership_with_Pakistan_Act_of_2009.




Saturday, January 3, 2015

pk సినిమా వెనక ఒక కుట్ర ఉన్నాదా ? పెద్ద జోక్

pk సినిమా వెనక ఒక కుట్ర ఉన్నాదా ?
ఇదో పెద్ద జోక్ అని  అనుకున్నాను , నేను సినిమా ఇంకా చూడలేదు కాబట్టి , దాని మీద ఏమి వ్యాఖ్యానించలేను .
మన అఖిలేష్ యాదవ్ లా డౌన్లోడ్ చేసి చూడటానికి మనసొప్పక చూడలేదు .

కాకపోతే సుబ్రమణ్య స్వామి tweet చేస్తే , ఏదో ఉంది అని అనిపిస్తుంది . అందుకే వెతికి కొంత సమాచారాన్ని ఇస్తున్నాను మీకు .

దీని కన్నా ముందు చిన్న స్టొరీ ,
పాకిస్తాన్ లో కొన్ని నెలల క్రితం , వార్ (waar ) అని ఒక సినిమా వచ్చింది .
మనం ఎలా అయితే పాకిస్తాన్ తీవ్రవాదులని విలన్ లా చూపించి సినిమాలు తీస్తామో , అలానే, పాకిస్తాన్ లో కూడా ఇండియాన్స్ ని విలన్ లా చూపించి ఈ సినిమా తీసారు . పాకిస్తాన్ లో ఇప్పటి వరకు అత్యంత ఎక్కువగా కలెక్ట్ చేసింది ఇదే .
http://www.hindustantimes.com/world-news/pak-film-waar-depicting-indian-terror-does-roaring-business/article1-1137776.aspx

పాకిస్తాన్ ఐ ఎస్ ఐ ఈ సినిమా కి ఫండ్ ఇచ్చిందని ఒక రూమర్ , ఆ సినిమా తీసిన డైరెక్టర్ తో ARY గ్రూప్ ఇంకో రెండు సినిమాలు తీయడానికి ఒప్పందం కూడా చేసుకుంది , అసలు మొదటి సినిమాకి కుడా ఈ గ్రూప్ ఫండ్ ఇచ్చిందని ఇంకో రూమర్ ఉంది .

ఇప్పుడు సుబ్రమణ్య స్వామీ చెప్పింది ఏంటంటే , ఈ సినిమా వెనక ARY గ్రూప్ ఉందని . ఈ ARY గ్రూప్ ఎవరంటే, పాకిస్తాన్ బేస్ చేసుకుని స్టార్ట్ చేసిన ఈ గ్రూప్ మీడియా లో అతి పెద్ద సంస్థ గా ఎదిగింది . దుబాయ్ లో , యూరోప్ లో , పాకిస్తాన్ లో చాలా కంపెనీ లు/ చానల్స్  ఉన్నాయి ఈ గ్రూప్ లో . అంతే కాదు బెనజీర్ భుట్టో భర్త కి ఈ గ్రూప్ చైర్మన్ కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి , ఆల్ ఖైదా కి ,ఉల్ఫా , ఇంకా ఇతర టెర్రరిస్ట్ గ్రూప్ లకి ఈ సంస్థ ఆర్ధిక సహాయం చేస్తుందని ఒక పెద్ద ఆరోపణ ఉంది , అంతే కాదు ఈ సంస్థ మీద  యూరోప్ లో , దుబాయ్ లో కోర్ట్ కేసు లు కుడా ఉన్నాయి .ఇప్పుడు దుబాయ్ హెడ్ ఆఫీసు గా ఉంది .

గల్ఫ్ దేశాలలో PK సినిమా ని విడుదల చేసింది ఈ గ్రూప్ .
http://www.huffingtonpost.in/2014/12/30/subramanian-swamy-pk_n_6394642.html

http://en.wikipedia.org/wiki/ARY_Group
http://en.wikipedia.org/wiki/ARY_Digital
http://en.wikipedia.org/wiki/ARY_News

పాకిస్తాన్ లో ARY న్యూస్ అని ఒక ఉర్దూ ఛానల్ ఉంది .

ఇంకో విషయం .. ఈ మధ్యన పెషావర్ స్కూల్ మీద తీవ్రవాదులు దాడి చేసి 140 చిన్న పిల్లలని కాల్చి చంపిన ఘటన లో ( అందులో ఆ రోజే స్కూల్ లో జాయిన్ అయిన ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ) ఆ ఎటాక్ చేయించింది ఇండియా నే అని ఆరోపణ చేసింది ఈ చానేలే .  అంతే కాదు ముషారఫ్ ని న్యూస్ స్టూడియో లో కూర్చోబెట్టి ఇండియా నీ ఈ ఎటాక్ చేయించింది ఒక చర్చా కార్యక్రమం కూడా ప్రచారం చేసింది .
  కొన్ని రోజుల తర్వాత మరలా 'కఠిన నిజం ' అంటూ , ఈ ఎటాక్ వెనక RAW , ఇండియన్ ఆర్మీ ఎలా కుట్రలు చేసారో ఒక కార్యక్రమం ప్రచారం చేసారు . చాలా సంవత్సరాలు గా ఈ చానెల్ హిందువులు మీద విషం కక్కుతూ కార్యక్రమాలు ప్రచారం చేస్తుంది .

 పాకిస్తాన్ లో ఈ సినిమాని విడుదల చేసింది సామా చానెల్ .  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే , కొన్ని రోజుల క్రితం ఈ చానెల్ ఒక ప్రకటన చేసింది , ఇకపై ఏ విధమైన ఇండియా కార్యక్రమాలు ప్రచారం చేయమని , ఇండియన్స్ తో కలిసి పని చేయమని చెప్పింది , అంతే కాదు ప్రజలందరినీ ఇండియా కార్యక్రమాలు బహిష్కరించమని అతి తీవ్రంగా ప్రచారం చేసింది .

కానీ ఈ చానెల్ ఆ  బహిష్కరణ లో  ఈ సినిమా కోసం మాత్రమే వెసులు బాటు కల్పించింది . 

అమీర్ ఖాన్ ఏ సినిమా చేసినా ఎంతో రీసెర్చ్ చేసి చేస్తాడు కదా  మరి ఈ సినిమా లో కేవలం హిందువ్లు ల మీద విమర్శలు ఉండటం అతని దృష్టి కి రాలేదా ? నా భార్యలు హిందువ్లు అయినా , నా పిల్లలు ముస్లిమ్స్ లానే పెరుగుతారు అని చెప్పిన అమీర్ ఖాన్ ఈ విమర్సని పట్టించుకోకపోవడం పెద్ద ఆశ్చర్యం లేదు . 

ప్రపంచం అంతా  ఇస్లామిక్ టెర్రర్ తో నాశనం అయిపోతుంటే , అమీర్ ఖాన్ మాత్రం హిందూ ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడు . 
ఈ క్రింద లింక్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి , చూడండి . 
http://agniveer.com/pk/

విమర్శ ఉండాలి, ఏ సంస్కృతి మీద అయినా విమర్శ సహజం , కాని కేవలం ఒక సంస్కృతి మీదే ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం ఖండించాలి .
ఈ మధ్య ఒక న్యూస్ చదివాను, ఒక హిందీ సినిమా లో ఒక క్యారెక్టర్ పేరు అబ్దుల్లా (?) ( సరిగ్గా గుర్తు లేదు ) ఉంటుంది , అది ఇస్లాం లో ఎంతో  పవిత్ర మైన పేరు కాబట్టి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది , పేరు మార్చమని అడిగింది , మరి హిందూ మతం మీద ఎందుకు ఈ సవతి ప్రేమ , ఈ ద్వంద్వ నీతి ని ఖండించాలి .



Thursday, January 1, 2015