Sunday, December 21, 2014

హిందువు ల మత మార్పిడి

ఒక పదవి లేని నాయకుడు ఇక తనకి ఏ పదవి రాదు అని నిర్ణయించుకుని ఇంట్లో కూర్చున్న వ్యక్తీ ని  .. ఒకానొక రోజు ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్ అతన్ని చర్చ కి పిలిచింది. ఈ అవకాశాని ఆ నాయకుడు ఎలా సద్వినియోగం చేసుకున్నాడంటే ..
తన అభిమాన నాయకుడిని తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు , ఏడ్చాడు , ఇంకా బిగ్గరంగా ఏడ్చాడు ,
ఇంకా ఇంకా ఇంకా కా కా ఏడ్చాడు , స్టూడియో లో ఉన్న అందరి చెవుల్లో నుండి రక్తం కారడం మొదలైంది .
కట్ చేస్తే ..
రాజ్యసభ ఎమ్. పి గా ప్రమాణ స్వీకారం చేసాడు . సదరు ఆ నాయకుడు తన అధినేత్రి మెప్పు కోసం పార్లమెంట్ లో చేసే రభస అంతా ఇంతా కాదు . హిందువు నని చెప్పుకుంటాడు కాని ఎందుకో  సందేహంగా ఉంది .
ఇతర మతాల నుండి హిందూ మతాలలోకి రావడాన్ని ఆ పార్టీ అత్యంత తీవ్రంగా వ్యతిరేఖిస్తుంది కాని హిందూ మతం నుండి ప్రలోభాలతో ఇన్నాళ్ళు ఇతర మతాలకు జరిగిన మతమార్పిడులు ని మాట మాత్రానికి కూడా మాట్లాడటం లేదు .

మత మార్పిడి నిరోధ బిల్లు ని కూడా వ్యతిరేఖిస్తుంది . ఆ పార్టీ ఏంటో నేను చెప్పవలసిన అవసరం లేదు , గాంధీ అనే ఫేక్ నేమ్ పెట్టుకున్న వారసులు. 

సహజంగా హిందువులు మత మౌడ్యులు కాదు . కాని ఇదే అలుసు గా తీసుకుని కాంగ్రెస్ మిగతా మతస్తులతో కలిసి చేసిన దారుణాలు అందరికి తెలిసిందే ..
మత మార్పిడి అనేది వ్యక్తిగత అంశం , కాని ప్రలోభాలతో చేయించడం , దానికి నాయకులూ వంత  పాడటం , ఇతర మతాలని ఎక్కువ చేసి చూపించడం , ఇలా రెండు నాలికలతో తో మాట్లాడటం వల్ల , మధ్యస్తంగా ఉంటూ ఏ మాత్రం చాంధస భావాలు లేని హిందువులు కుడా మత మౌడ్యులు గా మారాల్సి వస్తుంది .

కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా హిందువు లని మోసం చేసిందంటే .. అన్ని మతాలని సమానంగా చూడాల్సిన ఒక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒకప్పుడు ఏమన్నారు అంటే .. "ఈ దేశం లో ఉండే అన్ని రిసోర్సెస్ మీద హక్కు కేవలం మొట్ట మొదట కేవలం మైనారిటీస్ కి మాత్రమే ఉందని " అంటే ఈ దేశం లో ఉన్న అన్ని సౌకర్యాలు మొట్ట మొదట మైనారిటి లకి ఇవ్వాలి , ఎమన్నా మిగిలితే హిందువ్లులు వాడుకోవచ్చు అని "


http://www.quora.com/Manmohan-Singh-says-Minorities-have-first-right-to-resources-Is-this-a-justified-statement-or-no-Why

ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ..
హిందువులను ఇతర మతాలలోకి మార్చడాన్ని తప్పుబట్టని కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు మత మార్పిడి చేసుకున్నవారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాయి. ఈ ద్వంద్వ విధానం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది. లౌకిక వ్యవస్థ అంటే మైనారిటీ వర్గాలను లాలించడం మాత్రమే కాదు. అన్ని వర్గాలనూ సమానంగా ఆదరించాలి. బీజేపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసే పార్టీలు, మజ్లిస్‌ పార్టీ వంటి మత ప్రాతిపదికగా పనిచేస్తున్న పార్టీల నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం పట్టించుకోవు. దీంతో మతపరంగా ఆలోచించని వారిని కూడా ఆ రొంపిలోకి దించే పరిస్థితిని సదరు పార్టీలు కల్పిస్తున్నాయి.


మతం మార్చుకున్న వాళ్లకి కూడా s.c , s.t రిజర్వేషన్స ఇస్తామని కె సి అర్  గారు అంత ధైర్యంగా బహిరంగ సభలో చెప్పారంటే , హిందువ్లు ఎంత చవట ల్లా , చేతకాని వాళ్ళ లా కనిపిస్తున్నారో కదా అతనికి .. 

అసలు మతం మార్చుకున్న వాళ్లకి రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తాయో అర్ధం కావడం లేదు . 

ఉదాహరణకి , ఒక మహిళ  ఆపరేషన్ ద్వారా పురుషుడు లా మారి , తిరిగి మహిళా రిజర్వేషన్స్ కోసం పట్టు  బడితే ఎలా ఉంటుంది .. ఇది అలానే ఉంది . 

4 comments:

  1. పరిస్థితులు మారిపోయాయి. పాకిస్థాన్ లో పరిస్థితి దిగజారే కొద్ది, వాళ్ళు దాడులు ఎక్కువ చేస్తారు. అక్కడ ప్రభుత్వం అచేతనంగా మారుతుంది. వాటిని చూసి భీతావహులైన ప్రజలు, హిందువులు భారత దేశంలో ఏకమౌతారు. మునుపటి వలే సుగర్ కోటేడ్ సెక్యులరిజం మాటలను మాట్లాడితే ప్రజలు వినరు. ఇది గమనించకుండా, అందరికి తెలిసిన వాస్తవాలను సైతం వక్రీకరిస్తూ, అమెరికా వలన పాకిస్తాన్ లో ఘొరాలు జరుగుతున్నాయని, జాతీయ,అంతర్జాతీయ బ్లాగులో తిక్క విశ్లేషణలు రాస్తు, ప్రజలను పక్క దోవ పట్టిస్తున్నాడు.

    ReplyDelete
  2. అయిన మన దేశంలో మతం మార్చటానికి పేటెంట్ హక్కు పాశ్చత్య మతాలకి మాత్రమే ఇవ్వబడింది.... ఆ హక్కు కు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కాపాడడానికి మన దేశంలో కుహాన మేతావులు, గొప్ప పేరు వున్న హిందూవులైనటువంటి రాజకీయ నాయకులు, ఆర్ధికంగా సహాయం చేయటానికి విదేశి సహాయసంస్థలు, ముఖ్యంగా ధర్మం క్షీణదశకు చేరువులోకి పోతున్న పట్టించుకోని హిందువులు ఉన్నారు...... డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఈ భూమండలం పై మనుగడకు పోరాటం చేయకల్గిందే బ్రతకగలదు... లేక పోతే క్షీణించి పోవల్సిందే......

    ReplyDelete
  3. ఒక పోప్‍గారు మనదేశం వచ్చి ఇక్కడి ప్రభుత్వంయొక్క రాచమర్యాదల మధ్య విహరించిపోతూ ఈ దేశం జనాభా అందరినీ క్రైస్తవులను చేయాలీ 2000 సంవత్సరానికల్లా అని పిలుపు నిచ్చినప్పుడు ఈ రోజు సెక్యులరింజం అంటూ గొంతుచించుకుంటున్నఎవరూ ఆయన మాటలను అక్షేపించలేదు. పొరుగుదేశంలో హిందువులు 26 శాతం నుండి ఈ రోజుకు ఒకశాతానికి పడిపోవటం దారుణమనీ ఎవరూ అక్షేపించరు వీరిలో. హిందువులు సంఘటితం కావటం అనే పెనుప్రమాదం గురించే వీరి ఆందోళన అంతా.

    ReplyDelete
  4. అవును .
    గత అరవై సంవత్సరాలలో కొన్ని కోట్ల మంది ని ప్రలోభం తో మతం మార్పించారు .
    మతం మార్పించి రిజర్వేషన్స ఇప్పించి , ఒక పధకం ప్రకారం హిందూ మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు .
    పార్లమంట్ లో , మత మార్పిడి కి వ్యతిరేఖంగా చట్టం తీసుకుని వద్దామని అంటే ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా నోరెత్తలేదు . అంటే చూడండి . ఎంత దారుణమైన స్థితి లో హిందూ మతం ఉన్నాదో . ఇంకా మనం ఈ కుహానా మేధావులు చెప్పే నీటి వ్యాక్యాలు వినాలా ?
    అరిగిపోయినా రికార్డు లా లౌకిక విధానం అని చెప్పి హిందువులు కళ్ళు పొడిచే ఈ విధానాలకి మనం వంత పాడాలా ?
    హిందూ సోదరులు ఆలోచించండి ,

    ReplyDelete