Tuesday, November 3, 2015

నిజంగా అసహనం పెరిగిపోతుందా ?

నిజంగా అసహనం పెరిగిపోతుందా ?

మన దేశాన్ని ఒక పధకం ప్రకారం degrade చేసే కుట్ర లా లేదు ఇది ? పెట్టుబడులు కోసం ఎదురు చూసే మన దేశం లో ఇది ఎంత ప్రమాదకరం . ( విదేశి పెట్టుబడులు లాభమా , నష్టమా అనేది వేరే టాపిక్ ).
ఈ హత్యలని ఖండించాలి , అంతే కాదు హంతకులకి ఉరిశిక్ష విధించినా నష్టం లేదు .

కర్ణాటక లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ .
ఉత్తరప్రదేశ్ లో ఉన్నది సమాజవాది పార్టీ .

ముంబై లో శివసేన ఎప్పటినుండో ఉంది . అంతే కాదు పాకిస్తాన్ కి వ్యతిరేఖంగా ప్రకటనలు చేయడం లో ఎప్పుడు ముందే ఉంటుంది . ముంబాయి నడిబోడ్డున పాకిస్తానీ టెర్రరిస్ట్ లు వచ్చి భీబత్సం స్ప్రుష్టించి నరమేధం చేస్తే .. ఇక్కడ మేధావులు ముసుగు వేసుకుని , లౌకికత్వం అని నల్ల తోలు కప్పుకుని ఒక పాకిస్తాన్ రచయత  పుస్తకావిష్కరణ చేస్తే సామాన్య జనం కడుపు రగిలిపొదా ?.  అది కావాలనే చేసినట్టు అనిపించడం లేదా ? ముంబాయి లో తమని కాదని బిజెపి ఒంటరిగా పోటీ చేయడం కూడా శివసేన కి మండిపోతుంది .
    చార్లెస్ హేబ్దో ఎటాక్ జరిగినప్పుడు ఈ మేధావులు (?) ఏం మాట్లాడారు ,  అవతలి వాళ్ళ సెంటిమెంట్స్ గౌరవిన్చాలంట అని , మత నమ్మకాలని అవమానించే అర్హత లేదు అని ..  మరి కల్బుర్గి చెప్పింది ఏంటి ?? హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద ఉచ్చ పోస్తానని.. .మరి ఈ గొంతులు ఏమయిపోయాయి ,అరిచి అరిచి బొంగురుపోయాయా  ?


--ముస్లిమ్స్ కి మాత్రమె ఈ దేశం వనరుల మీద ఆధిపత్యం ఉంది అని మన్మోహన్ గారు చెప్పినప్పుడు , మిగతా మతాలలో అసహనం పెరిగిపోలేదా ?? అప్పుడు ఈ మేధావులు ( ??) కి గుర్తుకు రాలేదా ఈ అసహనం . 
--గోద్రా రైలు ని తగలపెట్టి నప్పుడు గుర్తుకు రాలేదా ఈ మేధావులకి ( ??) అసహనం . 
--కేరళ లో ఒక ప్రొఫెసర్ చేయిని ఒక వర్గం వారు  అమానుషంగా నరికేసినప్పుడు గుర్తుకురాలేదా ఈ అసహనం .
--ఎం ఐ ఎం  తస్లిమా నస్రీన్ ని జుట్టు పట్టుకుని హైదరాబాద్ నడిబొడ్డున తన్నినప్పుడు , ఈ మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఏ కలుగులో దాక్కున్నారు ??

ఈ వామపక్ష బుద్ది  ఇంకా ఎన్నాళ్ళు ?? 

బిజెపి అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి , హిందువు లని మాత్రమె  మతవాదులు గా ముద్ర వేయడం లో ఈ కుట్ర ఏంటి ?? అంతకు ముందు జరగలేదా ? సిక్కుల ఊచకోత లో ఇప్పటకి మానని గాయాలే ..  

ఇలాంటి సెలెక్టివ్ గా నిరసన తెలపడం లో పరమార్ధం ఏంటి ? .  ఇప్పుడు ఉన్న సామాజిక వెబ్సైటు ల వల్ల  చిన్న విషయం కూడా అతి త్వరగా ఆవల గట్టుకి చేరిపోతుంది , అలాంటిది ఈ మేధావులు చేసే సెలెక్టివ్ నిరసన తెలియదా ? ఇలానే కాంగ్రెస్ చేసి , హిందూ వోట్లు అన్ని polarize అవ్వడానికి దోహదపడ్డాది . 

తస్లిమా నస్రీన్ చెప్పినట్టు ,  ఈ దేశం లో సెక్యులర్ అని పిలిపించుకోవాలంటే  అంటే హిందూ మతానికి వ్యతిరేఖంగా మాట్లాడాలి 








2 comments:

  1. తస్లిమా నస్రీన్ చెప్పినట్టు , ఈ దేశం లో సెక్యులర్ అని పిలిపించుకోవాలంటే అంటే హిందూ మతానికి వ్యతిరేఖంగా మాట్లాడాలి
    నిజంగా నిజం. ఈ దేశంలో హిందువులు అన్న ముద్రక్రింద అభద్రతతో బ్రతికేస్తున్నవారికి, మెజీరిటీ వాళ్ళు ఒక్కత్రాటిపై నడవరన్న కారణంగా వాళ్ళు ఓటొ బ్యాంక్ కారు. తద్విరుధ్ధంగా, మైనారిటీలో - నికార్సైన ఓటు బ్యాంకులు. కాబట్టి వాళ్ళ ఓట్దలకోసం రాజకీయులు ఆత్మహననానికైనా తెగబడి మరీ సాగిలపడి దణ్ణాలు పెడుతూ ఉంటారు. ఎప్పటికైనా ఈ అకటావికటపు పధ్ధతి పుణ్యమా అని మహమ్మదీయులు 49%కి దగ్గరైతే చాలు మనదేశం ఇస్లామిక్ దేశం ఐకూర్చుంటుంది. అప్పుడిక మైనారిటిలకు హక్కులు హుళక్కి కాబట్టి మన మేతావులన్నీ మాయమైపోతాయి. ఈ సెక్యులరిజం అనే కుహనా పోలసీ మనదేశానికి పనికిరాదని వాళ్ళే పాటలు పాడినా ఆశ్చర్యం లేదు.

    ReplyDelete