Tuesday, March 28, 2017

చైనా కి వ్యతిరేఖంగా మాట్లాడొద్దు , దలైలామా కి ఉల్ఫా హెచ్చరిక .

చైనా కి వ్యతిరేఖంగా మాట్లాడొద్దు ,  దలైలామా కి ఉల్ఫా  హెచ్చరిక 








అంతే కాదు ఉల్ఫా నాయకుడు చైనా లోనే ఉన్నట్టు ఇండియా చెప్తుంది , చైనా ఒప్పుకోవడం లేదనుకోండి . కొన్ని ఉల్ఫా టెర్రరిస్ట్ క్యాంపు లు చైనా లో నడుస్తున్నట్టు ఇండియా అనుమానిస్తుంది . 

దలైలామా అరుణాచల్ప్రదేశ్ వెళ్లడం పై మన బ్లాగ్ లో ఒక వ్యక్తి ఏకంగా అమెరికా మీదే నెపం నెట్టేశాడు,   దలై లామా ఆరుణాచలప్రదేస్ సందర్శించడం పై  , చూస్తుంటే చైనా అభిమానులు విపరీతమైన అసహనం తో రగిలిపోతున్నారు. 










Wednesday, March 22, 2017

కేవలం దేవుడు లేదు అన్నందుకు వెంటాడి వెంటాడి చంపేస్తారా ?? ప్రజాస్వామ్యవాదులు , టీవీలలో గొంతేత్త్తి అరిచే నేతలు ఎక్కడ

దేవుడు ఉనికి గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా ?

మనిషి తన జ్ఞానాన్ని , తనని తానూ అభివృద్ధి చెందడానికి కారణం ఒకే ఒకటి అదే "ప్రశ్నించడం" .

ప్రశ్నించడం ద్వారానే మనిషి ఎన్నో నేర్చుకుంటాడు , పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు వివిధ సందర్భాలలో మనిషి ప్రశ్నిస్తూనే ఉంటాడు .

క్లాస్ లో టీచర్ ప్రశ్నించమని విద్యార్థులని ప్రోత్సహిస్తారు . ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ప్రతిపక్షాలు , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ?


ఈ రోజు ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని ఉనికి ని ప్రశ్నించినందుకు ఒక వ్యక్తి ని అత్యంత దారుణంగా నరికి చంపేశారు .  కానీ దీని గురించి ప్రశ్నించే నాధుడే లేదు . బహుశా అటువంటి గతే మాకు పడుతుందేమో అన్న భయం అయి ఉండొచ్చూ .  ఫేస్బుక్ లో  వీర ప్రజాస్వామ్యవాదులు , ప్రగతివాదులు అంటూ రొమ్ము విరిచి మాట్లాడే జనాలు కూడా  తెలియనట్టు నటిస్తూ తమ అలవాటైన ధోరణి లో బిజెపి ని విమర్శించుకుంటూ పోస్ట్ లు పెట్టుకుంటున్నారు .





ఒకసారి జాగ్రత్త్తగా ఈ సో కాల్డ్ ప్రజాస్వామ్యవాదులు ని గమనించమని చెప్తున్నాను .
వాళ్ళ డొల్ల వాదనా , సెలెక్టివ్ గా ఒకే మతాన్ని టార్గెట్ చేయడం బాగా గమనించండి.
కనీసం ఒక్కరు కూడా దీనిని ఖండించకపోవడాన్ని బాగా గమనించండి .
అదే హిందూ మతం లో జరిగితే ఈ పాటికి జరిగే రచ్చ ఎలా ఉంటుందో మీకు తెలుసు .
 ప్రశ్నించే అవకాశం లేని  మతం మతమే కాదు ,  


Saturday, March 11, 2017

Times of India లో ఎంజే అక్బర్ వ్రాసిన వ్యాసం , అభివృద్ధి నినాదం మరియు ముస్లిం ల ఓట్లు

Times of India లో ఎంజే అక్బర్ వ్రాసిన వ్యాసం ,  అభివృద్ధి నినాదం మరియు ముస్లిం ల ఓట్లు  , మరి కొన్ని ఇతర అంశాలు. ఎంతసేపు కులం కులం అంటూ అటు మీడియా ఇటు రాజకీయ పార్టీలు హోరెత్తించాయి కానీ, ఒక సామాన్యుడు కి అభివృద్ధి ఎంత ముఖ్యమో , ఎంత అవసరమో చెప్పడం లో మోడీ సక్సెస్ అయ్యారు .

అది అర్ధం చేసుకోవడం లో సామాన్యుడు కూడా సక్సెస్ అయ్యాడు , అందుకే ముస్లిం లు మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు లో కూడా బీజేపీ గెలుపొందడమే నిదర్శనం.

http://timesofindia.indiatimes.com/home/sunday-times/all-that-matters/the-poor-have-embraced-modi-and-the-vote-merchants-still-dont-get-it/articleshow/57597948.cms

Tuesday, March 7, 2017

నక్క జిత్తుల చైనా , ఈనాడు వ్యాసం, ఆసియా లో సగం అస్థిరత కి కారణం చైనా


ఆసియా లో సగం అస్థిరత కి కారణం చైనా నే.  అంతర్జాతీయ న్యాయస్థానాన్ని థీక్కరించి మరీ దక్షిణ చైనా సముద్రం లో పాగా వేయడానికి ప్రయత్నించడం .

 ఉత్తరకొరియా ని అడ్డం పెట్టుకుని దక్షిణకొరియా ని బెదిరించడం. 
ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు  కి దక్షిణకొరియా తన భూభాగం లో అమెరికా సహాయం తో anti-missile defence system ని మోహారిస్తుంటే దానికి కూడా అడ్డు చెప్పడం. 
ఉత్తర కొరియా కి అతి పెద్ద సపోర్ట్ చైనా నే. ఉత్తర కొరియా ని అదుపులో పెట్టమని పశ్చిమ దేశాలు ఎన్ని సార్లు చెప్పడం ఏ మాత్త్రం ఖాతరు చేయడం లేదు . 

మన దేశ అభ్యంతారాలని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వివాదాస్పద కాశ్మీర్ భూభాగం నుండి cpec ని నిర్మించడం, ఇప్పుడేమో దలైలామా సందర్శన ని వివాదాస్పదం చేయడం.   ఇలా ప్రతీ విషయాన్ని నానా యాగీ చేయడం  దానికే చెల్లుతుంది . 






         ఈ వ్యాసానికి పోటీగా మన బ్లాగుల్లో చైనా ని పొగుడుతూ మరొక వ్యాసం రావడం  ఆశ్చర్యం కాదు ( ఏది ముందో తెలియదు ) . అయితే చైనా చేసే సహాయం గురించి కూడా పొగడటం వింతే . చైనా చేసేది సహాయం కాదు , ఆ వంక తో ఆయా దేశాల్లో పాగా వేస్తుంది . శ్రీలంక కి ఇలానే సహాయం చేసింది , ఆ వడ్డీలు కట్టలేక ఆ దేశం కొంత భూభాగాన్ని ధారాదత్తం చేసేసింది .  అంటే తన దేశం లో కంపెనీ ల ద్వారా ఆయా దేశాల్లో ప్రాజెక్ట్ లని కొనిపించి , ఆ డబ్బులు శ్రీలంక కి ఇప్పించి , మరలా ఆ డబ్బులు ని  తన అప్పు గా జమ చేసుకుంటుంది . 

ఈ క్రింద లింక్ చదవండి. 



ఇప్పుడు పాకిస్తాన్ లో జరిగేది అదే ,  cpec పేరుతో డబ్బులు అప్పు ఇచ్చింది , ఆ రోడ్ లు , రైల్ ట్రాక్ లు వేసేది చైనా నే ,  అందులో పని చేసేది కూడా చైనా కార్మికులే ( ఆ కాంట్రాక్టు లు చైనా వాళ్ళే  తీసుకున్నారు ), కంపెనీ లు పెట్టేది చైనా పెట్టుబడి దారులే , మరి ఇందులో పాకిస్తాన్ కి లాభం ఏముంది , ఏమి లేదు toll  collect చేసుకోవడం , రోడ్ ఇరువైపులా టీ దుకాణాలు పెట్టుకోవడం, అంతే . కానీ అప్పు మరియు దానికి వడ్డీ మాత్రం పాకిస్తాన్ చెల్లించాలి . 

ఇలా ఉంటాయి చైనా చేసే సహాయాలు . 



Monday, March 6, 2017

కాశ్మీర్ లో జరిగేది ఉగ్రవాదం అని చెప్తున్న పాకిస్తాన్ పత్రిక , మన కుహానా లౌకిక వాదులు చదవాల్సిన విషయం


కొంతమంది కుహానా లౌకిక వాదులు రాతలు చూస్తుంటే , ఒళ్ళంతా రోత పుడుతుంది .
కాశ్మీర్ లో జరిగేది ఉగ్రవాదం అని ప్రపంచం అంతా చెప్తుంటే , ఇండియా మీద ద్వేషం తో , అది ఉగ్రవాదం కాదని చెప్తూ , ఉగ్రవాది అయిన Burhan wani ని దేశభక్తుడు అంటూ కీర్తించడం వాళ్ళకే చెల్లింది .

చదువరులు బాగా గమనిస్తే , ఒకప్పుడు హిందీ , మరియు ఇతర ప్రాంతీయ చిత్రాలలో ఎక్కువగా కాశ్మీర్ అందాలు ( నాకు బాగా గుర్తుంది దాల్ సరస్సు ) కనిపించేవి .  ఎంతో అందంగా , ఎటువంటి గొడవలు లేకుండా హిందూ ముస్లిం లు కలసి మెలసి జీవించేవారు ,

మరి ఈ గొడవ ఎప్పుడు మొదలయ్యింది ,  ఆఫ్గనిస్తాన్ లో రష్యా ని బయటకి పంపేసిన తరువాత అక్కడ ఉగ్రవాదులు ని పాకిస్తాన్ కాశ్మీర్ కి పంపించింది . అసలు ఆఫ్గనిస్తాన్ లో ఆ ఉగ్రవాదులు చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు .  పూర్తి వివరాలు అన్ని ఇంటర్నెట్ లో ఉన్నాయి , జస్ట్ ఒక సెర్చ్ చేస్తే చిటికె లో మీ ముందు ఉంటాయి . అటువంటి ఉగ్రవాదులు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో వఛ్చి అక్కడ హిందువు లని హింసించి హింసించి , అత్యాచారాలు చేసి , అమ్మాయిలని అపహరించి , భయపెట్టి తరిమేస్తే ఎన్నో వేలమంది ఢిల్లీ వఛ్చి తల దాచుకున్నారు. ఇప్పుడు కాశ్మీరీ లు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు అంటూ మనకి సుద్దులు చెప్తున్నారు ఈ రచయత .

కాకపోతే ఈ విషయాన్ని అక్కడ పత్రిక లో ఒక ఒక పాకిస్తానీ రచయత రాసి తూర్పారబెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులని ఏరేస్తామని చెప్తూ చేసే దాడులు నిజంగా జరగడం లేదు .  తనకి అనుకూలమైన ఉగ్రవాదులని చంపకుండా , వ్యతరేఖత వ్యక్తం చేసేవాళ్ళని ఈ దాడులు పేరుతో చంపేస్తున్నారు . అఫ్గనిస్టాన్ తాలిబాన్ మరియు హుక్కాని ఉగ్రవాదులు మీద ఈగ కూడా వాలకుండా పాకిస్తాన్ జాగ్రత్త్త పడుతుంది .

ఆ విషయంమీద ఆ రచయత ఆర్మీ ని తీవ్రంగా విమర్శించాడు .


పూర్తి వ్యాసాన్ని ఇక్కడ పెడుతున్నాను , దయచేసి చదవండి .  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోంచి వెళ్లే CPEC గురించి కానీ ,  కాశ్మీర్ లో హిందువులు మీద జరిగినా అత్యాచారాల మీద కానీ , టిబెట్ మీద , అరుణాచల ప్రదేశ్ మీద కానీ ఒక్క ముక్క రాయని ఈ రచయత ఒకప్పుడు పేపర్ లో అంతర్జాతీయ వార్తలు ఎలా analyse చెయ్యాలో చెప్తూ పెద్ద వ్యాసాలూ కూడా రాసేశారు .  Its completely selective and biased criticism. People should welcome criticism but not this selective one.