Saturday, January 19, 2013

తెలుగు రాని ఆంధ్రుడు ....

ఒక్కోసారి మీరు ఊహించని మాటలు అవతలి వాళ్ళ దగ్గర నుండి వింటుంటే ఎలా ఉంటుంది ( బూతులు కాదండి బాబు ) అవతలి వాళ్ళు సీరియస్ గా చెప్పినా మనకి మాత్రం పిచ్చెక్కుతుంది. సినిమాల్లో మాత్రమే చుసిన నేను నాకే ఎదురైంది.

 హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు జరిగింది. అందరిలానే అమెరికా కి వెళ్ళిపోవడానికి ఏదో ఒక institute లో జాయిన్ అయి జావా నేర్చేసుకోవాలి కాబట్టి జాయిన్ అయిపోయా. జావా కన్నా ముందు అమెరికా ఎలా వెళ్ళాలి అని   చెప్తుంటే పదవ తరగతి విధ్యార్ది లా వింటున్నాను. ఈ లోపు నా పక్కన కుర్చున్నవాడు ఏదో అడిగాడు నన్ను హిందీ లో.
మనకి హిందీ అంతంత మాత్రమె కాదు , అస్సలు లేదు.  వాడెం చెప్తున్నాడో అర్ధం కాలేదు.
నేను తిరిగి ఇంగ్లీష్ లో అడిగాను. వాడు ఏదో కులబడుక్కుని ఇంగ్లీష్ లో అడిగాడు, సమాధానం చెప్పేసాను.

హైదరాబాద్ institutes  లో మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి అంత ఆశ్చర్యం కలిగించలేదు.
కాని మనదంతా ఒకే దేశం, పాపం ఎంతో దూరం నుండి మన సిటీ కి వచ్చాడని మాటలు కలిపి మంచి చెడ్డలు తెలుసుకుందామని , ఏ రాష్ట్రం మనది అని హిందీ లో కూడబలుక్కుని అడిగాను. అతనేమో లేదు నాది హైదరాబాదే అని అన్నాడు. వీడికి సరిగ్గా అర్ధం కాలేదేమో అని, ఇప్పుడు నువ్వు ఉంటున్న సిటీ కాదు అడిగింది, మీది  ఏ రాష్ట్రం అని మళ్ళి అడిగాను, మళ్ళి  అదే చెప్పాడు.
ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయింది. తెలుగు రాదా మీకు అని అడిగాను, రాదు అని చాలా casual చెప్పాడు. వేరే రాష్ట్రం నుండి మైగ్రేట్ అయ్యారేమో అనుకుని మీ పేరెంట్స్ డి కూడా హైదరాబాదేనా అని అడిగాను, వాడికి చిరాకేసింది , మా పేరెంట్స్ దే కాదు నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను అని చెప్పాడు.

నాకు మైండ్ బ్లాంక్ అయింది. చుస్తే హైదరాబాద్ లో పుట్టి పెరిగాను అని చెప్తున్నాడు, తెలుగు ఒక్క పదం కూడా రాదు అని చెప్తున్నాడు, ఈ సారి కొంచెం మొహమాటంగా , హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడా అని అడిగాను, ఏదో పేరు చెప్పాడు , చార్మినార్ కి అవతల అని చెప్పాడు.

హైదరాబాద్ లో పుట్టి పెరిగి తెలుగు రాకుండా ఎలా ఉంటుందో నాకు అస్సలు అర్ధం కాలేదు. నిజంగా నేను ఒక పది నిమిషాలు అది ఆలోచిస్తూ ఉన్నాను, వీడు గేమ్స్ అడుతున్నాడేమో అని అనుమానం వచ్చింది.కాని వాడి సమాధానాలు మాత్రం అలా లేవు. చాలా సీరియస్ గానే చెప్పాడు.

చాలా విచిత్రం అనిపించి , రూం కి రాగానే అందరకి చెప్పాను, వాడు ఇలా చెప్పాడు, వాడు సరదాగా చెప్పాడేమో అని డౌట్ గా ఉంది, తెలుగు రాకుండా ఎలా ఉంటుంది ఇక్కడే పుట్టి పెరిగినవాడికి అని.
ఆ రూం లో హైదరాబాది ఫ్రెండ్స్ కుడా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇదంతా కామన్ అన్నట్టు విని చెప్పారు,
ఇదంతా కామన్, ఓల్డ్ సిటీ లో ఉన్నవాళ్ళకి తెలుగు రాదనీ, వాళ్ళు నేర్చుకోవలసిన అవసరం రాదనీ. నిజంగా నమ్మబుద్ది కాలేదు నాకు , ఎంత ఇంట్లో మాట్లాడకపోయినా బయట మాట్లాడుతారు కదా అని అడిగాను.
బయట కూడా మాట్లాడే అవసరం ఉండదని , ఓల్డ్ సిటీ దాటి బయటకి అంతగా రాని  వాళ్లకి తెలుగు అస్సలు రాదు అని, నేర్చుకునే అవసరం కూడా ఉండదు, వాళ్ళ రోజు వారి పనులు , కలిసే మనుషులు అందరు ఉర్దూనే మాట్లాడతారు అని చెప్పారు.

ఇప్పటకి ఆశ్చర్యమే కొంచెం కూడా తెలుగు రాకుండా ఎలా ఉంటుంది అని....


6 comments:

  1. అదే మన వ్యవస్థ తీరు, మన తెలుగు పైన ప్రభుత్వ నిరాదరణకి నిలువెత్తు సాక్ష్యం

    ReplyDelete
    Replies
    1. అవును. మీరు చెప్పింది నిజం. తెలుగే అవసరం లేదని వాళ్ళు, నేర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం.

      Delete
  2. మీరింకా నయం నేను ఒకసారి అడిగితే నాకు తెలుగు రాదు అని తెలుగులో చెప్పాడు ఒకడు

    ReplyDelete
  3. నాకు కూడ ఇలాంటి అనుభవమే ఎదురైంది హైదరాబాద్ లో. మన దేశం లో లొకల్ భాష తెలియని వాళ్ళు ఉండే ఏకైక ప్రదేశం ఇదే అనుకుంటా !!!

    ReplyDelete
    Replies
    1. నిజంగా మీరు చెప్పింది నిజం.
      ఇటువంటి సంఘటన నేను ఎక్కడ వినలేదు చదవలేదు కూడా ఇంతకు ముందు.
      ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటూ , తెలుగు రాదు అని అంత గర్వంగా చెప్తున్నారంటే నాకు ఇప్పటకి నమ్మబుద్ది కావడం లేదు.
      నా స్నేహితుల్లో, కొంతమంది తమిళనాడు, కేరళ నుండి కూడా మైగ్రేట్ అయి హైదరాబాద్ వచ్చినవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు చాల బాగా మాట్లాడుతారు,
      వాళ్ళు మాట్లాడుతుంటే తెలుగేతరులు అని ఆనవాలు కట్టలేం అంత బాగా మాట్లాడుతారు. కొంతమంది కూడబలుక్కుంటూ మాట్లాడుతారు, అది కూడా పరవాలేదు.
      అంతే కాని, అసలు నాకు అవసరమే లేదు అన్నట్టు మాత్రం ఉండటం నిజంగా జోహార్లు వాళ్లకి. వాళ్ళకంటూ ఒక భాష ఉండవచ్చు, కాని రాష్ట్ర భాష ని విస్మరించి బ్రతికేయడం గ్రేట్.
      మీరు చెప్పింది అక్షరాల నిజం .

      Delete