కూడలి సంకలిని మూసివేయడానికి గల కారణాలేంటో తెలియడం లేదు .
'ఏదోలా కొనసాగించే అవకాశం ఉండి కూడా, అస్తమయమే మేలని అనుకోవడం ' అర్ధం కావడం లేదు .
తెలుగు లో వ్రాసేవారు, చదివే వారు తగ్గిపోతున్న ఈ రోజుల్లో , ఈ మూసివేత ఖచ్చితంగా బాధాకరమే .
తెలుగు బ్లాగుల్లో నేను చూసిన అత్యంత పాత సంకలిని కూడలి మాత్రమె. నిజం చెప్పాలంటే బాగా అలవాటయిపోయిన వెబ్సైటు .
నేను నా స్నేహితులకి చాలా మందికి కూడలి ని పరిచయం చేసాను , విడి విడి గా బ్లాగ్ పేర్లు చెప్పలేక , కూడలి or మాలిక చూస్తె మీకు కావలసినన్ని బ్లాగ్ లు ఉంటాయని చెప్పేవాన్ని.
దయచేసి పునరాలోచిన్చుకోవల్సిన్డిగా అభ్యర్దిస్తున్నాను . మిగిలిన బ్లాగర్లు కూడా స్పందిన్చవలసిన్డిగా కోరుతున్నాను .
రాడికల్ ఇస్లాం గురించి కొంత సమాచారం మరియు వీడియో అంకెలు తో సహా .. ఈ పోస్ట్ కేవలం రాడికల్ ఇస్లాం గురించి మాత్రమె.
సర్వే లో కొంత భాగం PeW రీసెర్చ్ సెంటర్ . 39 దేశాలలో .
ఇది క్లారియన్ ప్రాజెక్ట్ లో భాగం
గత కొన్ని సంవత్సరాలు గా , ప్రపంచం అంతా బాధపడుతుంది , ప్రపంచాన్ని పీడిస్తూ ఉన్నది , ఇంకా దారుణమైన పరిస్తితులు ఎదురవుతాఎమో అని భయపడేది ఒకే ఒక్కదానికి అదే రాడికల్ ఇస్లామిజం .
ప్రపంచం లో ఎక్కడ టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినా , మన నాయకులు సానుభూతి తెలపడం కంటే ముందు గా ఒక మాట చెప్తారు అదే " ఇస్లాం కి టెర్రరిజం కి ఏ సంబంధం లేదు " అని . నిజం చెప్పాలంటే ఇది మనకి కొత్త కాదు, బాగా అలవాటైన స్టేట్మెంట్ .
నాయకులకి సెక్యూరిటీ ఉంటుంది కాని , సామాన్యులకి కాదు కదా . గత కొన్ని నెలలు లో , యూరోప్ మరియు అమెరికాలలో ఎంత మంది అమాయుకులు బలి అయోపోయారో మీకు తెలుసు .మనకి కొత్త కాదు , కాని పాపం అమెరికన్స్ , యూరోపియన్స్ ని ఇప్పుడిప్పుడే ఈ మాటలు వింటున్నారు .
ఒబామా , హిల్లరీ , డేవిడ్ కెమరూన్ లు ఇంటర్వ్యూ లు వింటే మీరు మరిన్ని మాటలు వినొచ్చు .ఒబామా అయితే 99.99% ముస్లిమ్స్ కి ఈ రాడికల్ ఇస్లాం లో సంబంధం లేదు అని చెప్పారు .కాని సామాన్య జనాలకి విషయం తెలుసు కాబట్టి డోనాల్డ్ ట్రంప్ కి మెజారిటి పెరుగుతుంది .
దారుణం ఏంటంటే, ఎవరైనా మితవాదులు ధైర్యం చేసి మాట్లాడిన, వాళ్ళని అసహన వాదులు గా, రేసిస్ట్ లు అని ముద్ర వేసేస్తున్నారు , దాని వల్ల మిగిలిన వాళ్ళు కూడా బయటకి రావడం లేదు .
కొంతమంది చెప్పినట్టు , పెట్టుబడి దారుల స్వార్దమే ఈ టెర్రరిజం కి కారణమా ??
అమెరికా లో ముస్లిమ్స్ టెర్రరిజం కి మద్దతివ్వరని అమెరికా నాయకులు బలంగా నమ్మారు , దానికి కారణం ఏంటంటే , మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన ముస్లిమ్స్ కి అమెరికా ఆశ్రయం ఇచ్చింది , అటువంటి ఆశ్రయం ఇచ్చిన దేశం మీద టెర్రరిస్ట్లు దాడులు ఎందుకు చేస్తారు అని , కాని ఏమైంది ?? ఇప్పుడు అమెరికా లోఎంత భయం ఆవరించి ఉందొ మీకు తెలుసు . అలానే యూరోప్ దేశాలు కూడా , తమ దేశాలలో అరాచకాలు భరించలేక శాంతి కోసం , తిండి మరియు వసతి కోసం ఆశ్రయం కోరుతూ వచ్చిన వేల మంది ముస్లిమ్స్ కి ఈ యూరోప్ దేశాలు ఆశ్రయం ఇచ్చాయి , ఇప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయంగా ఉన్నాయి .
మంచి జీవితం, మనవ హక్కులు బలంగా ఉన్న దేశం, ప్రపంచం లో ప్రతీ ఒక్కరు ఆశపడే జీవితం వాళ్ళ సొంతం. వ్యక్తిగత స్వేచ్చ, ప్రభుత్వం తీసుకునే సామాజిక రక్షణ కి అయితే సలాం చెప్పొచ్చు, పిల్లల రక్షణ కి భత్యం ఇస్తారు. నిరుద్యోగులకి భత్యం, ఇవన్ని ఉండి కూడా వేల మంది ఇసిస్ లో జాయిన్ అవుతున్నారు యూరోప్ నుండి , ఇందులో కూడా పెట్టుబడిదారి తనపు స్వార్ధమా ?? లేక రాడికల్ ఇస్లాం కారణమా ? పేదరికం లేని దేశాల నుండి కూడా టెర్రరిజం కి ఆకర్షితులవ్వడం ఏ విధానం లోకి వస్తుంది .
టెర్రరిజాన్ని పెట్టుబడిదారి కోణం నుండి , కమ్యునిజం కోణం నుండి , అమెరికా కోణం నుండి మాత్రమె ఎందుకు చూడాలి , వేరే కోణం నుండి చూసే ప్రయత్నం ఏ మాత్రం చేయలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఈ పెట్టుబడిదారి విధానం అంటూ ఒకటి లేనప్పుడే , సున్ని షియా గొడవలు ఉన్నాయి , అరబ్ దేశాలలో జాతులు మధ్య యుద్దాలు జరిగాయి , Jews ని సహించలేనంత ద్వేషం ఉంది . మరి వీటి కోణం లో చూడకుండా చేసిన ఏ విశ్లేషణ అయినా అసంపూర్తిగానే ఉంటుంది , ఈ మధ్యన చదివిన వహబిజం ఆర్టికల్ . ఇసిస్ ని అర్ధం చేసుకోవాలంటే వాళ్ళ విధానాలు ఇస్లాం లో ఏ తెగ లేక జాతి కి అనుగుణంగా ఉన్నాయి . http://www.huffingtonpost.com/alastair-crooke/isis-wahhabism-saudi-arabia_b_5717157.html
సుమారు 1. 6 బిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు ఈ ప్రపంచం లో. అత్యంత వేగంగా ఎదుగుతున్న మతం ఇస్లాం .
2 లక్షల మంది ముస్లిమ్స్ ఇసిస్ కోసం పనిచేస్తున్నారు ప్రపంచం లో ( మీ పక్కనే ఒకరు ఉండొచ్చు ).
మరి కొన్ని లక్షల మంది అల్కైదా , హమాస్ , ఇతర టెర్రరిస్ట్ సంస్థ ల కోసం పని చేస్తున్నారు.
వీళ్ళంతా కరుడు గట్టిన జిహాదిలు , వీళ్ళు కాకుండా వీళ్ళ విధానాలని పూర్తిగా సమర్దిస్తూ సామాన్య జీవితం బ్రతికే మనుషులు కోట్ల లో ఉన్నారు .
కాని ఈ మొత్తం ముస్లిం జనాభా లో ఎంత మంది రాడికల్ ఇస్లాం ని సమర్దిస్తున్నారు . యెంత మంది extremism ని సమర్దిస్తూ మాట్లాడుతున్నారు , వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి .
అనుకున్నట్టే అయ్యింది . విజయవాడ కమీషనర్ ని తోసేసారు .
పాపం సాయికుమార్ లెవెల్లో , ఆడ కూతుళ్ళకి న్యాయం చేస్తానని ఎగేరేగిరి పడ్డాడు.
కూతురుని పక్కలో పడుకోబెట్టమని తల్లిని అడిగిన దుర్మార్గులని వదిలిపెట్టేది లేదని చెప్పాడు .
చీల్చి చెండాదతానని ప్రతిజ్ఞ చేసాడు .
భాదితుల మాటలు ఫోన్ లో వింటుంటే కడుపు రగిలిపోతుంది అని చెప్పాడు .
ఏమైంది ... ఫ్లైట్ దిగిన " బోడె ప్రసాద్ " ఒక్క బోల్లెడుపు ఏడ్చాడు మొత్తం తుస్స్ మని ఎగిరిపోయింది .
చంద్రబాబు సమీక్ష చేసి , దర్యాప్తు నిష్పక్షపాతంగా, నిజాయితీ గా జరుగుతుందని తెలిసి ఆశ్చర్యపోయారు.
కమీషనర్ సెలవు .
దానికి ఈనాడు , ఆంధ్రజ్యోతి వంత పాడటం మామూలే ..
ఇంత పెద్ద కేసు దర్యాప్తు చేస్తున్న కమీషనర్ సెలవు లో వెళితే , ఈనాడు ఒకే ఒక్క లైన్ లో రాసింది . అది కూడా హెడ్డింగ్ కాదు , లోపల ఒక్క లైన్ లో , డిజిపి గారు ఇలా చెప్పారు అని అంతే . ఆంధ్రజ్యోతి ఎలాగు వేయదు .
మన తెలుగు చిత్ర పరిశ్రమ కి ఒక అసోసియేషన్ ఉంది , దానికి ప్రెసిడెంట్ , సెక్రటరీ లాంటి వారు ఉన్నారు .
అయినా మా (MAA) కి వైస్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా , తన సొంతంగా "మన మద్రాస్" పేరుతొ కార్యక్రమం పెట్టడం లో మన లక్ష్మక్క ఔచిత్యమ్ ఏంటో అర్ధం కావడం లేదు .
పాపం రాజేంద్రప్రసాద్ ఏదో ముళ్ళ కిరీటం లా భరిస్తున్నాడు . పోటి లోకి దిగిన తరువాత వెనక్కి వెళ్ళలేక అహం అడ్డొచ్చి నిలబడ్డాడు , అప్పటకి టీవీ9 లో చెప్పాడు, ముందే నాతో చెప్పి ఉంటె నేను పోటి లో ఉండేవాడిని కాదు అని .
మురళి మోహన్, మోహన్ బాబు , సీనియర్ నరేష్ , అలీ అంతా వెన్నుపోటు పొడిచారు . శివాజీరాజ వాపోయాడు అలీ ముందు నాతో చెప్పలేదు అని .
తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి చేయడం ఒకటి , ఇలా ఎవరికి వారు చేసుకోవడం ఒకటి . MAA కి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కూడా లక్ష్మక్క ఇలాంటివి ప్రోత్సహించడం గర్హనీయం .
కాల్ మనీ ముఠా అక్రమాలలో ఈనాడు కక్కలేక మింగలేక , వాళ్ళ పేర్లు బయట పెట్టలేక, దాయలేక కింద మీద పడుతుంది .
చూస్తుంటే ఈ ముఠా లో తెలుగు దేశం నాయకులూ భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టుంది .
ఎమ్మెల్సి , ఎమెల్యే ఉన్నట్టున్నారు . దాంతో వాళ్ళంతా "ప్రజా ప్రతినిధి" లు అయిపోయారు .
సాక్షి లో డైరెక్ట్ గా పేర్లు వస్తున్నాయి , ఫేస్బుక్ లో ఫోటోలు షేర్ అవుతున్నాయి .. ఈనాడు కి మాత్రం " ప్రజా ప్రతినిధి ", పాపం ఈనాడు , సాక్షి వచ్చిన తరువాత కొన్ని విషయాలు కవర్ చేయలేక బాగా ఇబ్బంది పడుతుంది .
ఇంతకు ముందు సాక్షి కి ఈ ఇబ్బంది బాగా ఉండేది .
ఈ విషయం ఆంధ్రజ్యోతి ని మెచ్చుకోవాలి , ఆ పేపర్ కి ఇలాంటి ముసుగులో గుద్దులాట లేదు , తెలుగు దేశం పార్టి నేతలు ఉన్నచోట , డైరెక్ట్ గా వైఎస్ఆర్ పార్టి నేతలు అని రాసెస్తుంది , లేకపోతె ఆ వార్తే కనిపించదు ఆ పేపర్ లో .