Tuesday, December 23, 2014

అయిదు సంవత్సరాలలో లక్ష కోట్లు సొమ్ము తినేసిన పెద్దమనుషులు

గత అయిదు సంవత్సరాలలో ప్రభుత్వరంగ బ్యాంకులు సుమారు లక్ష కోట్ల రుణాలని రద్దు చేసేసాయి .
మొండి బకాయిల  జమ కట్టి ఇంక రావు అని అవి రద్దు చేసేసాయి , అంటే వసూలు చేయాల్సిన అవసరం లేదు .
రాని బాకీల గా వదిలేస్తారు .
ఎంత మంది పెద్ద మనుషుల రుణాలు ఎగ్గొట్టి ధైర్యంగా తిరుగుతున్నారో కదా.
సామాన్యులకి రుణాల కోసం వెళితే ఎన్ని అడ్డంకులు పెడతారో , ఎన్ని సార్లు తిప్పించుకుంటారో , అది నరక యాతన.
నేను ఎడ్యుకేషన్ లోన్ కోసం పడ్డ పాట్లు ఇప్పటికి గుర్తు ఉన్నాయి .
ఎడ్యుకేషన్ లోన్ కి పూచి కత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎంత చెప్పినా , బ్యాంకు లు పూచి గా ఏదో ఒకటి ఉంచమని అడుగుతాయి .

మా నాన్నకి స్థిర ఆదాయం లేదు , అది కూడా ఒక మధ్యతరగతి ఆదాయమే , ఒకే ఒక్క ఇల్లు .
ఆల్రెడీ మా తమ్ముడు కి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం దాని మీద ( 80,000) , కాకపోతే ఋణం కన్నా ఇల్లు వేల్యూ ఎక్కువ ( అది కూడా బ్యాంకు ఎస్టిమేట్ చేసిందే ) కాబట్టి నాకు కూడా ఒక 80,000 తీసుకుందాం అని వెళ్లాం , మా తమ్ముడి కి లోన్ ఇచ్చిన ఉద్యోగి సరే అని చెప్పాడు , అతనే చెప్పాడు ఇల్లు వేల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇంకో లోన్ కూడా తీసుకోవచ్చు అని . అదే బ్యాంకు కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పాడు . ఈ లోపు అతను బదిలీ అయిపోయాడు . కొత్తగా వచ్చిన అతను ఎన్నో రూల్స్ చెప్పాడు , ఏవేవో చెప్పాడు , ఇన్కమ్ టాక్స్ కడుతున్నట్టు రుజువు కావాలన్నాడు . బాబు మా నాన్న చేసేది చిన్న వ్యాపారం , అది కూడా స్థిరం కాదు .  మా నాన్నకి వచ్చే ఆదాయానికి ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు , మినిమం కన్నా తక్కువ . మీరు ఎలా తీరుస్తారు లోన్ అంటాడు , మాకు జాబ్స్ వస్తాయి కదా ఏదో ఒకటి , అయినా ఇల్లు ఉంది కదా తీర్చకపోతే మీరే అమ్మేసుకోండి అని బ్రతిమాలి చెప్పాం , తిరిగి తిరిగి బ్రతిమాలినా అతను ఒప్పుకోలేదు .
ఎస్ బి ఐ వాడు కూడా ఇంతే , పూచి కత్తు లేకుండా లోన్ ఇవ్వం అని చెప్పకుండా ఇంకో రెండు నెలలు తిప్పించుకున్నాడు ,
విసుగొచ్చి బయట వడ్డీ కి తీసుకున్నాం .



Courtesy : సాక్షి


No comments:

Post a Comment