Monday, April 6, 2015

కోచి లో పది అడుగుల కి పది వేలు అడిగిన కేరళా కూలి లు , కోపం తో తన ఆర్ట్స్ ని తనే ద్వంసం చేసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్


కోచి లో పది అడుగుల కి పది వేలు అడిగిన కేరళా కూలి లు , కోపం తో తన ఆర్ట్స్ ని తనే ద్వంసం చేసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్ :

మీకు అందరికి తెలిసిందే .. దేవుడి సొంత భూమి ని చాలా సంవత్సరాలు కమ్యూనిస్ట్ లు పరిపాలిస్తున్నారు .
మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ లేబర్ అసోసియేషన్స్ చాలా దారుణాతి దారుణంగా ఉంటాయి . గూండాలకి తక్కువ గా  రౌడీ లకి ఎక్కువగా ..

ఈ మధ్యన కేరళ రాష్ట్రం లో జరిగిన ఒక ఆర్ట్ ఫెస్టివల్ కి అమెరికా నుండి చిత్రకారుడు Waswo X Waswo కూడా ఫోల్గొన్నారు .  తన వస్తువులని ( కేవలం ఆరు పెట్టెలు )  ప్రదర్సన జరిగిన స్థలం నుండి ట్రక్ లోకి తీసుకుని వెళ్ళడానికి  ,( కేవలం పదే పది అడుగులు )  అక్కడ కూలి లు అడిగింది డబ్బై , అరవై వేలు . 
అంటే ఇంట్లో నుండి వస్తువులు  తెచ్చి , లారి లో పెట్టడం . దానికి అంత ఎక్కువగా అడగడం తో విస్తుపోయినా ఆయన వాళ్ళతో బేరం ఆడటానికి ప్రయత్నించారు, కాని  బేరం కనీస మొత్తం పది వేలు నుండి ప్రారభించాలని లేబర్ అసోసియేషన్ కోరడం తో నోటి మాట రాక , కోపం తో తన వస్తువు లన్ని తనే నాశనం చేసేసుకున్నాడు . 

http://www.mouthshut.com/blog/jhihnststm/Watch-Video-Angry-over-Kerala-trade-unions-US-artist-destroys-his-creations

వాళ్ళని కాకుండా వేరే ఎవరిని సహాయం చేయనియ్యరు . అందువలన అతనికి వేరే సహాయం లేక, నిస్సహాయుడై అతని శ్రమ ని అతనే నాశనం చేసుకోవలసి వచ్చింది . అక్కడ ట్రేడ్ యూనియన్స్ చాలా బలంగా ఉంటాయి , చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టి లకి అనుబంధ సంఘాలు గా ఉంటాయి .

ఈ వీడియో చూడండి 




నా స్నేహితుడు , మలయాళీ మాటల్లో ,  వాళ్ళ కుటుంబం గుజరాత్ లో స్థిరపడింది , వాళ్ళ నాన్న రిటైర్ అయిన తరువాత , సొంత రాష్ట్రం లో స్థిరపడాలని , మొత్తం సామాను లారి లో లోడ్ చేసి, కేరళ తీసుకుని వెళ్ళారు .
అక్కడ ఆ సామాను దించడానికి కూలి లు వేలల్లో అడిగారంట , ఇది చెప్పినప్పుడు నేను నమ్మలేదు , మరీ అంత దారుణంగా ఎవరు అడుగుతారు , కాని నా స్నేహితుడు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఎవరు ఎదిరించి మాట్లాడలేరు . వాళ్ళని కాదంటే మీరు ఇంకొకరిని తేచ్చుకోలేరు . స్నేహితులు సహాయం తో అతి కష్టం మీద ఆయన ఆ సామాను దిన్చుకున్నారు .
వంద శాతం అక్షరాస్యత అంటూ ఎన్ని సంవత్సరాలు ప్రచారం చేసుకుంటారో ఆ ప్రభుత్వం . అది తప్ప ఇంకో achievement వినలేదు నేను .

ఐ ఫీల్ సో సారీ ఫర్ హిం . పరాయి దేశం వాళ్ళ దగ్గర పరువు తీసే మన జనాలకి ఎప్పుడు బుద్ది వస్తుందో . కనీసం విదేశీయుల దగ్గర అయినా మన పరువు తీయకుండా ఉంటె మనం ఘనంగా చెప్పుకునే అతిధి దేవో భావ అన్న మాటకి కొంచెం అయినా విలువ ఉంటుంది .