Thursday, December 18, 2014

ముస్లిమేతర మహిళలు బానిసలే వారు సెక్స్‌ సాధనాలే.. ఉగ్రవాదులకు ఐఎస్‌ మార్గదర్శకాలు


లండన్‌, డిసెంబర్‌ 17: ‘‘మన మతం కాని మహిళలందరూ బానిసలే. వారిని కొనొచ్చు.. అమ్మొచ్చు.. కానుకగా ఇవ్వొచ్చు. శారీరక సంబంధాన్ని తట్టుకునే అమ్మాయి అయితే.. సెక్స్‌ జరపొచ్చు. అయితే.. ముస్లిం మహిళలను మాత్రం అలా చేయడానికి వీల్లేదు. వారు మన మతాన్ని నమ్మకున్నా.. అలా చేయడానికి వీల్లేదు’’.. ఇవీ తమ అనుయాయులకు, దళపతులకు, తమను నమ్మే ప్రజలకు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) జారీ చేసిన మార్గదర్శకాలు. కలీఫత్‌ను ఏర్పరచాలని, ప్రపంచంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఐసిస్‌గా ఏర్పడి ఐఎస్‌గా పేరు మార్చుకున్న సంస్థ ఇందుకు మన ఆర్‌ అండ్‌ డీ లాగా.. రిసెర్చ్‌ అండ్‌ ఫత్వా డిపార్ట్‌మెంట్‌ను ఏర్పరుచుకుందని.. బ్రిటన్‌కు చెందిన ఉగ్రవాద విశ్లేషకులు చెబుతున్నారు. వాషింగ్టన్‌కు చెందిన మధ్యప్రాచ్య పరిశోధక సంస్థకు కూడా ఐఎస్‌కు చెందిన సంబంధిత దాక్యుమెంట్లు లభించాయి. తమ అధీనంలో ఉన్న మోసుల్‌లోని ఒక మసీదు ముందు ఐఎస్‌ ఉగ్రవాది ఒకరు ఈ పత్రాలు పంచుతున్న దృశ్యాలు కొన్ని చానళ్లలో కనిపించాయి కూడా. ఐఎస్‌ ఆధిపత్యం ఉన్న ఇరాక్‌, సిరియా దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో.. ఈ అరాచక రాజ్యమే నడుస్తోందని బ్రిటన్‌, అమెరికాలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఐఎస్‌ విడుదల చేసిన మార్గదర్శకాల పుటలు కూడా వారి దగ్గర ఉన్నాయి. 

వాటిలో తమ తరపున యుద్ధం చేస్తున్న వారి దగ్గర నుంచి తరచు వచ్చిన సందేహాలకు, ఐఎస్‌కు చెందిన రిసెర్చ్‌ అండ్‌ ఫత్వా డిపార్ట్‌మెంట్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ఐఎస్‌ సైనికుల దాడిలో వారికి దొరికిన ముస్లిమేతర మహిళలను ఎలా వాడుకోవచ్చో.. అతి వికారంగా వివరించారు. ఈ వివరణలు మన సమాజాన్ని చీకటి యుగాలకు తీసుకువెళతాయని, విశ్లేషకులు చెబుతున్నారు. ఆ డాక్యుమెంట్లో ఒక ప్రశ్న.. ఆడ బానిసల్లో యవ్వనం రాకున్నా సెక్స్‌ చేయొచ్చా? అని ఉంది. అందుకు సమాధానంగా.. ఆ అమ్మాయి శరీరం అందుకు తట్టుకునేలా ఉంటే చేయొచ్చని సమాధానం ఇచ్చారు. అలాగే.. మహిళా బందీలు/బానిసలను అమ్మొచ్చా? అని మరో ప్రశ్నకు.. అమ్మొచ్చని సమాధానం ఇచ్చారు. మహిళా బానిసలు/బందీలను అమ్మొచ్చు, కొనొచ్చు.. కానుకలుగా ఇవ్వొచ్చని చెప్పారు. అయితే.. మహిళా బానిసను యజమాని కొట్టొచ్చని కూడా చెప్పారు. అయితే.. అది తప్పు చేస్తే శిక్ష కోసమే కొట్టాలని.. కోపాన్ని తీర్చుకోవడం కోసం కొట్టద్దని నియమం విధించారు. యూదులు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర మహిళలు ఎవరినైనా ఇలాగే చేయొచ్చని డాక్యుమెంట్లో స్పష్టం చేశారు.

Courtesy:  Andhrajyothy.

No comments:

Post a Comment