Thursday, December 27, 2012

ఆయనే.. శంకరంబాడి!

ఈ రోజు ఆంధ్రజ్యోతి నవ్య లో చుసిన ఒక వార్త. మన తెలుగు తల్లి గీతాన్ని వ్రాసిన శంకరంబాడి సుందరాచార్యులు గారు చివరి దశలో గడిపిన జీవితం.
ఆ వార్తా వ్రాసిన వ్యక్తీ ఎంత ఆవేదన తో రాసారో అది చదివితే మనకి అర్ధమవుతుంది. నాకు నోటిమాట రాలేదు చదువుతుంటే , చాలా బాధగా అనిపించింది.
మా చిన్నప్పుడు స్కూల్ లో జరిగే చిన్న చిన్న functions  కి మా తెలుగు మాస్టారు ఈ పాట  పాడించడం ఇప్పటకి  గుర్తే. కాని అయిన గురించి ఇలా చదువుతానని అస్సలు ఊహించలేదు.
ఆయినా ఆ విధమైన జీవితానికి రావడానికి కారణాలు ఏంటో మనకి తెలియదు, అయిన పైన ఉన్న గౌరవం కూడా తగ్గిపోదు, కాని ఆ వ్యక్తీ కి అలా కాకుండా ఉండాల్సింది అన్న ఆవేదన.
ఆ గీతం వ్రాసిన వ్యక్తీ గా తప్ప ఆయినా గురించి నాకు ఏమి తెలియదు. ఆయినా గురించి నేను చదివిన రెండో వార్త ఇదే.

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2012/dec/28/navya/28navya2&more=2012/dec/28/navya/navyamain&date=12/28/2012


Wednesday, December 26, 2012

All About My Wife

ఈ మధ్యన ట్రావెల్ చేస్తూ ఒక సినిమా చూసాను.  అదే అల్ అబౌట్ మై వైఫ్ , సౌత్ కొరియన్ మూవీ.
చాలా బాగుంది. ఒక గయ్యాళి భార్య ని వదిలించుకోవడానికి భర్త పడే పాట్లు చాలా నవ్వోస్తాయి.కాని చివరకి
కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
మన చుట్టూ జరిగే కథ ని చూపిస్తూ, మనం చూడని కోణాన్ని చూపించడం ఇందులో ప్రత్యేకత.

కథ విషయానికి వస్తే ..సినిమా ప్రారంభం లో, పేపర్ బాయ్ తో ఘర్షణ పడుతూ కనిపిస్తుంది హీరో వైఫ్. వద్దన్నా ఎందుకు వేస్తున్నావు పేపర్ అని పిచ్చి పిచ్చి గా బూతులు తిడుతుంది. భర్త ఎంత సముదాయించిన వినదు.
ఇక్కడే మనకి అర్ధం అవుతుంది తను గయ్యాళి అని. మచ్చుకి భర్త ఆరోగ్యం గురించి కేర్ తీసుకునే  ప్రాసెస్ లో  అతను బాత్రూం లో ఉన్నా సరే  తీసుకుని వెళ్లి జ్యూస్ ఇస్తుంది, అంతే కాదు కంపెనీ ఇస్తాను అని పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. అతని ముఖం లో భావాలు చూడాలి , పాపం అతనేమో కొంచెం మెతక. చిన్న ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.
భోజనం చేసేటప్పుడు సిగరెట్ కాలుస్తూ ఇల్లు తుడవడం, భర్త ఆఫీసు పార్టీ కి తీసుకుని వెళితే అక్కడ వాళ్ళతో గొడవ పడటం. పక్కింటి వాళ్ళతో గొడవ పడటం, ఇలా ఒక అంతు  ఉండదు.
ఈ సంఘటనలన్నీ మనకి నవ్వు తెప్పిస్తుంటాయి కాని, ఆ  భర్త పడే పాట్లు చూస్తుంటే జాలి కూడా వేస్తుంటుంది.

ఇక చివరకి భరించలేక , వైఫ్ కి దూరంగా ఉండటానికి తెగ ప్రయత్నిస్తుంటాడు, ఆఫీసు పని మీద వేరే వాళ్ళని పంపిస్తుంటే ఇతను మేనేజర్ కాళ్ళు పట్టుకుని నేనే వెళ్తాను అని బ్రతిమాలి వెళ్తాడు. కాని అక్కడకి కూడా వెళ్తుంది ఆమె. ఇక దాంతో విడిపోవాలి అని నిర్ణయించుకుంటాడు. కాని విడాకులు తీసుకుంటే ఇతను పెద్ద మొత్తం లో ఇవ్వాల్సిన భరణం గుర్తొచ్చి భయపడతాడు, అదే ఆవిడే విడాకులు అడిగితె ఇతను ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
అందుకని ఒక ప్లాన్ చేస్తాడు.

ఈ లోపు, వీళ్ళ ఇంటి పక్కన ఒక కాసనోవా ఉంటాడు. వాడి పని అమ్మాయిలతో తిరగడమే. అతను  ఎలాంటి అమ్మాయి నైన ప్రేమించగలడు. అతని దగ్గరకి వెళ్లి తన వైఫ్ ని ప్రేమించమని , ప్రేమించి తన చేతే విడాకులు ఇప్పించమని బ్రతిమాలతాడు. వాడు కాదు పొమ్మని చెప్తే ఇతను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అతనే కాపాడి సరే చేస్తాను అని ఒప్పుకుంటాడు.

ఇక్కడి నుండి కథ బాగుంటుంది . తన వైఫ్ ని ప్రేమించమని బ్రతిమాలి సూసైడ్ చేసోవడానికి ట్రై చేసిన వాడు , మల్లి చివరలో తన వైఫ్ ని వదిలేయమని బ్రతిమాలతాడు.
మొత్త్తం చెప్ప్తేస్తే బాగోదు. మీరే చుడండి.
సారీ, డౌన్లోడ్ లింక్స్ గురించి నాకు ఐడియా లేదు. నెట్ లో ఎక్కడో ఒకచోట దొరుకుందని నా ఉద్దేశ్యం.