Saturday, December 13, 2014

సాక్షి అస్సలు ఏమి మారలేదు

అస్సలు ఏం మారలేదు . ఓ రెండు పోస్ట్ లు కుడా రాసేసాను ఆవేశం లో . 
అదే స్థాయి , అదే స్టాండర్డ్ , 
వార్తలు లేకపోతే , జగన్ న్యూస్ ఎలాగా ఉంటుంది  అంతే కాని , పాత న్యూస్ తీసుకుని వచ్చి మళ్ళి వేసేస్తే ఉత్సాహం తో చదివేస్తారని ఎలా అనుకుంటున్నారు ??
అంటే చదివేవాళ్ళు అంత వెర్రి వెంగళప్ప ల్లా  కనబడుతున్నారా ? 

ఈ వార్త చుడండి , ఇది ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగింది , మన రాష్ట్రపతి మారిపోయి ఇంచు మించు రెండు సంవత్సరాలు అవుతుంది . 


ఈ న్యూస్ మిగతా న్యూస్ పేపర్లలో ఎప్పుడు వచ్చింది .. ???



ఆంధ్రభూమి లో ఈ న్యూస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది . 
ఇదొక్కటే కాదు, ఇలాంటివి సాక్షి లో చాలా సార్లు చూసాను, కాకపోతే పోస్ట్ రాయడానికి బద్దకించి వదిలేసాను . 
న్యూస్ చానల్స్ నవ్వుల చానల్స్ అయిపోయాయి , న్యూస్ పేపర్స్ పార్టీ కరపత్రాలు అయిపోయాయి , అయినా అన్ని తెలిసి మేము ఎందుకు చదువుతున్నమంటే వేరే ఆప్షన్ లేక , తెలుగు లో చదివితే మనస్పూర్తిగా చదివినట్టు ఉంటుందని . 
మొన్నటకి మొన్న కిం కర్దాషియన్ ( ఒక హాట్ మోడల్ లెండి ) పెళ్లి అవ్వలేదని రాసారు , డైలీ మెయిల్ నుండి కాపీ కొడతారు కదా , మరి అందులో ఆ మోడల్ పెళ్లి ఫోటోలు చూడలేదా ???
ఏమన్నా అంటే అన్నానంటారు . 
 . 

4 comments:

  1. yes you r right friend in chennai tabloid also the same trend is continuing from the past 4 years.They wil repeat the old items nd stories periodically..

    ReplyDelete
    Replies
    1. స్పేస్ లేకపోతె , ఇలా పాత న్యూస్ తీసుకుని వేస్తారు అని నాకు ఇప్పుడే తెలిసింది . టీవీ లలో సినిమాలు వేసినట్టు .
      మీ కామెంట్ కి ధన్యవాదాలు

      Delete
  2. We have only entermainment channels no news channels

    ReplyDelete
    Replies
    1. చచ్చు విశ్లేషణలు పుచ్చు న్యూస్ .
      అర్ధం కాని విషయం ఏంటంటే ఇన్ని న్యూస్ చానల్స్ కి బిజినెస్ ఎక్కడ దొరుకుతుంది . న్యూస్ పేపర్లు చదువుకోవడమే బెటర్ .
      డి డి లో న్యూస్ వచ్చేటప్పుడు ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండేది , ఒక్క చిన్న పదం కూడా మిస్ అవ్వకుండా వినేవాళ్ళం .
      అప్పుడు తక్కువై , ఇప్పుడు ఎక్కువై , మనకి మనమే దూరంగా పారిపోవాలి

      Delete