Friday, November 13, 2015

గిరిజనులను మత మార్పిడి గురించి ఈ మేధావులు ఎందుకు మాట్లాడటం లేదో అర్ధం కావడం లేదు


ఈ మధ్యన ఒక వార్త చదివే ఉంటారు మీరు. నక్సలైట్లు చర్చి ఫాదర్ కొడుకుని కిడ్నాప్ చేసారు .
మత మార్పిడులు ఆపమని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని , చర్చి ఫాదర్ ని కిడ్నాప్ చేయడానికి వస్తే ఆటను దొరకక , అతని కొడుకుని కిడ్నాప్ చేసారు .

గిరిజనులు ఎక్కువగా ప్రకృతి ని కొలుస్తారు , వారి జీవనం పూర్తిగా వేరుగా ఉంటుంది , ఆచారాలు వ్యవహారాలూ అన్ని ప్రక్రుతి తో దగ్గరగా ఉంటాయి . హిందువులు అని కూడా చెప్పలేము . అత్యంత అమాయకులు , మోసం దగా లాంటివి తెలియదు .  నేను చింతపల్లి ఏరియా లో తిరిగినప్పుడు ఎక్కడ చూసిన చర్చి లే కనిపిస్తున్నాయి , అవి కూడా మాములుగా కాదు చాలా పెద్దవి  , చర్చి లు కట్టడం తప్పు కాదు , కాని హాస్పిటల్ , స్కూల్ కూడా సరిగ్గా లేని ఇటువంటి ఊళ్లలో చర్చి లు ఉండటం , మనకి అత్యంత సులువుగా అర్ధమవుతుంది .

నిజం చెప్పాలంటే గత యాబై సంవత్సరాలు గా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి .  దేశం లో ఉన్న పేదరికాన్ని , కులాల గోడవలని , గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా గా చేసుకుని ఈ మతమార్పిడులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి , అఫ్ కోర్స్ పాలకుల సహాయ సహకారం కూడా ఉందనుకోండి .

కాని గిరిజనులు ని ప్రలోభపెట్టడం చాలా అన్యాయం , అన్నెం పున్నెం ఎరగని ఆ అమాయకులని దేవుడు, దెయ్యం అనే పేరుతొ మభ్యపెట్టి మతమార్పిడులు చేయడం తీవ్రంగా ఖండించాలి .  వారి సహజ జీవనానికి దూరం చేయడం గర్హనీయం . జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది .  విచిత్రం ఏంటంటే పోలవరం పేరు చెప్పి గిరిజనులు కి అన్యాయం జరుగుతుంది అని చెప్పే ఈ "పెద్ద మనుషులు " ఈ మత మార్పిడులు మీద ఎందుకు ఇంత మౌనంగా ఉంటారు ?? ఇది ఎప్పటి నుండో నా బుర్రని తొలుస్తున్న ప్రశ్న .. ??

బిజెపి మాట్లాడాలి కాబట్టి ఒకె
కాంగ్రెస్ మాట్లాడకూడదు కాబట్టి ఓకే
కనీసం కమ్యూనిస్ట్ పార్టి లు అన్న మాట్లాడాలి కదా ??
మానవ హక్కుల వేదిక నాయకులూ అని చెప్పుకుంటూ తిరిగేవారన్న మాట్లాడాలి కదా ??
గిరిజనులకి క్రీస్తు బోధనలు అవసరమా ?? మళ్ళి వీళ్ళే దేశం మత అసహనం పెరిగిపోతుంది వీదుల్లో అరుస్తూ తిరుగుతూ ఉంటారు. 




పూర్వము ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఒక వార్త లో కొంచెం  , వేరొక బ్లాగ్ నుండి తీసుకున్నాను .. పూర్తీ వ్యాసం త్వరలో అప్డేట్ చేస్తాను . 
___________________________________________________________

క్రైస్తవ మతాంతరీకరణం మన గిరిజన సంస్కృతుల పైన చావుదెబ్బ కొట్టింది. ఇది ఇంకా కొనసాగుతూనే వుంది. మన రాష్ట్రంలో 35 గిరిజన తెగలు ఉన్నాయి. తెలిసినవారు కూడా గిరిజనులను హిందువులుగా పరిగణిస్తారు. కాని ప్రతి గిరిజనతెగకు వారిదైన మతంవారికి ఉంటుం ది. వారి దేవుళ్ళు వారికి ఉన్నారు. ద్రావిడ భాషలు మాట్లాడే 27 గిరిజన తెగలకు విభిన్నమైన మత జీవనం ఉంది. వారి భాష ద్రావిడ భాష అయినా , తెలుగు లాగే అవి ఒకే భాషా కుటుంబానికి చెందినా వారి మతం వేరు, దేవుళ్లు వేరు. వారు మౌలికంగా హిందువులు కారు.

క్రైస్తవ మిషనరీలు చాలా కాలంగా ఈ తెగల వారిని లక్ష్యంగా చేసుకున్నా రు. వారి మతా న్ని మారుస్తూ వచ్చారు. గిరిజనుల నిత్య జీవన విధానానికి, మత అనుష్ఠానాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి గిరిజన తెగకు వారిదైన న్యాయ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఉన్నాయి. వీటిని మన భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా గౌరవిస్తున్నాయి. అయితే వీటిని క్రైస్తవ మతాంతరీకరణ విజయవంతంగా నాశనం చేయగలిగింది. ఇంకా చేస్తూనే ఉంది.

_____________________________________________________________

దయచేసి వీటిమీద మీ అభిప్రాయలు చెప్పండి , వీటికి వ్యతిరేఖంగా ఎవరన్న పోరాడుతున్నారా ?, వీలుంటే వాళ్ళ వివరాలు ఇవ్వండి , మనకి చేతనైన సహాయం చేద్దాం . 









2 comments:

  1. పాపిష్టి ముండాకొడుకు మిషనరీలు. పనీ పాటలేని లఫంగి ముండలు.

    ReplyDelete
  2. మరే! శాపిస్తాం, మంత్రిస్తాం అని దోచుకు బతకాలి గానీ, మారుస్తాం, రక్షిస్తాం అంటారా వీళ్ళు.

    ReplyDelete